ETV Bharat / entertainment

'ఆర్​ఆర్ఆర్​' సరికొత్త రికార్డ్​.. ఏకైక ఇండియన్​ సినిమాగా..! - రాజమౌలీ

RRR records worldwide: దర్శక దిగ్గజం ఎస్​ఎస్​ రాజమౌళి తెరకెక్కించిన సెన్సేషనల్​ మల్టీస్టారర్​ చిత్రం ఆర్ఆర్​ఆర్​ మరో అరుదైన ఘనత దక్కించుకుంది. ప్రముఖ ఇంటర్నేషనల్​ మూవీ డేటా బేస్​ సంస్థ-ఐఎండీబీలో మోస్ట్​ పాపులర్​ లిస్ట్​లో టాప్​-5లో నిలిచిన ఏకైక ఇండియన్​ సినిమాగా గుర్తింపు పొందింది.

rrr records worldwide
ఆర్​ఆర్​ఆర్​ సెన్సేషన్
author img

By

Published : Apr 5, 2022, 8:42 AM IST

Updated : Apr 5, 2022, 9:22 AM IST

RRR records worldwide: ఎన్టీఆర్​- రామ్​ చరణ్​ ప్రధాన పాత్రల్లో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్​ఆర్​ఆర్​' రికార్డులు బద్దలు కొడుతోంది. ఇప్పటికే అనేక రికార్డులను బ్రేక్​ చేసిన ఈ సినిమా మరో అరుదైన ఘనత దక్కించుకుంది. ప్రముఖ అంతర్జాతీయ మూవీ డేటా బేస్​ సంస్థలో (ఐఎండీబీ) మోస్ట్​ పాపులర్​ లిస్ట్​లో ఉన్న ప్రపంచవ్యాప్త టాప్​ 5 సినిమాల్లో ఒకటిగా నిలిచింది. అలాగే ఏకైక ఇండియన్​ సినిమాగానూ రికార్డు సాధించింది. మరోవైపు.. ఆర్​ఆర్​ఆర్​ చిత్రానికి ఇతర హాలీవుడ్​ సినిమాలను మించి ఎక్కువ రేటింగ్​ కూడా నమోదు కావటం గమనార్హం.

రూ.వెయ్యి కోట్లు కలెక్షన్లు: క‌థ‌లో భావోద్వేగాల్ని పండించ‌డంలో మాస్ట‌ర్ రాజ‌మౌళి. ఆయ‌న సినిమా అంటే భావోద్వేగాల‌తో పాటు, తెర‌కు నిండుద‌నం తీసుకొచ్చే విజువ‌ల్ గ్రాండ్‌నెస్ కూడా. ఆ రెండు విష‌యాల్లో త‌నదైన ప్ర‌భావం చూపించి తాను 'మాస్ట‌ర్ కెప్టెన్' అని ఆర్​ఆర్​ఆర్​తో మ‌రోసారి చాటారు. మార్చి 25న విడుదలైన ఆర్​ఆర్​ఆర్​ చిత్రం రికార్డులు తిరగరాస్తూ బాక్సాఫీస్​ వద్ద రూ.వెయ్యి కోట్ల కలెక్షన్ల దిశగా దూసుకెళ్తోంది​.

నటీనటులు: ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌, అజయ్‌దేవ్‌గణ్‌, అలియా భట్‌, ఓలివియా మోరిస్‌, సముద్రఖని, అలీసన్‌ డూడీ, రేస్టీవెన్‌ సన్‌, శ్రియ తదితరులు; సంగీతం: ఎం.ఎం.కీరవాణి; సినిమాటోగ్రఫీ: కె.కె.సెంథిల్‌ కుమార్‌; ఎడిటింగ్‌: శ్రీకర్‌ ప్రసాద్‌; కథ: కె.వి.విజయేంద్ర ప్రసాద్‌; సంభాషణలు: సాయి మాధవ్‌ బుర్రా; నిర్మాత: డీవీవీ దానయ్య; స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎస్‌.ఎస్‌.రాజమౌళి; బ్యానర్‌: డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌; విడుదల: 25-03-2022

ఇదీ చూడండి:

Last Updated : Apr 5, 2022, 9:22 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.