Salaar Shruti Haasan Interview : రెబల్ స్టార్ ప్రభాస్ లీడ్ రోల్లో 'కేజీఎఫ్' డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ 'సలార్'. పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కిన ఈ మూవీ గతేడాది డిసెంబర్ 22 న విడుదలైన బాక్సాఫీస్ వద్ద ఎన్నో సంచలనాలు సృష్టించింది. రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ అందుకుంది. ఇక ఇందులో ప్రభాస్‌తో పాటు పృథ్వీరాజ్ సుకుమారన్, శ్రుతి హాసన్ కూడా తమ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇటీవలే ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ కూడా గ్రాండ్‌గా జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే హీరోయిన్ శ్రుతి హాసన్ తన కో స్టార్స్ ప్రభాస్, పృథ్వీలను ఇంటర్వ్యూ చేసింది. వారితో సరదాగా ముచ్చటించి అలరించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది.
అయితే మాటల మధ్యలో "అవును ప్రభాస్ నిన్ను అందరూ రెబల్ స్టార్ అని ఎందుకు అంటారు ?" అంటూ శ్రుతి అడిగారు. దీంతో నవ్విన ప్రభాస్ 'మా పెద్దనాన్న రెబల్ స్టార్ అందుకే అలా పిలుస్తారు'. అంటూ బదులిచ్చారు. ఆ తర్వాత " పృథ్వీరాజ్‌తో ఈ సినిమాలో నాకు సీన్లు ఏమీ లేవు మీతో కొన్ని సీన్లు ఉన్నాయి అలానే మీ ఇద్దరికీ ( ప్రభాస్ - పృథ్వీరాజ్) మధ్య కూడా చాలా సీన్లు ఉన్నాయి" అంటూ శ్రుతి అనగా, ప్రభాస్ వెంటనే మరో కౌంటర్ వేశారు. " అవును నీ కంటే పృథ్వీరాజ్‌తోనే నాకు ఎక్కువ సీన్లు ఉన్నాయంటూ నవ్వుకున్నారు. దీంతో సినిమాలో రొమాన్స్ కంటే బ్రొమాన్స్‌యే ఎక్కువ ఉందంటూ శ్రుతి హాసన్ కూడా సెటైర్ వేశారు.
ఇక ఈ ఇంటర్వ్యూలో ప్రభాస్, పృథ్వీరాజ్‌లు 'సలార్' సినిమా గురించి అలాగే ప్రశాంత్ నీల్ మేకింగ్ గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. శ్రుతి కూడా తమ కో స్టార్స్‌ను పొగడ్తలతో ముంచెత్తింది. మరోవైపు శ్రుతి హోస్ట్ చేసిన ఈ ఇంటర్వ్యూను మేకర్స్ రెండు పార్టులుగా ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చారు. ఇది చూసిన ఫ్యాన్స్ మూవీ ప్రమోషన్స్ చాలా విన్నూత్నంగా ఉందంటూ నెట్టింట కామెంట్లు పెడుతున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
- " class="align-text-top noRightClick twitterSection" data="">
Salaar Movie Cast : ఇక 'సలార్' సినిమా విషయానికి వస్తే ఈ చిత్రంలో ప్రభాస్ సరసన కోలీవుడ్ బ్యూటీ శ్రుతి హాసన్ నటిస్తుండగా కీలక పాత్రల్లో పృథ్విరాజ్ సుకుమారన్, బాబీ సింహా, జగపతిబాబు, టిన్నూ ఆనంద్, ఈశ్వరి రావు, శ్రియారెడ్డి, రామచంద్ర రాజు లాంటి స్టార్స్ నటించారు. ప్రశాంత్ నీల్ రూపొందించిన ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతాన్ని సమకూర్చారు. హొంబాలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరంగదూర్ ఈ సినిమాకు నిర్మాణ బాధ్యతలు చేపట్టారు.
'సలార్' మేనియా అన్‌స్టాపబుల్- ఇప్పటి వరకు ఎన్ని రికార్డులు సాధించిందంటే ?
'గేమ్ ఆఫ్ థ్రోన్స్'లా 'సలార్ పార్ట్ 2'- ఫుల్ డ్రామాతో యాక్షన్, పాలిటిక్స్- రిలీజ్ ఎప్పుడంటే?