ETV Bharat / entertainment

'అమ్మాయిలకు నేను ఇచ్చే సలహా ఇదే - అస్సలు సైలెంట్​గా ఉండొద్దు' - Rashmika deep fake video

Rashmika Animal Pre Release Event : డీఫ్​ ఫేక్ వీడియోల వల్ల తాను ఎదుర్కొన్న అనుభవాల గురంచి కన్నడ బ్యూటీ రష్మిక తాజాగా స్పందించారు. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన యానిమల్ ప్రీ రిలీజ్ ఈవెంట్​లో అమ్మాయిలకు ఓ సలహా ఇచ్చారు.

Rashmika Animal Pre Release Event
Rashmika Animal Pre Release Event
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 28, 2023, 1:40 PM IST

Updated : Nov 28, 2023, 4:01 PM IST

Rashmika Animal Pre Release Event : నేషనల్ క్రష్​, కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా ప్రస్తుతం 'యానిమల్' మూవీ​ ప్రమోషన్స్​లో బిజీగా ఉన్నారు. హైదరాబాద్​ వేదికగా తాజాగా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్​కు ఆమె హాజరయ్యారు. మూవీ టీమ్​తో కలిసి సందడి చేసిన ఆమె.. విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. అందులో భాగంగా డీఫ్​ ఫేక్​పై రష్మిక స్పందించారు. కానీ సినిమా ప్రమోషన్‌ సందర్భంగా ఈ విషయం గురించి మాట్లాడటం కరెక్ట్‌ కాదని చెప్పి.. అమ్మాయిలకు ఒ సలహా ఇచ్చారు.

" ఈ రోజుల్లో ఫేక్ వీడియోలు చాలా కామన్​ అయిపోయాయి. అలాంటివి బయటకు వచ్చినప్పుడు మనం కచ్చితంగా స్పందించాలి. నాకు మొదట అమితాబ్ బచ్చన్‌ సపోర్ట్‌ ఇచ్చారు. ఆ తర్వాత సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు మద్దతు తెలిపారు. మొదట్లో ఆ వీడియోను చూసి నేను చాలా బాధపడ్డాను. చాలా మంది సెలబ్రిటీలకు ఇలానే జరుగుతోంది. మనం ఏం చేయగలం అనిపించింది. దీన్ని సాధారణంగా తీసుకోకూడదని అనుకున్నాను. అందుకే ఈ విషయంపై స్పందించాను. అమ్మాయిలందరికీ నేను ఓ విషయం చెప్పాలని అనుకుంటున్నాను. ఏదైనా సంఘటన మిమ్మల్ని ప్రభావితం చేసి బాధిస్తే.. మీరు అస్సలు సైలెంట్​గా ఉండొద్దు. కచ్చితంగా స్పందించండి. అప్పుడు మీకు ప్రజల సపోర్ట్​ లభిస్తుంది. మనం గొప్ప దేశంలో నివసిస్తున్నాం" అని రష్మిక అన్నారు.

  • This is THE frame for me guys.
    Who ever captured this moment for me. Thankyou. ❤️

    This is all about yesterday -
    The love, the warmth, the respect, the madness, the nervousness, the anticipation but over all
    The magic of the moment.
    So grateful to my loves for the endless… pic.twitter.com/R8iGSXxe2t

    — Rashmika Mandanna (@iamRashmika) November 28, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Animal Movie Release Date : ఇక 'యానిమల్​' సినిమా విషయానికొస్తే.. ఈ చిత్రంలో రణ్​బీర్ కపూర్, రష్మిక మందన్న లీడ్​ రోల్​లో నటించారు. ఈ సినిమాకు 'అర్జున్​ రెడ్డి' ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో నటుడు సన్నీ దేఓల్, త్రిప్తి దిమ్రి, పరిణితి చోప్రా, అనిల్ కపూర్, శరత్ సక్సెనా తదితరులు నటించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకుల్లో అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది. ఈ సినిమా డిసెంబరు 1న .. హిందీతో పాటు తెలుగు, తమిళ్,​ మలయాళం, కన్నడ భాషల్లో విడుదల కానుంది.

ఇందిరా గాంధీతో కంగనా భేటీ - ఎలా సాధ్యమంటే ?

'బన్నీతో నటించాలని ఉంది - ఎవరైనా​ మా ఇద్దరితో సినిమా తీస్తారా?'

Last Updated : Nov 28, 2023, 4:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.