కోలీవుడ్ స్టార్ విజయ్ మేనియా ఇప్పుడు యూట్యూబ్‌ని షేక్ చేస్తోంది. ఆయన హీరోగా నటించిన 'వారిసు' లోని ఫస్ట్ సింగిల్ నెట్టింట విపరీతమైన క్రేజ్‌ను సొంతం చేసుకుంది. 'రంజితమే' అంటూ సాగే ఈ మాస్ సాంగ్‌ను విడుదల చేసి పది రోజులవుతోన్నా క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు సరికదా.. మరింత పెరుగుతోంది.
ఈ విషయాన్నే తెలియజేస్తూ చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ ఓ సరికొత్త పోస్టర్ షేర్ చేసింది. ఇప్పటివరకూ ఈ పాట 5 కోట్ల వ్యూస్, 18 లక్షల లైక్స్ సొంతం చేసుకుందని పేర్కొంది. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్ ట్రెండింగ్‌లో మూడో స్థానంలో కొనసాగుతోంది. ఫ్యామిలీ, మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న చిత్రం 'వారిసు'. వంశీ పైడిపల్లి దర్శకుడు.
ఇదే చిత్రాన్ని తెలుగులో 'వారసుడు' పేరిట విడుదల చేయనున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. దిల్‌రాజు నిర్మాత. రష్మిక కథానాయిక. జయసుధ, ఖుష్భూ కీలకపాత్రల్లో కనిపించనున్నారు. తమన్ స్వరాలు అందిస్తున్నారు.
-
The sensational #Ranjithame hits 50M views 🔥
— Sri Venkateswara Creations (@SVC_official) November 16, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
📽️ https://t.co/Q56reRe9tc
🎵 https://t.co/gYr0tkVJkD#Thalapathy @actorvijay sir @directorvamshi @iamRashmika @MusicThaman @Lyricist_Vivek @manasimm @AlwaysJani @TSeries #RanjithameSong #Varisu #VarisuPongal pic.twitter.com/l8ElaoR20h
">The sensational #Ranjithame hits 50M views 🔥
— Sri Venkateswara Creations (@SVC_official) November 16, 2022
📽️ https://t.co/Q56reRe9tc
🎵 https://t.co/gYr0tkVJkD#Thalapathy @actorvijay sir @directorvamshi @iamRashmika @MusicThaman @Lyricist_Vivek @manasimm @AlwaysJani @TSeries #RanjithameSong #Varisu #VarisuPongal pic.twitter.com/l8ElaoR20hThe sensational #Ranjithame hits 50M views 🔥
— Sri Venkateswara Creations (@SVC_official) November 16, 2022
📽️ https://t.co/Q56reRe9tc
🎵 https://t.co/gYr0tkVJkD#Thalapathy @actorvijay sir @directorvamshi @iamRashmika @MusicThaman @Lyricist_Vivek @manasimm @AlwaysJani @TSeries #RanjithameSong #Varisu #VarisuPongal pic.twitter.com/l8ElaoR20h
ఇదీ చదవండి: సూపర్ స్టార్ కృష్ణను ఈ డిఫరెంట్ గెటప్స్‌లో చూశారా
సూపర్ స్టార్ కృష్ణ గురించి ఈ ఆసక్తికర విషయాలు ఎప్పుడైనా విన్నారా?