సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన బ్లాక్ బస్టర్ సినిమాల్లో 'శివాజీ' ఒకటి. శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ ముందు అదిరిపోయే కలెక్షన్లను వసూలు చేసింది. బ్లాక్ మనీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ భాషల్లోనూ సూపర్ హిట్‌గా నిలిచింది. ఎమోషనల్, మాస్ ఎలిమెంట్స్, కామెడీ.. ఇలా అన్ని అంశాలను ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.
అయితే ఈ చిత్రంలో ఓ హాస్య సన్నివేశం ఉంటుంది. దీపావళి పండగ సందర్భంగా రజనీకాంత్ పండ్లు పలహారాలతో హీరోయిన్ శ్రియ ఇంటికి వెళ్తారు. కానీ శ్రియ ఇంట్లో వాళ్ళు రజినీకాంత్‌ను ఇంట్లోకి రానివ్వరు. అయితే అదే సమయంలో శ్రియ ఇంటికి ఎదురుగా ఉండే ఓ వ్యక్తి వచ్చి నాకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు మా ఇంటికి రండి అంటూ పిలుస్తాడు.
అక్కమ్మ జక్కమ్మ అంటూ తన ఇద్దరు కూతుళ్లను పరిచయం చేస్తాడు. కాగా వాళ్ళిద్దరినీ డీగ్లామర్ పాత్రలో చూపించారు. అప్పట్లో ఈ రోల్స్‌పై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అయితే ఈ పాత్రలలో నటించిన ఇద్దరు అక్క చెల్లెళ్ల అసలు పేరు సంఘవై,అంగవై అని తెలిసింది. అయితే తాజాగా వీళ్లకు సంబంధించిన ఓ ఫొటో సోషల్‌మీడియాలో కనిపించింది. ఇందులో వీరు మేకప్ లేకుండా కనిపించారు. అయితే ఈ ఫొటో ఇప్పటిది కాదని అర్థమవుతోంది. కొంతకాలం క్రితం దిగినట్లుంది. ఓ సారి ఆ ఫొటోను చూసేయండి..
ఇదీ చూడండి: Oscar: 'ఛెల్లో షో' చైల్డ్ ఆర్టిస్ట్ కన్నుమూత