ETV Bharat / entertainment

హ్యాండీక్యాప్డ్​గా రామ్​చరణ్​.. RC 16 స్టోరీ లీక్​.. విలన్​గా స్టార్ హీరో! - RC 16 విలన్​గా స్టార్ హీరో

RC 16 story leak : ఆర్​సీ 16 సినిమా కథ ఇదేనంటూ నెట్టింట్లో ఓ ప్రచారం సాగుతోంది. అలాగే సినిమాలో నటించే నటీనటులు వివరాలు కూడా తెలిశాయి. ఆ వివరాలు..

RC 16 story leak
హ్యాండీక్యాప్డ్​గా రామ్​చరణ్​.. RC 16 స్టోరీ లీక్​.. విలన్​గా స్టార్ హీరో
author img

By

Published : Jul 8, 2023, 4:52 PM IST

Updated : Jul 8, 2023, 5:19 PM IST

RC 16 story leak : 'ఆర్​ఆర్​ఆర్' వరల్డ్​ వైడ్​గా​ బిగ్గెస్ట్​ హిట్​ అందుకున్న మెగాపవర్ స్టార్ రామ్​చరణ్​.. ప్రస్తుతం తమిళ దిగ్గజ దర్శకుడు శంకర్​తో కలిసి ఆర్​సీ 15 గేమ్​ ఛేంజర్ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రం పొలిటికల్ నేపథ్యంలో భారీ బడ్జెట్​తో రూపొందుతోంది. దీని తర్వాత ఉప్పెన ఫేమ్​ బుచ్చిబాబు దర్శకత్వంలో ఆర్​సీ 16 సినిమా చేయనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్​ జరుగుతున్నాయి. అయితే ఈ సినిమా స్పోర్ట్స్ నేపథ్యంలో ఉంటుందని గతంలోనే ప్రచారం సాగింది. ఇప్పుడు తాజాగా ఈ సినిమా నటీనటుల వివరాలు, అలాగే సినిమా కథ ఇదేనంటూ కొత్త ప్రచారం తెరపైకి వచ్చింది.

RC 16 cast and crew : ముందుగా ప్రచారం సాగినట్టే ఈ సినిమా స్పోర్ట్స్​ డ్రామాగా రూపొందనుందని తెలిసింది. అయితే ఈ చిత్రంలో రామ్​చరణ్​ హ్యాండీక్యాప్డ్​గా కనిపించనున్నారట. ఆయనకు ఓ కాలు ఉందట. అంతర్జాతీయ వేదికపై ట్రోఫీని ముద్దాడాలనే లక్ష్యంతో క్రీడా పోటీల్లో పాల్గొనే ఆయనకు.. ఆ ప్రయాణంలో అనుకోని ప్రమాదం వల్ల ఓ కాలు పోతుందట. ఆ తర్వాత ఓ చిన్న గ్రామంలో కొత్త జట్టును బలంగా తయారు చేసి.. అంతర్జాతీయ వేదికపై కప్​ కొట్టాలన్న తన కలను.. ఆ జట్టు ద్వారా తీర్చుకుంటారట. ఇదే సినిమా కథ అని ప్రచారం సాగుతోంది. ఇకపోతే ఈ సినిమాలోనూ ప్రతినాయకుడిగా తమిళ స్టార్ యాక్టర్​ విజయ్​ సేతుపతిని ప్రతినాయకుడిగా తీసుకున్నారట. బాలీవుడ్​ భామ జాన్వీ కపూర్ హీరోయిన్​గా నటించనుందట. ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహ్మాన్​ సంగీతం అందించనున్నట్లు తెలిసింది.

ఇకపోతే రామ్​ చరణ్​ ప్రస్తుతం గేమ్​ ఛేందర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. అయితే రీసెంట్​గా ఆయనకు ఓ పండంటి ఆటబిడ్డ జన్మించింది. ఆ పాపకు పేరు క్లీంకార అని నామకరణం చేశారు. దీంతో మెగా ఫ్యామిలీలో ఆనందం రెట్టింపు అయింది. అందుకే ప్రస్తుతానికి కొద్ది రోజులు రామ్​చరణ్​ షూటింగ్​కు గ్యాప్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత గేమ్​ ఛేంజర్​ షూటింగ్​లో పాల్గొంటారట. ఈ సినిమా షూట్ అయిపోయాక.. ఆర్​ సీ 16 షూటింగ్ ప్రారంభంకానుంది.

ఇదీ చూడండి :

రామ్​చరణ్​-ఉపాసన కుమార్తెకు నామకరణం.. పేరుకు అర్థం ఇదేనట!

Pawankalyan instagram : పవన్​కు 6 గంటలు.. మరి చరణ్​-ఎన్టీఆర్​-బన్నీకి ఎంత సేపు పట్టిందంటే?

Last Updated : Jul 8, 2023, 5:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.