ETV Bharat / entertainment

Ramcharan Alluarjun : మళ్లీ తెరపైకి అదే ప్రచారం​.. ఇప్పుడంతా దీని గురించే చర్చ!.. ట్రోలర్స్​కు ఫుల్​ స్టఫ్​! - వరుణ్ తేజ్​ లావణ్య త్రిపాఠి ప్రీ వెడ్డింగ్

Ramcharan Alluarjun : రామ్​చరణ్​ - అల్లుఅర్జున్.. గురించి మళ్లీ ఆ ప్రచారం తెరపైకి వచ్చేసింది. అందరూ దీని గురించే మాట్లాడుకుంటున్నారు. ఏంటంటే?

Ramcharan Alluarjun : మళ్లీ తెరపైకి ఆ ప్రచారం​.. ఇప్పుడంతా దీని గురించే చర్చ!.. ట్రోలర్స్​కు స్టఫ్​ దొరికేసిందిగా!

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 17, 2023, 1:32 PM IST

Ramcharan Alluarjun : మెగాపవర్ స్టార్​ రామ్​చరణ్​ - ఐకాన్​ స్టార్ అల్లు అర్జున్​ మధ్య చాలా కాలం నుంచి కోల్డ్​ వార్​ జరుగుతున్నట్లు ప్రచారం సాగుతోందన్న సంగతి తెలిసిందే. దీనిపై రకరకాల కథనాలు కూడా వస్తున్నాయి. అయితే తాజాగా మరోసారి ఈ ప్రచారం సోషల్​ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. వరుణ్​ తేజ్​ - లావణ్య త్రిపాఠి ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్​ దీనికి కారణమైంది.

ఇండస్ట్రీలో మెగా-అల్లు కుటుంబాల మధ్య మనస్పర్థలు ఉన్నట్లు ఎప్పుడూ ఏదో ఒక ప్రచారం నడుస్తూనే ఉంటుంది. అదే సమయంలో వాటిని మెగామెంబర్స్​ కొట్టి పారేస్తుంటారు కూడా. ఇప్పటికే నాగబాబు, అల్లు అరవింద్​ కూడా ఈ విషయమై చాలా సార్లు స్పందించారు. అయితే ఈ మధ్య మెగా - అల్లు వారసులైన చరణ్​-అల్లు అర్జున్ మధ్య మనస్పర్థలు అంటూ ప్రచారం ఎక్కువైంది. తాజగా జరిగిన ఓ సంఘటన ఈ ప్రచారానికి మరింత బలాన్ని చేకూర్చింది.

ఏం జరిగిందంటే.. వరుణ్ తేజ్​ - లావణ్య త్రిపాఠి(VarunTej Lavanya Tripathi Wedding) త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నారు. ఈ సందర్భంగా ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్​ చేసుకుంటున్నారు. ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో గ్రాండ్​గా పార్టీ నిర్వహించగా.. తాజాగా అల్లు నివాసంలో నిర్వహించారు. ఈ ఈవెంట్​లో చిరంజీవి, అల్లు అరవింద్‌ కుటుంబసభ్యులతో పాటు నటుడు నితిన్‌, ఆయన సతీమణి షాలినీ, నటి రీతూవర్మ, పలువురు సన్నిహితులు సందడి చేశారు. కానీ రామ్​ చరణ్ మాత్రం కనపడలేదు. అంతకుముందు చిరంజీవి​ ఇంట్లో పార్టీ నిర్వహించినప్పుడు అల్లు అర్జున్​ కూడా ఎక్కడా కనపడలేదు. దీంతో ఈ ఇద్దరి మధ్య నిజంగానే ఏమైనా జరిగిందా అన్న ప్రచారం మరోసారి తెరపైకి వచ్చింది. ట్రోలర్స్​కు మంచి స్టప్​ దొరికేసింది. సోషల్​ మీడియాలో ఈ విషయాన్ని తెగ ట్రెండ్ చేస్తున్నారు. ప్రస్తుతం అందరూ దీని గురించే మాట్లాడుకుంటున్నారు. ఇకపోతే రామ్​చరణ్​ ప్రస్తుతం దిగ్గజ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో 'గేమ్​ ఛేంజర్' సినిమా చేస్తున్నారు. అల్లు అర్జున్​.. 'పుష్ప 2' షూటింగ్​తో ఫుల్​ బిజీగా ఉన్నారు.

Varun Tej - Lavanya : అల్లు అర్జున్ ఇంట్లో.. వరుణ్‌-లావణ్య ప్రీ వెడ్డింగ్​ గ్రాండ్‌ పార్టీ

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.