ETV Bharat / entertainment

'ఆర్​ఆర్​ఆర్' టికెట్లు ఎంత ప్రయత్నించినా దొరకలేదు: శ్రియ - ఆర్​ఆర్​ఆర్​ సినిమా తారక్

RRR movie heroine Shriya saran: ఎన్టీఆర్​, రామ్​చరణ్​లకు చాలా కాలం తర్వాత వాళ్ల స్టార్‌డమ్‌కు సరిపడా హిట్‌ వచ్చిందని అన్నారు హీరోయిన్ శ్రియ. 'ఛత్రపతి' తర్వాత 'ఆర్‌ఆర్‌ఆర్‌' కోసం రాజమౌళితో కలిసి మళ్లీ పనిచేయడం ఆనందంగా ఉందని చెప్పారు. ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభమయ్యాకనే తారక్‌, చరణ్​ ప్రధాన పాత్రధారులని తనకు తెలిసినట్లు పేర్కొన్నారు.

shreya RRR movie
శ్రియ ఆర్​ఆర్​ఆర్​
author img

By

Published : Mar 31, 2022, 11:45 AM IST

RRR movie heroine Shriya saran: 'ఆర్‌ఆర్‌ఆర్‌' చిత్రాన్ని తానింకా వీక్షించలేదని నటి శ్రియ అన్నారు. ఎంతో ప్రయత్నించినప్పటికీ సినిమా టిక్కెట్లు దొరకడం లేదని, ప్రతి చోటా హౌస్‌ఫుల్‌ బోర్డులే కనిపిస్తున్నాయని ఆమె తెలిపారు. ‘ఈ సినిమాలో అజయ్‌ దేవ్‌గణ్‌కు జోడీగా సరోజిని పాత్రలో శ్రియ కనిపించారు. తాజాగా ఓ ఇంటర్వ్వూలో పాల్గొన్న ఈమె.. 'ఛత్రపతి' తర్వాత 'ఆర్‌ఆర్‌ఆర్‌' కోసం రాజమౌళితో కలిసి పనిచేయడం ఆనందంగా ఉందని ఆమె తెలిపారు.

"ఛత్రపతి కోసం మొదటిసారి రాజమౌళి సర్‌తో కలిసి వర్క్‌ చేసే అవకాశం వచ్చింది. అది నా కెరీర్‌లో సూపర్‌హిట్‌. దాని తర్వాత రాజమౌళి సినిమాలో అవకాశం వస్తే తప్పకుండా నటించాలని ఎన్నో ఏళ్ల నుంచి ఎదురుచూస్తున్నా. అలాంటి సమయంలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో ఓ కీలకపాత్ర పోషించే అవకాశం దక్కింది. రాజమౌళి టీమ్‌తో కలిసి మరోసారి వర్క్‌ చేయడం ఎంతో ఆనందాన్నిచ్చింది. భవిష్యత్తులో మళ్లీ అవకాశం వస్తే తప్పకుండా ఆయన సినిమాలో భాగం అవుతా. ఆర్​ఆర్​ఆర్​ కోసం రాజమౌళి సినిమా అనగానే సంతకం చేసేశాను. నా రోల్‌ ఏమిటి? నాతోపాటు ఎవరు వర్క్‌ చేస్తున్నారు? మెయిన్‌ నటీనటులు ఎవరు అనేది కూడా తెలుసుకోలేదు. షూటింగ్‌ ప్రారంభమయ్యాకనే రామ్‌చరణ్‌, తారక్‌ ఈ సినిమాలో ప్రధాన పాత్రధారులని తెలిసింది. సినిమా విడుదలయ్యాక ప్రేక్షకుల నుంచి వస్తోన్న స్పందన చూస్తుంటే మాటల్లో చెప్పలేనంత ఆనందాన్ని పొందుతున్నాను. చరణ్‌, తారక్‌లకు ఇన్నేళ్ల తర్వాత వాళ్ల స్టార్‌డమ్‌కు సరిపడా హిట్‌ వచ్చిందని భావిస్తున్నా"

ఆర్​ఆర్​ఆర్​ సినిమా చూశారా అని అడిగిన ప్రశ్నకు మాట్లాడుతూ.. "నేనింకా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా చూడలేదు. సినిమా విడుదలైన సమయంలో నేను ముంబయిలో ఉన్నాను. అక్కడ పలు థియేటర్లలో టిక్కెట్ల కోసం ప్రయత్నించాను. కానీ ఎక్కడా ఖాళీ లేదు. ప్రతి సినిమా హాలు హౌస్‌ఫుల్లే‌. ప్రస్తుతం వేరే సినిమా షూటింగ్‌ పనుల కోసం బెంగళూరుకు వచ్చాను. ఇక్కడ కూడా థియేటర్లు ఫుల్‌. వచ్చేవారమైన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టికెట్లు దొరుకుతాయని అనుకుంటున్నా" అని శ్రియ తెలిపారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: ఐస్​బేబీలా సోనాల్​ చౌహాన్​.. శ్రుతిహాసన్​ కిల్లింగ్ లుక్స్​​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.