ETV Bharat / entertainment

ఆఫ్రికాలో రామ్​చరణ్​ వెకేషన్.. వంట చేస్తూ ఎంజాయ్​.. వీడియో చూశారా? - ram charan movies

'ఆర్​ఆర్​ఆర్​'తో ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందారు టాలీవుడ్​ కథానాయకుడు రామ్​చరణ్. ప్రస్తుతం షూటింగ్​ల నుంచి కాస్త విరామం తీసుకుని ఆయన సతీసమేతంగా విహారయాత్రకు వెళ్లారు. తాజాగా ఆయన షేర్​ చేసిన ఆఫ్రికన్ సఫారీ వీడియో నెట్టింట్లో వైరల్​గా మారంది.

ram charan upasana africa vacation
ram charan upasana africa vacation
author img

By

Published : Oct 30, 2022, 4:34 PM IST

ఎప్పుడూ షూటింగ్​లో బిజీగా గడిపే సినిమా తారలు.. అప్పుడప్పుడు విహార యాత్రలు చేస్తుంటారు. కాస్త ఫ్రీ టైం దొరికితే విదేశాలకు చెక్కేస్తుంటారు. తాజాగా ఈ జాబితాలో ఆర్ఆర్ఆర్ హీరో రామ్ చరణ్ సైతం చేరిపోయారు. ప్రస్తుతం షూటింగ్​ల నుంచి కాస్త విరామం తీసుకుని సతీసమేతంగా విహార యాత్రకు వెళ్లారు.

సతీమణి ఉపాసనతో కలిసి టాంజానియాలో ఎంజాయ్ చేస్తూ కనిపించారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను రామ్ చరణ్ ఇన్​స్టా వేదికగా ప్రేక్షకులతో పంచుకున్నారు. అందులో టాంజానియాలోని ఓ జూలో సఫారీ జీప్ నడుపుతూ కనిపించారు రామ్ చరణ్. సరదాగా వంట కూడా చేశారు. అనంతరం తన కెమెరాతో అక్కడి వన్యప్రాణుల ఫోటోలను బంధించారు. 'పేరులేని ఆఫ్రికా' అంటూ పోస్ట్‌కు క్యాప్షన్ కూడా ఇచ్చారు ఈ మెగా హీరో. బ్లాక్​ టీ-షర్టు, బ్లూ జాకెట్ వేసుకున్న చెర్రీ కొత్త లుక్‌లో కనిపించడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఇప్పుడీ వీడియో సోషల్​ మీడియాలో వైరల్​ అవుతోంది.

రామ్ చరణ్ ఆఫ్రికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ ఆర్​సీ15 షూటింగ్‌లో పాల్గొననున్నారు. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హీరో రామ్ చరణ్ సరసన కియారా అడ్వాణీ నటిస్తోంది. ఈ చిత్రాన్ని దిల్​ రాజు నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం​ అందిస్తున్నారు.

ఇదీ చదవండి:మాల్దీవుల్లో ఫుల్​ ఎంజాయ్ చేస్తున్న రకుల్

అయ్​ బాబోయ్ ఎంత పొడుగో ఈ సినిమా టైటిల్స్​ చూశారా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.