Ram Charan Bollywood Movie : 'ఆర్ఆర్ఆర్' సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ అందుకుని గ్లోబల్ స్టార్‌గా మారిపోయారు. దీంతో ఫ్యాన్స్ ఈయన అప్‌కమింగ్ మూవీస్‌పై తెగ ఆసక్తి కనబరుస్తున్నారు. ఇప్పటికే సౌత్‌తో తన సినిమాలతో ఫ్యాన్స్‌ను అలరిస్తున్న ఈ స్టార్ హీరో త్వరలో మరోసారి బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నారన్న వార్తలు నెట్టింట తెగ ట్రెండ్ అవుతున్నాయి. ఇప్పటికే ఆయన డబ్బింగ్ సినిమాలతో బీటౌన్ ప్రేక్షకులను ఆకట్టుకోగా, ఇప్పుడు ఓ స్ట్రైట్ మూవీతో అక్కడ థియేటర్లలో సందడి చేయనున్నారని సమాచారం. ఇందులో ధూమ్ 4 తో పాటు 'డంకీ' డైరెక్టర్ రాజ్‌కుమార్ హిరానీతో ఓ ప్రాజెక్ట్ ఉందట. అయితే తాజాగా ఈ విషయంపై రాజ్‌కుమార్ హిరానీ క్లారిటీ ఇచ్చారు.
"ప్రస్తుతానికైతే నేను రామ్ చరణ్‌తో ఎలాంటి సినిమా ప్లాన్ చేయడం లేదు. కానీ నాకు రామ్ చరణ్ బాగా తెలుసు. ఒక వేళ ఆయనతో సినిమా చేసే అవకాశం వస్తే తప్పకుండా చేస్తాను. ఇక 'ఆర్ఆర్ఆర్' సినిమాలో రామ్ చరణ్ నటన అద్భుతం." అంటూ చెర్రీని పొగడ్తలతో ముంచెత్తారు.
Ram Charan Movies List : ఇక చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమాతో బిజీగా ఉన్నారు. శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో చరణ్ సరసన కియారా అడ్వాణీ నటిస్తోంది. పొలిటికల్ సెటైర్‌గా ఈ సినిమాను శంకర్ తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం షూటింగ్‌కు గ్యాప్ ఇచ్చి కుటుంబంతో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న చరణ్ త్వరలోనే ఈ సినిమా షూటింగ్లో పాల్గొననున్నారు.
Ram Charan Cricket Team : మరోవైపు చెర్రీ తాజాగా ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ (ISPL- T10 ) లీగ్‌లో 'టీమ్ హైదరాబాద్' జట్టును కొనుగోలు చేశారు. దీనిపై ఆయన ఆనందం వ్యకం చేశాడు. ' క్రికెట్లో కొత్తరకమైన ఎంటర్టైన్మెంట్ను ఈ టోర్నీ అందించనుంది. లోకల్ ప్లేయర్లు తమ టాలెంట్‌ను నేషనల్వైడ్గాచూపేందుకు ఈ టోర్నీ ప్లాట్‌ఫామ్‌లా ఉపయోగడుతుంది. నేను హైదరాబాద్ జట్టును సొంతం చేసుకోవడం హ్యాపీగా ఉంది' అని అన్నారు. అయితే ఈ టోర్నీతో తెలుగు రాష్ట్రాల్లో క్రికెట్‌పై ఇంట్రెస్ట్ ఉన్నవారికి రామ్‌చరణ్ మంచి అవకాశం కల్పించినట్లైంది. ఇక ఈ లీగ్‌లో రామ్‌చరణ్‌తోపాటు బాలీవుడ్ స్టార్లు అక్షయ్ కుమార్ (శ్రీ నగర్), అమితాబ్ బచ్చన్ (ముంబయి), హృతిక్ రోషన్ (బెంగళూరు) జట్లకు యజమానులుగా వ్యవహరిస్తున్నారు.
రామ్‌చరణ్‌కు అరుదైన గౌరవం- పాప్ గోల్డెన్ అవార్డ్స్‌లో విజేతగా స్టార్ హీరో
'ఫోర్బ్స్' మ్యాగజైన్‌పై స్టైలిష్‌గా చెర్రీ, ఉప్సీ- టాలీవుడ్ ఫస్ట్ కపుల్‌గా ఘనత!