ETV Bharat / entertainment

సిల్వర్​స్క్రీన్​పై మరో రామాయణం.. నటీనటులు వీళ్లేనట! - ramayana

Ramayan Ranbir kapoor : అల్లు అరవింద్‌ నిర్మాతగా రూపొందనున్న 'రామాయణానికి' సినిమాకు సంబంధించి మరో వార్త సోషల్​మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలోని నటీనటుల వివరాలు అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి.

Nitesh Tiwaris Ramayanam with ranbir kapoor

author img

By

Published : Jun 8, 2023, 2:10 PM IST

Ramayan Ranbir kapoor : మరో ఎనిమిది రోజుల్లో ప్రభాస్​ 'ఆదిపురుష్​' వరల్డ్​వైడ్​గా గ్రాండ్​గా రిలీజ్ కానుంది. రామాయణం ఆధారంగా దీన్ని రూపొందించారు. అయితే ఇప్పుడు మరో రామాయాణం సిల్వర్​స్క్రీన్​పైకి వచ్చేందుకు రెడీ అవుతోంది. టాలీవుడ్​ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్.. బాలీవుడ్ దర్శకుడు నితేశ్‌ తివారీ, నిర్మాత మధు మంతెనలతో కలిసి రామాయణాన్ని తెరకెక్కించే ప్రయత్నాలను కొన్నేళ్లుగా చేస్తున్నారు. ఇప్పటికే దీనిపై ఎన్నో రకాల వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఇప్పుడు మరో వార్త బయటకు వచ్చింది. సినిమాలో ఎవరెవరు నటించనున్నారనే విషయంపై ఓ క్లారిటీ వచ్చేసింది.

రణ్​బీర్​-ఆలియా కలిసి.. ఈ సినిమాలో రాముడి పాత్ర కోసం రణ్‌బీర్‌ కపూర్‌ను ఓకే చేశారని గతంలో వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఆ పాత్ర కోసం లుక్‌ టెస్ట్‌లు కూడా చేసేశారని తెలిసింది. ఇక సీత పాత్ర కోసం నిన్నటి వరకు సాయి పల్లవి పేరు వినిపించింది. కానీ ఇప్పుడు మరో కొత్త పేరు ప్రచారంలోకి వచ్చింది. రణ్​బీర్​ భార్య ఆలియా భట్‌ను ఎంపిక చేసినట్లు సమాచారం అందింది. తాజాగా దర్శకుడు నితేశ్‌ తివారీతో అలియా భట్ కలిసి కనిపించింది. దీంతో ఆలియా భట్​.. సీత పాత్ర పోషించనుందన్న వార్తలకు మరింత బలం చేకూరింది. ఈమెకు కూడా లుక్ టెస్ట్ చేశారట.

రావణుడిగా అతడే(actor yash new movie).. 'కేజీయఫ్​' సిరీస్​తో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కన్నడ రాకింగ్ స్టార్ యశ్​.. తన నెక్ట్స్​ ప్రాజెక్ట్​ను ఇప్పటివరకు అనౌన్స్ చేయలేదు. అయితే రావణుడి పాత్ర కోసం మేకర్స్​ యశ్​ను సంప్రదించి చర్చలు జరపుతున్నారని, యశ్​ కూడా దాదాపుగా ఓకే చేశారని అని గత కొత్త కాలంగా వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు మళ్లీ అదే వార్త తెరపైకి వచ్చింది. ఇది దాదాపుగా కన్ఫామ్​ అయినట్టేనని అంటున్నారు. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశముందట.

వాయిదా పడలేదు.. మరోవైపు ఈ ప్రాజెక్ట్‌ వాయిదా పడనుందనే వార్తల కూడా వచ్చాయి. తాజాగా దీనిపై నిర్మాత మధు మంతెన స్పందించారు. "ఏ ఆధారం లేకుండా వాయిదా పడిందని ఎలా రాస్తారు? ఇలాంటి పుకార్లు సృష్టించకండి. ఈ ఏడాది చివర్లో సినిమాను ప్రారంభిస్తాం. దయచేసి ఇలాంటి అసత్య ప్రచారం చేయకండి" అని అన్నారు. దీంతో సిల్వర్​స్క్రీన్​పై మరో రామాయణం సిద్ధం కానుందంటూ నెటిజన్లు అంటున్నారు. గతంలోనూ ఈ ప్రాజెక్ట్‌ గురించి అల్లు అరవింద్‌ మాట్లాడుతూ.. "నేను ఇంకొంతమంది నిర్మాతలతో కలిసి రామాయణాన్ని తెరకెక్కిస్తున్నాను. కొన్నేళ్లుగా దీనికి సంబంధించిన పనులు జరుగుతున్నాయి. ఇది చాలా పెద్ద ప్రయత్నం. పూర్తవ్వడానికి చాలా ఏళ్లు పడుతుంది. ఇది భారతదేశంలోనే అతి పెద్ద, అతి భారీ బడ్జెట్‌ సినిమాగా నిలుస్తుంది." అని అన్నారు.

ఇదీ చూడండి :

Adipurush Latest Update : 'ఆదిపురుష్' మూవీ టికెట్లు 10వేలకు పైగా ఫ్రీ.. వారికి మాత్రమే..85

ఏంటీ.. 'దసరా' కన్నా 'ఆదిపురుష్'కు తక్కువా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.