Salaar Postponed : రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న చిత్రం 'సలార్'. దర్శకుడు ప్రశాంత్ నీల్.. ఈ సినిమాను రెండు పార్ట్‌లుగా తెరకెక్కిస్తున్నారు. ఇందులో భాగంగా 'సలార్ ది సీజ్ ఫైర్' పేరుతో తొలి పార్ట్‌ను సెప్టెంబర్ 28న విడుదల చేయనున్నట్లు మూవీమేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. అయితే రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న సమయంలో ఫ్యాన్స్‌ను షాక్‌కు గురిచేసే వార్త ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది.
సలార్ సినిమా నుంచి రీసెంట్గా గ్లింప్స్, ఫస్ట్ లుక్స్ విడుదలయ్యి.. ప్రేక్షుకుల్లో అంచనాలను అమాంతం పెంచేశాయి. ఇక సినిమా రిలీజ్ కూడా ఇదే నెలలో ఉండటం వల్ల ఇటు ఫ్యాన్స్‌తో పాటు, అటు సినీ ఇండస్ట్రీలోనూ ఉత్కంఠ నెలకొంది. ఇలాంటి తరుణంలో సినిమా రిలీజ్ వాయిదా పడనుందన్న వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. సెప్టెంబర్‌లో కాకుండా సినిమా డిసెంబర్లో విడుదలయ్యే ఛాన్స్ ఉందంటూ పలు కథనాలు వస్తున్నాయి.
అయితే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సీజీ (కంప్యూటర్ గ్రాఫిక్స్) విషయంలో అసంతృప్తిగా ఉన్నారని.. ఇందులో ఆయన రాజీ పడట్లేదని అందుకే విడుదల ఆలస్యం కానుందని ప్రచారం సాగుతోంది. మరోవైపు దీనికి హీరో ప్రభాస్ సర్జరీ కారణం అని అంటున్నారు. కానీ రిలీజ్ పోస్ట్‌పోన్ విషయంలో చిత్ర బృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
తాజాగా ఈ సినిమాకు సంబంధించి.. ప్రభాస్ అభిమాని ఒకరు.. 'సలార్' సెట్‌లో తాను చూసిన విషయాన్ని మీడియాకు వివరించారు. ప్రశాంత్ నీల్ చిన్న సన్నివేశాన్ని కూడా చాలా జాగ్రత్తగా తీస్తున్నారని.. తన విజన్‌కు తగ్గట్లు వచ్చేదాకా ఎక్కడా రాజీ పడటం లేదని తెలిపారు. సినిమాలో ఇంటర్వెల్‌కు ముందు ఓ ఫైట్ ఉంటుందని.. ఆ సీన్లో ప్రభాస్ సుమారు 1000 మందితో తలపడతారని చెప్పారు. దీంతో సినిమాపై అంచనాలు పీక్ స్టేజ్‌కు వెళ్లిపోయాయి.
Salaar Cast : ఈ సినిమాలో శ్రుతిహసన్ హీరోయిన్గా నటిస్తుంది. టాలీవుడ్ సీనియర్ నటుడు జగపతిబాబు కీలక పాత్రలో కనిపించనున్నారు. మీనాక్షి చౌదరి, శ్రియా రెడ్డి, ఝాన్సీ, ఈశ్వరి రావు, పృథ్వీరాజ్ తదితరులు నటిస్తున్నారు. భువన్ గౌడ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తించగా.. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.
- https://youtu.be/bUR_FKt7Iso?si=IAjHur4swT96zEu3&t=1
ప్రభాస్-ప్రశాంత్ కాంబో రిపీట్.. 'సలార్' కంటే..
ఇంటర్నేషనల్ మార్కెట్‌ను టార్గెట్ చేసిన ప్రభాస్.. పాటలు, కామెడీ లేకుండానే!