ETV Bharat / entertainment

మరో పీరియాడిక్​ సినిమాలో రామ్​చరణ్​.. ఆ యోధుడి పాత్రలో!

author img

By

Published : Jul 8, 2022, 12:05 PM IST

Ramcharan new movie: 'ఆర్​ఆర్​ఆర్'​తో సూపర్​ సక్సెస్​ను అందుకున్న మెగాహీరో రామ్​చరణ్​ను.. గతంలో 'మగధీర'లో తన రాజ్యాన్ని కాపాడుకునే పోరాట యోధుడిగా చూశాం. అయితే ఇప్పుడాయన్ను ఓ గొప్ప మాహారాజా పాత్రలో చూసే అవకాశం ఉందని టాక్​ వినిపిస్తోంది. ఆ వివరాలు..

Ramcharan new movie
రామ్​చరణ్ కొత్త సినిమా

Ramcharan new movie: 'ఆర్ఆర్ఆర్' చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా మెగాహీరో రామ్​చరణ్ ఆహార్యం, అభినయం దేశవ్యాప్తంగా​ ప్రేక్షకుల్ని, అభిమానుల్ని ఎంతగానో ఆకట్టుకుంది. నటుడిగా ఆయన స్థాయిని మరింత పెంచింది. అయితే ఇప్పుడాయన మరో ఛాలెంజింగ్​ రోల్​లో కనిపించేందుకు సిద్ధమవుతున్నారని తెలిసింది. ఈ చిత్రం తర్వాత ఆయనతో సినిమా చేసేందుకు బడా దర్శకులు, నిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థల​ నుంచి వరుస అవకాశాలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆయన మరో భారీ చారిత్రక చిత్రానికి గ్రీన్​సిగ్నల్​ ఇచ్చినట్లు టాక్​ వినిపిస్తోంది.

ప్రముఖ రచయిత అమిష్​ త్రిపాఠి రాసిన 'లెజెండ్​ ఆఫ్​ సుహేల్​ దేవ్​: ది కింగ్​ హు సేవ్డ్​ ఇండియా నవల ఆధారంగా ఓ మూవీని గతంలో ప్రకటించారు. ప్రీ ప్రొడక్షన్​ పనులను కూడా ప్రారంభించారు. అయితే కరోనా వల్ల ఆగిపోయింది. ఇప్పుడా చిత్రాన్ని పట్టాలెక్కించడానికి అమిష్​ సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. మొదట బాలీవుడ్ స్టార్​ అక్షయ్​కుమార్​ పేరును పరిశీలించారట. కానీ ఇప్పుడు రామ్​చరణ్​ను ఎంపిక చేశారని వార్తలొస్తున్నాయి. హీరోయిజాన్ని ప్రదర్శించడమే కాకుండా నటనకు ఆస్కారం ఉన్న పాత్ర కావడం వల్ల చరణ్​ ఈ చారిత్ర చిత్రంలో నటించడానికి అంగీకరించారట.

వాకో ఫిల్మ్స్​, కాసా మీడియాతో కలిసి అమిష్​ ఈ ప్రాజెక్ట్​ను నిర్మిస్తున్నారు. దాదాపు రూ.400కోట్ల బడ్జెట్​తో రూపొందనుందని తెలిసింది. ప్రస్తుతం స్క్రిప్ట్​ పనులు శరవేగంగా జరుగుతున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది సెట్స్​పైకి వెళ్లే అవకాశం ఉంది.

ఇదీ చూడండి: రణ్​బీర్​ మాజీ లవర్స్​తో​ స్నేహం.. అలియా అలా ఎలా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.