ETV Bharat / entertainment

'థ్యాంక్యూ మామయ్య.. ఇంతకంటే ఇంకేం అడగగలను'.. పవన్​పై సాయిధరమ్​ తేజ్​ ఎమోషనల్​ ట్వీట్​ - విరూపాక్ష మూవీ టీజర్

'రిపబ్లిక్​' సినిమా తర్వాత గ్యాప్​ తీసుకున్న సాయి ధరమ్​ తేజ్..​ సుకుమార్​ శిష్యుడు దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'విరూపాక్ష' సినిమాలో నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్​ను చూసిన పవర్​ స్టార్​ పవన్​ కల్యాణ్​ చిత్ర యూనిట్​ను ప్రశంసించారు. దీంతో సాయి ధరమ్​ తేజ్​ ఎమోషనల్​ అయ్యారు.

sai dharam tej virupaksha movie
sai dharam tej virupaksha movie
author img

By

Published : Feb 28, 2023, 2:19 PM IST

దాదాపు ఏడాదిన్నర గ్యాప్​ తర్వాత టాలీవుడ్​ సుప్రీమ్​ హీరో సాయి ధరమ్ తేజ్​ ప్రేక్షకుల ముందుకు రానున్నారు. తన 15వ సినిమాకు 'విరూపాక్ష' అనే టైటిల్​ను ఖరారు చేసింది మూవీ టీమ్​. 'పుష్ప' డైరెక్టర్​ సుకుమార్ ఈ సినిమాకు కథను అందించగా.. ఆయన శిష్యుడు కార్తిక్​ దండు దర్శకుడిగా మారి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ సినిమాలో సాయి ధరమ్​ తేజ్​ సరసన సంయుక్త హీరోయిన్​గా నటిస్తున్నారు. కాగా 'కాంతార' ఫేమ్​ మ్యూజిక్​ డైరెక్టర్ అజనీష్​ లోకనాథ్​ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ​

ఓ భిన్నమైనకథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమా ఏప్రిల్​ 21న థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే టైటిల్​ గ్లింప్స్​తో అభిమానుల్లో భారీ అంచనాలను పెంచేసింది. అంతే కాకుండా ప్రమోషన్లలో భాగంగా సినిమా యూనిట్​ పలు అప్​డేట్లను ప్రేక్షకుల ముందుకు తెస్తోంది. ఇటీవలే ఓ బైక్​ స్టంట్​ వీడియోను సోషల్​ మీడియాలో రిలీజ్​ చేసింది. తాజాగా ఈ మూవీ టీజర్​ను రిలీజ్​ చేసేందుకు చిత్ర యూనిట్​ సన్నాహాలు చేస్తోంది. మార్చి 1న రిలీజ్​ చేసేందుకు సిద్ధమైన టీజర్​ను అంత కంటే ముందే పవర్​ స్టార్​ పవన్​ కల్యాణ్​కు చూపించింది. టీజర్​ చూసిన పవన్​.. బాగుందంటూ మూవీ టీమ్​ను ప్రశంసించారు. ఇక టీజర్​ రిలీజ్​ సమయంలో తీసిన కొన్ని ఫొటోలను సాయి ధరమ్​ తేజ్​ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్​ చేశారు.

sai dharam tej virupaksha movie teaser
విరూపాక్ష టీజర్​ను ఓపెన్​ చేస్తున్న పవన్​ కల్యాణ్​
sai dharam tej virupaksha movie teaser
చిత్ర యూనిట్​కు అభినందనలు తెలుపుతున్న పవన్​ కల్యాణ్​

''ఇంతకంటే ఇంకేం అడగగలను.. 'విరూపాక్ష' సినిమా నా జీవితంలో ఓ కీలకమైన అడుగు లాంటిది. అలాంటి క్షణాన్ని మామయ్య ఆశీస్సులతో ప్రారంభించడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. కళ్యాణ్ మామా మీ ప్రేమకు, ప్రశంసలకు ఎల్లప్పుడూ.. మీరు నా కోసం నిలబడుతున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు'' అంటూ ఓ ఎమోషనల్​ ట్వీట్​ను పోస్ట్​​ చేశారు.

sai dharam tej virupaksha movie teaser
పవన్​ కల్యాణ్​
sai dharam tej virupaksha movie teaser
పవన్​ కల్యాణ్​

కాగా 'విరూపాక్ష' సినిమాతో బిజీగా ఉన్న సాయి ధరమ్​ తేజ్..​ తమిళ నటుడు సముద్రఖని తెరకెక్కిస్తున్న 'వినోదాయ సీతమ్​' రీమేక్​లో పవన్​ కల్యాణ్​తో నటిస్తున్నారు. అటు పవన్​ కల్యాణ్​ కూడా వరుస సినిమా షూట్లతో బిజీగా ఉన్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.