ETV Bharat / entertainment

కోలుకున్న సల్మాన్.. ఆ వేడుకలో సందడి.. ఫ్యాన్స్ సంబరాలు - సల్మాన్​ ఖాన్​కు డెంగ్యూ

బాలీవుడ్ భాయ్​ సల్మాన్ ఖాన్ కోలుకున్నట్లు తెలిసింది. ఆయన తాజాగా ఓ వేడుకలో పాల్గొని సందడి చేశారు. దీంతో ఫ్యాన్స్ సంతోషంతో సంబరాలు చేసుకుంటున్నారు.

.
.
author img

By

Published : Oct 26, 2022, 4:18 PM IST

బాలీవుడ్ స్టార్​ హీరో సల్మాన్ ఖాన్ అనారోగ్యానికి గురైనట్లు కొద్ది రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. ఆయనకు డెంగ్యూ జ్వరం వచ్చినట్లు, అందుకే విశ్రాంతి తీసుకున్నట్లు ప్రచారం సాగుతోంది. అయితే తాజాగా ఇప్పుడాయన కోలుకున్నట్లు తెలిసింది. మంగళవారం, ఆయన తన బావమరిది ఆయుష్ శర్మ పుట్టినరోజు వేడుకలో పాల్గొని సందడి చేశారు. దీంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తన అభిమాన హీరోగా ఎప్పటిలాగే ఫిట్​గా, ఆరోగ్యంగా కనిపిస్తుండటంతో సంతోషిస్తున్నారు.

కాగా, గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో సల్మాన్‌కు డెంగ్యూ సోకినట్లు వార్తలు వచ్చాయి. అందుకే ఆయన విశ్రాంతి కోసం బిగ్​బాస్​కు దూరంగా ఉన్నారని, దీంతో కరణ్​ జోహార్​ ఆ షోకు హోస్ట్​గా వ్యవహరిస్తున్నారని ప్రచారం సాగింది. అయితే ఈ విషయంపై సల్మాన్​ కానీ ఆయన సన్నిహితులు కానీ స్పందించలేదు. ఇక సల్మాన్ ప్రస్తుతం 'కిసీ కా భాయ్ కిసీ కి జాన్' చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం 2023 ఈద్ పండగకు విడుదల కానుంది. ఇది ఫర్హాద్ సామ్జీ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా విడుదల కానుంది. ఇందులో పూజా హెగ్డే, వెంకటేష్ దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. షెహనాజ్ గిల్, పాలక్ తివారీ కూడా ఈ చిత్రంలో కనిపించనున్నారు. సల్మాన్, కత్రినా కైఫ్ నటించిన టైగర్ 3 త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. యాక్షన్, కామెడీ, డ్రామా, రొమాన్స్,ఎమోషన్స్​తో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని సల్మాన్ ఖాన్ ఫిల్మ్ నిర్మించింది.

ఇదీ చూడండి: హాలీవుడ్​లో 'ఆర్​ఆర్ఆర్'​కు మరో అరుదైన గౌరవం.. ప్రతిష్టాత్మక అవార్డు సొంతం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.