ETV Bharat / entertainment

'సలార్​'లో దేవ - వరదా సందడి -బిహైండ్​ ద సీన్స్​లో పిక్చర్​ పర్ఫెక్ట్ ఫొటోలు - సుప్రియ మేనన్ పృథ్వీరాజ్

Salaar Behind The Scene Photos : మూవీ లవర్స్​ ఎంతగానో ఎదురుచూసిన 'సలార్' సినిమా డిసెంబర్ 22న విడుదలై థియేటర్లలో సందడి చేస్తోంది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన బిహైండ్​ ద సీన్ ఫొటోలు నెట్టింట తెగ ట్రెండ్ అవుతున్నాయి. ఆ విశేషాలు మీ కోసం

Salaar Behind The Scene Photos
Salaar Behind The Scene Photos
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 23, 2023, 3:19 PM IST

Updated : Dec 23, 2023, 3:48 PM IST

Salaar Behind The Scene Photos : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లీడ్​ రోల్​లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ 'సలార్'. భారీ అంచనాల నడుమ ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ మూవీ ప్రస్తుతం పాజిటివ్​ టాక్ అందుకుని బ్లాక్​ బస్టర్​ దిశగా దూసుకెళ్తోంది. దీంతో ఇప్పుడు ఎక్కడ చూసినా ప్రభాస్​, పృథ్వీరాజ్ గురించే అభిమానులు చర్చించుకుంటున్నారు. ఈ ఇద్దరి గురించి ఏ విషమైన అది నెట్టింట హాట్​ టాపిక్​గా మారిపోతోంది. అయితే తాజాగా ఈ సినిమాలో వరదాగా యాక్ట్​ చేసిన పృథ్యీరాజ్​ సతీమణి సుప్రియా తాజాగా ఇన్​స్టాగ్రామ్​ వేదికగా ఓ వీడియో షేర్ చేశారు. అందులో ఆమె మూవీ షూటింగ్​కు సంబంధించిన బిహైండ్​ ద సీన్స్​ ఫొటోలను అప్​లోడ్​ చేశారు.

"నా ఫేవరెట్ వరద రాజా మానార్‌తో అంటూ పృథ్విరాజ్ సుకుమారన్‌తో ఫోటోలు షేర్ చేసిన సుప్రియ.. ‘సలార్’ గురించి అద్భుతంగా క్యాప్షన్​ను జోడించారు. 'సలార్‌'ను చూస్తున్నంతసేపు చాలా ఆనందంగా అనిపించింది. అందరి పర్ఫార్మెన్స్‌లు ఎంతో బాగుంది. మ్యూజిక్, ఆర్ట్ డైరెక్షన్, సినిమాటోగ్రాఫీ ఇలా అన్ని అంశాలు చాలా అందంగా ఉన్నాయి. ప్రశాంత్ నీల్​కు థ్యాంక్స్​. ఇది మీ ప్రపంచం మేమంతా అందులో జీవిస్తున్నాం. ప్రభాస్ అయితే జస్ట్ వావ్. అందరూ తమ దగ్గర ఉన్న థియేటర్లలో ఈ సినిమాను చూడాలని నేను కోరుకుంటున్నాను" అంటూ సుప్రియ ఈ సినిమా గురించి తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఇవి నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది.

చిన్న వరదాగా మాస్​మహారాజ బంధువు
Karthikeya Dev Salaar Movie : మరోవైపు ఈ సినిమాలో వరదరాజ మన్నార్​ చిన్నప్పటి క్యారెక్టర్​లో ఓ కుర్రాడు తనదైన శైలీలో నటించి ఆకట్టుకున్నాడు. దీంతో ఇతడి గురించి నెట్టింట తెగ ఆరా తీస్తున్నారు.అయితే ఆ కుర్రాడి పేరు కార్తికేయ దేవ్. మాస్​ మహారాజ రవితేజకు బంధువు అవుతాడని తెలిసింది. ప్రస్తుతం పదవ తరగతి చదువుతున్నాడట. ఇక ఈ సినిమాలోని పృథ్వి రాజ్ చిన్నప్పటి పాత్ర కోసం చాలామందిని ఆడిషన్ చేస్తే చివరికి ఈ అబ్బాయి ఎంపికయ్యాడు. ఇక సినిమా కోసం నెల రోజుల పాటు రిహార్సల్స్ చేసి ఆ తర్వాతి 15 రోజుల్లో తన పాత్రకి సంబంధించిన షూటింగ్ ని కంప్లీట్ చేశారంటూ కార్తికేయ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.

'సలార్​' టీమ్​తో రాజమౌళి స్పెషల్​ ఇంటర్వ్యూ​ - ఫుల్​ వీడియో రిలీజ్

సలార్​ మెమోరీస్​- బెస్ట్ ఫ్రెండ్​గా ప్రభాస్​- ఫ్యామిలీతోనే ఉన్నట్లు అనిపించిందట!

Last Updated : Dec 23, 2023, 3:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.