ETV Bharat / entertainment

అసురుల చక్రవర్తిలా రవితేజ.. రాక్షస పేర్లతో మన హీరోల కొత్త సినిమాలు - సాహసాలు చేసే డెవిల్‌లో కల్యాణ్​ రామ్​

అగ్ర కథానాయకుల చిత్రాలకు పేరు ఖరారు చేయడం అంత ఆషామాషీ వ్యవహారం కాదు. ఆ పేరు శక్తిమంతంగా ఉండాలి.. కథకు తగ్గట్లుగా కనిపించాలి. పలకడానికి వీలుగా.. ట్రెండీగా.. ఆకర్షణీయంగా ఉండాలి..

raviteja rajshekar kalyan ram
రవితేజ రాజశేఖర్​ కల్యాణ్​రామ్​
author img

By

Published : Nov 2, 2022, 7:03 AM IST

అగ్ర కథానాయకుల చిత్రాలకు పేరు ఖరారు చేయడం అంత ఆషామాషీ వ్యవహారం కాదు. ఆ పేరు శక్తిమంతంగా ఉండాలి.. కథకు తగ్గట్లుగా కనిపించాలి. పలకడానికి వీలుగా.. ట్రెండీగా.. ఆకర్షణీయంగా ఉండాలి.. ఇలా పేరు ఖరారు వెనుక బోలెడన్ని లెక్కలుంటాయి. అయితే ట్రెండ్‌లో భాగం కావొచ్చు.. యాదృచ్చికం కావొచ్చు.. ఇప్పుడు పలువురు కథానాయకులు అసుర నామధేయులుగా వినోదాలు పంచేందుకు సిద్ధమవుతున్నారు. టైటిళ్లతోనే సినిమాపై అంచనాలు పెంచేస్తున్నారు.

.

అసురుల చక్రవర్తిలా.. రవితేజ
"సురలోకాధినేత.. అసురుల చక్రవర్తి.. లంకాధిపతి.. ఈ రావణాసురుడు" అంటూ ‘జైలవకుశ’లో ప్రతినాయక ఛాయలున్న పాత్రలో అదరగొట్టారు జూ.ఎన్టీఆర్‌. ఇప్పుడా ‘రావణాసుర’ పేరునే టైటిల్‌గా పెట్టుకొని వినోదాలు పంచేందుకు సిద్ధమయ్యారు కథానాయకుడు రవితేజ. సుధీర్‌ వర్మ తెరకెక్కిస్తున్న చిత్రమిది. అభిషేక్‌ నామా నిర్మిస్తున్నారు. వినూత్నమైన యాక్షన్‌ థ్రిల్లర్‌ కథతో రూపొందుతోన్న ఈ సినిమాలో న్యాయవాదిగా సందడి చేయనున్నారు రవితేజ. ఇందులో ఆయనది కాస్త గ్రే షేడ్‌ ఉన్న పాత్రని సమాచారం. అందుకే ఆ లక్షణాల్ని ప్రతిబింబించేలాగే ‘రావణాసుర’ అన్న టైటిల్‌ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో హీరో సుశాంత్‌.. రామ్‌ అనే ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోన్న ఈ సినిమా ఏప్రిల్‌ 7న విడుదల కానుంది.

.

సాహసాలు చేసే 'డెవిల్‌'
ఇటీవలే ‘బింబిసార’తో భారీ విజయాన్ని అందుకున్నారు కథానాయకుడు కల్యాణ్‌ రామ్‌. ఇప్పుడు ‘డెవిల్‌’గా థ్రిల్‌ పంచేందుకు సిద్ధమవుతున్నారు. నవీన్‌ మేడారం తెరకెక్కిస్తున్న పాన్‌ ఇండియా చిత్రమిది. దేశానికి స్వాతంత్య్రం రాకముందు.. 1945 బ్రిటిష్‌ ఇండియా, మద్రాస్‌ ప్రెసిడెన్సీ నేపథ్యంలో జరిగే కథతో రూపొందుతోంది. ఇందులో కల్యాణ్‌ రామ్‌ బ్రిటీష్‌ సీక్రెట్‌ ఏజెంట్‌గా కనిపించనున్నారు. ఆంగ్లేయుల రహస్య గూఢచారిగా ఉన్న అతను ఓ రహస్యాన్ని చేధించే క్రమంలో ప్రేమ, మోసం, ద్రోహం వలయాల్లో ఎలా చిక్కుకున్నాడు? వాటిని నుంచి ఎలా బయటపడ్డాడు? అన్నది సినిమాలో ఆసక్తికరంగా చూపించనున్నారు. ఒకరకంగా ఈ చిత్రంలో కల్యాణ్‌రామ్‌ది తొలుత ప్రతినాయక ఛాయలున్న పాత్రలా కనిపిస్తుందని, తర్వాత మంచి వైపు నిలబడి పోరాడుతుందని తెలుస్తోంది. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోన్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

.

యాక్షన్‌ రాక్షసుడు!
కొన్నాళ్లుగా థ్రిల్లర్‌ కథలతోనే ప్రయాణం చేస్తూ వస్తున్నారు కథానాయకుడు రాజశేఖర్‌. ఇప్పుడాయన ‘మాన్‌స్టర్‌’గా మరో యాక్షన్‌ థ్రిల్లర్‌ రుచి చూపించేందుకు సిద్ధమవుతున్నారు. పవన్‌ సాధినేని తెరకెక్కిస్తున్న చిత్రమిది. తన లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్న క్రమంలో పోలీసులు, గ్యాంగ్‌స్టర్ల మధ్య ఇరుక్కున్న ఓ మాన్‌స్టర్‌ కథ ఇది. ఆ శక్తిమంతమైన పాత్రను రాజశేఖర్‌ పోషిస్తున్నట్లు సమాచారం. ఇందులో యువ కథానాయకుడు రాజ్‌తరుణ్‌ ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. ఇది వచ్చే ఏడాది విడుదల కానుంది.

పట్టాలెక్కకుండానే.. ప్రచారం షురూ!
ఎన్టీఆర్‌, ప్రశాంత్‌ నీల్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా ఖరారైన సంగతి తెలిసిందే. ఇది వచ్చే ఏడాది సెట్స్‌పైకి వెళ్లనుంది. అయితే ఈలోగానే టైటిల్‌ విషయమై నెట్టింట ప్రచారం మొదలైపోయింది. ఈ సినిమాకి ‘అసుర’, ‘అసురుడు’ అనే పేర్లు పరిశీలిస్తున్నట్లు వార్తలు ఊపందుకున్నాయి. దీనిపై చిత్ర బృందం నుంచి ఇంత వరకు స్పష్టత రాకున్నా.. సినిమాలో రక్తపాతం ఓ స్థాయిలో ఉండనున్నట్లు ప్రచార చిత్రంతోనే తెలియపరిచేసింది చిత్ర బృందం. ‘‘రక్తంతో తడిసి ముద్దైన చరిత్రనే ఈ నేల గుర్తుపెట్టుకుంటుంది. అతని నేల.. అతని చరిత్ర.. కానీ అతని రక్తం కాదు’’ అంటూ ఆ మధ్య విడుదల చేసిన ఎన్టీఆర్‌ ఫస్ట్‌లుక్‌తోనే ఈ చిత్రంలో ఆయన పాత్ర ఎలా ఉంటుందో చెప్పేశారు. ​

ఇదీ చదవండి: పునీత్​ రాజ్​కుమార్​కు కర్ణాటక రత్న అవార్డు రజనీ ఎన్టీఆర్​కు ఘనస్వాగతం

అల్లుఅర్జున్​ సీక్రెట్స్​ను అతడికే చెప్తారట.. భార్యకు కూడా నో

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.