ETV Bharat / entertainment

'ప్రతి సీజన్​లో రవితేజ మూవీ పక్కా!'.. ఇంట్రెస్టింగ్​గా మాస్​ మహారాజా 'ఈగల్' టీజర్!

author img

By

Published : Jun 12, 2023, 7:33 PM IST

Updated : Jun 12, 2023, 7:39 PM IST

Raviteja Eagle Movie : డైరెక్టర్​ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కుతున్న మూవీ టైటిల్‌ను 'ఈగల్​'గా ప్రకటించారు. దాంతోపాటు టీజర్​ను కూడా విడుదల చేశారు. ఎంతో ఆసక్తికరంగా ఉన్న ఆ చిన్న టీజర్​ను మీరూ చూసేయండి.

Raviteja Eagle Movie
Raviteja Eagle Movie

Raviteja Eagle Movie : మాస్​ మహారాజా రవితేజ, హీరోయిన్​ అనుపమా పరమేశ్వర్ ప్రధాన పాత్రల్లో డైరెక్టర్​ కార్తీక్​ ఘట్టమనేని తెరకెక్కిస్తున్న మూవీ టైటిల్‌ను సోమవారం ప్రకటించారు. ఈ మూవీకి 'ఈగల్' టైటిల్‌ను ఖరారు చేశారు. అంతేకాదు.. టైటిల్‌తోపాటు మూవీపై ఆసక్తికలిగించే ఒక చిన్న టీజర్‌ను కూడా రిలీజ్​ చేశారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Raviteja Eagle Teaser : టైటిల్ అనౌన్స్‌మెంట్ టీజర్ విషయానికి వస్తే.. ఒక పెయింటర్ గురించి రా ఏజెంట్స్ అవసరాల శ్రీనివాస్, మధుబాల గాలిస్తున్నట్లు చూపించారు. అయితే, అతడు పెయింటర్ కాదని, పత్తి పండించే రైతని, రోజంతా పంటు గురించే ఆలోచన అంటూ మరో పాత్రతో రవితేజ క్యారెక్టర్‌ను రివీల్ చేశారు. "కొంతమంది చూపు.. మనిషి ఎప్పుడు ఆగాలో డిసైడ్ చేసే చూపు" అంటూ నవదీప్ డైలాగ్‌తో రవితేజ పాత్రపై మరింత ఆసక్తికలిగించారు. "ఒక మనిషి చుట్టూ ఇన్ని కథలేంటీ? ఒక వ్యక్తికి ఇన్ని అవతారాలేంటీ?" అంటూ అనుపమా పరమేశ్వరన్ డైలాగ్‌తో మూవీ టైటిల్‌ను 'ఈగల్'ను రివీల్ చేశారు. "ఆ చూపే మరణం.. ఆ అడుగే సమరం.." అంటూ టీజర్ ముగిసింది.

Raviteja Eagle Producer : వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానున్న ఈ మూవీని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తోంది. ఇప్పటికే ఈ నిర్మాణ సంస్థ నుంచి వచ్చి 'ధమాకా' మూవీ ఎంత పెద్ద హిట్ కొట్టిందో తెలిసిందే. అంతేకాదు, రవితేజ కెరీర్‌లో రూ.100 కోట్లను సాధించిన చిత్రంగా నిలిచింది.

వరుస సినిమాలతో రవితేజ బిజీ బిజీ!
ఇటీవలే రవితేజ 'టైగర్ నాగేశ్వరరావు' మూవీ పోస్టర్‌ను గోదావరి రైల్వే బ్రిడ్జి మీద భారీ స్థాయిలో విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆ మూవీ గ్లింప్స్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. 'టైగర్ నాగేశ్వరావు', 'ఈగల్' మూవీలతోపాటు రవితేజ మరో సినిమాలో కూడా నటిస్తు్న్నట్లు తెలిసింది. ఆ మూవీలో హీరో శర్వానంద్​ కూడా నటిస్తున్నట్లు సమాచారం. ఈ మూవీకి 'కలర్ ఫోటో' ఫేమ్ సందీప్ రాజ్ దర్శకత్వం వహించనున్నారని తెలిసింది. ఈ సినిమాలో లెక్చరర్ పాత్రలో రవితేజ కనిపించనున్నట్లు తెలుస్తోంది. 'మిరపకాయ్' తర్వాత రవితేజ లెక్చరర్ రోల్ చేయడం ఇదే. రవితేజకు శిష్యుడిగా స్టూడెంట్ పాత్రలో శర్వానంద్ కనిపిస్తారని సమాచారం.

'ప్రతి సీజన్​లో రవితేజ మూవీ పక్కా!'
Raviteja Movies : రవితేజ కొత్త సినిమా టీజర్​ను చూసి అభిమానులు.. ఎంతో ఆసక్తికరంగా ఉందని కామెంట్లు పెడుతున్నారు. ప్రతి సీజన్​లో రవితేజ సినిమా పక్కాగా ఉంటుందని అంటున్నారు. ఏ సీజన్​లో అయినా రవితేజనే కనిపిస్తున్నారని అంటున్నారు. అయితే ఇదే నిజమని చెప్పువచ్చు.

ఎందుకంటే గతేడాది క్రిస్మస్​కు 'ధమాకా' సినిమాతో వచ్చిన రవితేజ.. ఈ ఏడాది సంక్రాంతికి మెగాస్టార్​ చిరంజీవి నటించిన 'వాల్తేరు వీరయ్య'లో కనిపించి సందడి చేశారు. వేసవిలో 'రావణాసుర' చిత్రంతో పలకరించిన రవితేజ.. దసరాకు 'టైగర్​ నాగేశ్వరరావు'గా రానున్నారు. ఇప్పుడు వచ్చే ఏడాది సంక్రాంతికి 'ఈగల్​' చిత్రంతో ప్రేక్షకులకు ముందుకు రానున్నారు.

Last Updated : Jun 12, 2023, 7:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.