ETV Bharat / entertainment

సల్మాన్​ ట్రిపుల్ రోల్​.. ఒకేసారి 10 మంది హీరోయిన్లతో రొమాన్స్​! - నో ఎంట్రీ

Salman khan: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్​.. తన సూపర్​హిట్ చిత్రం 'నో ఎంట్రీ'కి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో సల్మాన్ 10 మంది హీరోయిన్లతో ఆడిపాడనున్నట్లు సమాచారం. అంతేకాక, ఈ చిత్రంలో సల్మాన్ త్రిపాత్రాభినయం చేయనున్నట్లు సమాచారం.

Salman khan
Salman khan
author img

By

Published : Jun 17, 2022, 10:58 PM IST

Salman khan: బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్, అనిల్ కపూర్, ఫర్దీన్ ఖాన్ కలిసి నటించిన కామెడీ చిత్రం 'నో ఎంట్రీ'.. అప్పట్లో ఘనవిజయం సాధించింది. 2002లో వచ్చిన ఈ సినిమా.. ప్రేక్షకులను పొట్ట చెక్కలయ్యేలా నవ్వించింది. ఇప్పటికీ టీవీలో వచ్చినా అదే స్థాయిలో అలరిస్తూ ఉంటుంది. అందుకే ఈ సినిమా సీక్వెల్​పై సల్మాన్​ ఫ్యాన్స్​ సహా సాధారణ ప్రేక్షకుల్లోనూ విపరీతమైన ఆసక్తి ఏర్పడింది.

తొలుత ఈ సినిమాకు సీక్వెల్​గా 'నో ఎంట్రీ మే ఎంట్రీ' వస్తుందనే వార్తలను మేకర్స్​ ఖండించినా.. అనంతరం ఉంటుందని స్పష్టంచేశారు. దీంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అయితే వారిని మరింత ఆశ్చర్యానికి గురిచేసే ఓ అప్డేట్ ప్రస్తుతం మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో సల్మాన్ త్రిపాత్రాభినయం చేయనున్నట్లు సమాచారం. దాంతో పాటే సినిమాలో 10 మంది హీరోయిన్లు నటించనున్నట్లు తెలుస్తోంది.

దర్శకుడు అనీస్ బజ్మీ, సల్మాన్​.. ఈ ప్రాజెక్టుపై పనిచేయడం ప్రారంభించినట్లు సమాచారం. ఈ ఏడాది చివర్లో షూటింగ్ ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. సల్మాన్​తో పాటు అనిల్, ఫర్దీన్​ కూడా ట్రిపుల్​ రోల్​ చేస్తారని వినికిడి. 'నో ఎంట్రీ'లో లారా దత్తా, సెలీనా జైట్లీ, బిపాషా బసు, ఈషా దేవోల్​ ముఖ్య పాత్రల్లో నటించారు. కాగా, సీక్వెల్​లో ఎవరిని ఎంపిక చేశారన్నది ఇంకా తెలియలేదు. అయితే ఇది మునుపటికన్నా ప్రేక్షకులకు మరింత వినోదాన్ని పంచేలా, భారీ బడ్జెట్​తో రూపొందనున్నట్లు తెలుస్తోంది.

ఇదీ చూడండి: చిరు స్పెషల్​ పార్టీ.. వేడుకలో కమల్​, సల్మాన్​ సందడి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.