ETV Bharat / entertainment

మహేశ్​బాబు​ మాటలు నాకు అర్థం కాలేదు: ఆర్జీవీ - మహేశ్ బాబు న్యూస్​

ram gopal varma: బాలీవుడ్​పై మహేశ్​బాబు చేసిన వ్యాఖ్యలు బీటౌన్​లో తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఈ విషయంపై తాజాగా ప్రముఖ దర్శకుడు రామ్​గోపాల్​వర్మ స్పందించారు.

ram gopalvarma
ఆర్​జీవీ
author img

By

Published : May 12, 2022, 3:16 PM IST

Updated : May 12, 2022, 11:22 PM IST

బాలీవుడ్​పై మహేశ్​బాబు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఆ మాటలపై మహేశ్​బాబు టీమ్​ క్లారిటీ ఇచ్చినా.. జాతీయ మీడియాలో చర్చ మాత్రం ఆగట్లేదు. ఆ కామెంట్స్​పై ఇటు టాలీవుడ్​తో పాటు బాలీవుడ్​ ప్రముఖులు స్పందిస్తున్నారు. బీటౌన్​లో కొందరైతే తీవ్ర అసహనాన్ని సైతం వ్యక్తం చేస్తున్నారు. సోషల్​ మీడియాలో సైతం మహేశ్​పై విపరీతంగా ట్రోల్స్​ వచ్చాయి. తాజాగా సూపర్​స్టార్​ అన్న మాటలపై ప్రముఖ దర్శకుడు రాంగోపాల్‌ వర్మ స్పందించారు. మహేశ్‌ చేసిన కామెంట్స్‌ తనకు అర్థం కాలేదన్నారు.

"బాలీవుడ్ అనేది ఒక సంస్థ కాదు. ఎక్కడ సినిమాలు చేయాలి? ఎలాంటి కథలు ఎంచుకోవాలి? అనేది ఒక నటుడి సొంత నిర్ణయం. దానిని తప్పుపట్టడానికి లేదు. కానీ, తనని బాలీవుడ్‌ భరించలేదంటూ మహేశ్‌ చేసిన వ్యాఖ్యల్లో మర్మం నాకు తెలియడం లేదు.

ఇంకొక విషయం ఏమిటంటే.. బాలీవుడ్‌ అనేది కేవలం ఒక కంపెనీ కాదు. మీడియా వాళ్లే ఆ పేరు సృష్టించారు. హిందీలో నటించాలంటే.. నిర్మాత, ప్రొడక్షన్‌ కంపెనీ మాత్రమే తమ చిత్రాల్లో నటించమని కోరుతూ నటీనటులకు డబ్బులు ఇస్తుంటారు. అలాంటప్పుడు బాలీవుడ్‌ మొత్తాన్ని జనరలైజ్‌ చేసి ఎలా చెబుతాం. అది నాకు అర్థం కావడం లేదు"

- రామ్​గోపాల్​ వర్మ, దర్శకుడు

అసలు మహేశ్​ ఏం అన్నాడంటే..

'మేజర్​' సినిమా ట్రైలర్​ లాంచ్​ ఈవెంట్​లో మహేశ్ మాట్లాడుతూ.. "ఇది గర్వంగా అనిపించొచ్చు. నాకు హిందీ నుంచి చాలా ఆఫర్స్​ వచ్చాయి. కానీ బాలీవుడ్​ నన్ను భరించలేదని భావిస్తున్నాను. నాకు వచ్చిన హిందీ చిత్రాల అవకాశాలను వినియోగించుకుంటూ సమయాన్ని వృథా చేయాలనుకోవట్లేదు. తెలుగు చిత్రసీమలో నాకున్న స్టార్​డమ్​, ఇక్కడివారు చూపించే ప్రేమ వల్ల ఇతర ఇండస్ట్రీకి వెళ్లాలన్న ఆలోచన కూడా లేదు. ఎప్పటికీ ఇక్కడే సినిమాలు చేయాలి, అవి భారీ స్థాయిలో విజయాన్ని అందుకోవాలని భావిస్తాను. నా బలం, ఎమోషన్​ తెలుగు సినిమా. తెలుగు సినిమా అనేదే ఓ భావోద్వేగం. భారతదేశంలోని ప్రజలందరూ తెలుగు చిత్రాలను చూడాలని నేనెప్పుడు కోరుకుంటాను. ప్రస్తుతం అది జరుగుతున్నందుకు సంతోషంగా ఉంది." అని అన్నారు.

ఇదీ చదవండి: ఐపీఎల్​ ముగింపు వేడుకలకు రెహ్మాన్​, రణ్​వీర్​!

Last Updated : May 12, 2022, 11:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.