ETV Bharat / entertainment

'ఆర్​ఆర్​ఆర్​ కలెక్షన్స్'​.. తొమ్మిదో రోజూ ఆగని జోరు.. ఎంతంటే? - ఆర్​ఆర్​ఆర్ సినిమా కలెక్షన్స్​ తెలుగు రాష్ట్రాల్లో

RRR Day 9 worldwide collections: 'ఆర్ఆర్​ఆర్'​ కలెక్షన్ల జోరు ఏమాత్రం తగ్గట్లేదు. తొమ్మిది రోజులు పూర్తయ్యేసరికి ప్రపంచవ్యాప్తంగా రూ.800కోట్లు సాధించినట్లు ట్రేడ్​ వర్గాలు పేర్కొంటున్నాయి.

RRR Day 9 Worldwide collctions
ఆర్​ఆర్​ఆర్​ కలెక్షన్స్
author img

By

Published : Apr 3, 2022, 12:50 PM IST

RRR Day 9 worldwide collections: రాజమౌళి దర్శకత్వంలో రామ్‌చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో వచ్చిన 'ఆర్​ఆర్​ఆర్​' కలెక్షన్ల సునామీ కొనసాగుతోంది. మార్చి 25న రిలీజైన ఈ సినిమా తొమ్మిది రోజులు పూర్తయ్యే సరికి ప్రపంచవ్యాప్తంగా రూ.800 కోట్ల గ్రాస్​ వసూళ్లు సాధించినట్లు తెలిసింది. హిందీలో ఇప్పటికే రూ.160కు పైగా కోట్లు (గ్రాస్) వసూలుచేయగా.. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే డబుల్​ సెంచరీ కొట్టింది.

తెలుగు రాష్ట్రాల్లో ఇలా.. తెలుగు రాష్ట్రాల్లో రూ.215కోట్ల గ్రాస్​ను సాధించినట్లు తెలిసింది. నైజాంలో అయితే ఆల్​ టైం​ రికార్డును సృష్టించినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. రూ.90కోట్లకు పైగా షేర్​ను అందుకుని అగ్రస్థానంలో నిలిచినట్లు పేర్కొంటున్నాయి. ఇదే కనుక నిజమైతే నైజాంలో అంత మొత్తంలో వసూళ్లను అందుకున్న ఏకైక చిత్రం 'ఆర్​ఆర్​ఆర్'​ అవుతుంది.

'బాహుబలి 2' కన్నా మూడింతలు ఎక్కువ.. తెలుగు రాష్ట్రాల్లో 'బాహుబలి 2' తొమ్మిదో రోజు రూ.6.51 కోట్లు కలెక్షన్లు అందుకోగా.. 'ఆర్​ఆర్​ఆర్' ఏకంగా 19.62 కోట్లను కలెక్ట్​ చేసింది. ఆ తర్వాత 'సరిలేరు నీకెవ్వరూ'-6.33కోట్లు, 'అల వైకుంఠపురములో'-5.05కోట్లు, 'ఎఫ్​ 2'-రూ.4.76కోట్లు, 'పుష్ప'- 3.43కోట్లు సాధించాయి.

రెండు సినిమాలు మాత్రమే.. భారత చిత్రసీమ బాక్సాఫీస్​ ముందు తొమ్మిదో రోజు పూర్తయ్యేసరికి రూ.500కోట్లకు పైగా నెట్​ వసూలు చేసిన సినిమాలు రెండే ఉన్నాయి. అందులో ఒకటి 'బాహుబలి 2' కాగా, రెండోది 'ఆర్​ఆర్​ఆర్'​. రూ.400కోట్లకు పైగా నెట్​ సాధించిన సినిమాల్లో రోబో 2.0 కూడా ఉంది.

ఇదీ చూడండి: సీఎం ముందు అజిత్​ సాహసం.. ఈల వేసిన రజనీకాంత్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.