ETV Bharat / entertainment

వెంకీ మామ నట విశ్వరూపం - 'సైంధవ్' ఎలా ఉందంటే? - Saindhav movie hero

Saindhav Twitter Review : టాలీవుడ్​ స్టార్ విక్టరీ వెంకటేశ్​, శ్రద్ధా శ్రీనాథ్​ లీడ్​ రోల్స్​లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ 'సైంధవ్'. భారీ అంచనాల నడుమ నేడు(జనవరి 13న) విడుదలై థియేటర్లలో సందడి చేస్తోంది. ఇంతకీ ఈ మూవీ ఎలా ఉందంటే ?

Saindhav Twitter Review
Saindhav Twitter Review
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 13, 2024, 7:17 AM IST

Updated : Jan 13, 2024, 8:45 AM IST

Saindhav Twitter Review : టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేశ్ లీడ్​ రోల్​లో థియటర్లలోకి వచ్చిన లేటెస్ట్​ మూవీ సైంధవ్​. యాక్షన్​, సెంటిమెంట్ బ్యాక్​డ్రాప్​తో సాగిన ఈ మూవీ శనివారం (జనవరి 13న ) ప్రేక్షకుల ముందుకొచ్చింది. టీజర్, ట్రైలర్​తో ఆద్యంతం అభిమానుల్లో ఆసక్తి పెంచింది. ఇక ఇప్పటికే ప్రీమియర్స్ చూసిన ఆడియెన్స్ ఈ సినిమా గురించి సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. ఇంతకీ ఈ సినిమా ఎలా ఉందంటే ?

ప్రస్తుతం ఈ సినిమాకు పాజిటివ్​ రెస్పాన్స్​ అందుకుంటోంది. ఫస్ట్ హాఫ్ డీసెంట్‌గా ఉందని తొలుత సినిమా స్లో గా సాగినప్పటికీ ఓ ముప్పై నిమిషాల తరువాత ఫుల్ ఫామ్​లోకి వచ్చిందని అంటున్నారు. ఇక యాక్షన్ సీక్వెన్స్, పర్ఫామెన్స్​లతో స్టార్స్ అందరూ ఆకట్టుకున్నారని తమ అభిప్రాయాన్ని తెలుపుతున్నారు. బీజీఎం బాగుందని కితాబులిస్తున్నారు. ఇక నవాజుద్దిన్ సిద్దిఖీ యాక్టింగ్, వెంకీ మామ చేసిన కొన్ని సీన్లు, క్లైమాక్స్ మాత్రం అద్భుతంగా అనిపిస్తాయని అంటున్నారు.

  • #Saindhav Decent 1st Half!

    First 30mins runs on a slow note but picks up after with an interesting storyline, good action sequences and performances. BGM had scope to be a lot better and is quite ineffective till now.

    — Venky Reviews (@venkyreviews) January 12, 2024 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

మరోవైపు ఈ సినిమాలోని సెకండ్ హాఫ్ బాగుందంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. ఓవరాల్‌గా హిట్టు బొమ్మ అని చెబుతున్నారు. అటు వెంకీ మామ ఫ్యాన్స్ కూడా తమ ఫేవరట్​ స్టార్​ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఇందులో ఆయన యాక్షన్​ సీన్స్ బాగున్నాయని, తన నట విశ్వరూపం చూపించారంటూ చెప్పుకొస్తున్నారు.

ఇక ఈ సినిమా విషయానికి వస్తే- 'సైంధవ్​'లో వెంకటేశ్​ సరసన శ్రద్ధా శ్రీనాథ్‌ నటించగా, మరో రెండు కీలక పాత్రలను రుహానీ శర్మ, ఆండ్రియా జెరీమియా పోషించారు. హిట్ సిరీస్​తో మంచి గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ శైలేశ్​ కొలను ఈ సినిమాను గ్రాండ్ స్కేల్​లో తెరకెక్కించారు. ఈ సినిమాతో బాలీవుడ్‌ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. తమిళ నటుడు ఆర్య, బేబీ సారా తదితరులు ఈ సినిమాలో ప్రముఖ పాత్రల్లో కనిపించారు. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్​ పై పాన్ ఇండియా లెవెల్​లో రూపొందిన ఈ చిత్రానికి కోలీవుడ్​ మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్‌ నారాయణన్‌ సంగీతాన్ని అందించారు.

'సెట్స్​లోకి రాకముందు వెంకీ ఆ పని చేస్తారు - అలా చెప్పడం నాకసలు ఇష్టం ఉండదు'

'సైంధవ్' బ్యూటీకీ కోహ్లీ బావ అవుతాడా? - సీక్రెట్ రివీల్ చేసిన హీరోయిన్​

Last Updated : Jan 13, 2024, 8:45 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.