ETV Bharat / entertainment

ఇలాంటి సపోర్ట్​ను నేను కలలో కూడా ఊహించలేదు - ఆ క్యాచ్​ నాకు ఎంతో స్పెషల్​! - రచిన్​ రవీంద్ర స్క్వాడ్​

Rachin Ravindra World Cup 2023 : వన్డే ప్రపంచకప్‌లో న్యూజిలాండ్​​ జట్టు దూసుకెళ్తోంది. బెంగళూరు వేదికగా తాజాగా జరిగిన మ్యాచ్​లో శ్రీలంక జట్టుపై ఘన విజయాన్ని సాధించింది. ఈ క్రమంలో జట్టులో కీలక ప్లేయర్ అయిన రచిన్ పేరు ఆ స్టేడియంలో మారుమోగిపోయింది. దీని పట్ల రచిన్​ తాజాగా స్పందించాడు.

Rachin Ravindra World Cup 2023
Rachin Ravindra World Cup 2023
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 10, 2023, 12:01 PM IST

Updated : Nov 10, 2023, 12:12 PM IST

Rachin Ravindra World Cup 2023 : వన్డే ప్రపంచకప్‌లో భాగంగా తన చివరి లీగ్‌ మ్యాచ్‌లో శ్రీలంకపై న్యూజిలాండ్​ జట్టు భారీ విజయాన్ని నమోదు చేసింది. దీంతో సెమీస్‌ బెర్తును దాదాపు ఖరారు చేసుకుంది. టోర్నీ తొలి మ్యాచుల్లో పేలవ ప్రదర్శన చూపించిన కివీస్​ జట్టు.. ఆ తర్వాత వేగం పుంజుకుని దూసుకెళ్తోంది. కేన్ విలియమ్సన్, డేవాన్ కాన్వే, డారిల్ మిచెల్, ట్రెంట్ బోల్ట్, మిచెల్ సాంట్నర్ వంటి ప్లేయర్లు ఆ జట్టుకు మంచి ఇన్నింగ్స్ అందించి జట్టుకు బలాన్ని చేకూరుస్తున్నారు. దీంతో ఇప్పుుడు కివీస్​ కూడా బలమైన టీమ్స్​లో ఒకటిగా మారింది.

మరోవైపు ఈ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు యంగ్​ ప్లేయర్ రచిన్ రవీంద్ర. బ్యాటింగ్​తో పాటు బౌలింగ్ పట్టు సాధించిన ఈ స్టార్ ప్లేయర్​.. తాజాగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్​లో రెండు వికెట్లు తీసి సత్తా చాటాడు. అంతే కాకుండా లక్ష్య ఛేదనలో దూకుడుగా ఆడి 42 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో పలు రికార్డులను సొంతం చేసుకున్నాడు. అతి పిన్న వయసులో వరల్డ్‌ కప్‌ టోర్నీల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా అవతరించి సచిన్‌ రికార్డును అధిగమించాడు. బెంగళూరు వేదికగా జరిగిన మ్యాచ్‌లో అభిమానుల నోట తన పేరు మార్మోగడం పట్ల రచిన్​ ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ఇదంతా కలగా అనిపిస్తోందని వ్యాఖ్యానించాడు.

"మా నాన్న తరఫు బంధువులు ఉన్న ఈ బెంగళూరు వేదికగా మ్యాచ్‌ ఆడటం నాకు ఆనందంగా ఉంది. ఇక్కడి అభిమానుల నుంచి ఇలాంటి స్థాయిలో మద్దతు వస్తుందని నేను అస్సలు ఊహించలేదు. ఇదంతా నమ్మశక్యంగా లేదు. సచిన్‌ రికార్డును అధిగమిస్తానని నేను కలలో కూడా అనుకోలేదు. గత ఆరు నెలల నుంచి ఏడాది వరకు నేను వరల్డ్‌ కప్‌ ఫ్రేమ్‌లోనే లేను. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఇక్కడి వరకు వచ్చాను. ఓ టెస్టు మ్యాచ్‌లో అజాజ్‌ పటేల్ పదో వికెట్‌ తీసిన క్యాచ్‌ను పట్టుకోవడం నా కెరీర్‌లో అద్భుతమైన క్షణం. ఇక బెంగళూరు పిచ్‌ బౌలింగ్‌, బ్యాటింగ్‌కు అద్భుతంగా ఉంది. నా చిన్నతనంలో ఇక్కడ ప్రాక్టీస్‌ చేసిన అనుభవం ఇప్పుడు అక్కరకొచ్చింది. ఐపీఎల్‌లో ఆడిన డేవన్‌ కాన్వే, కేన్​తో బెంగళూరు పిచ్‌ గురించి చాలా చర్చించాను. మా కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్ నాకు మార్గదర్శకుడు. అతడే కాదు ఈ వరల్డ్‌ కప్‌లో ఎంతో మంది అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నారు. జో రూట్, విరాట్ కోహ్లీ, స్టీవ్‌ స్మిత్‌ వంటి టాప్‌ ప్లేయర్లతో ఆడుతున్నాననే ఫీలింగ్‌ నేను మాటల్లో చెప్పలేను. మా జట్టులోని ప్లేయర్ల నుంచి ఎల్లవేళలా స్వేచ్ఛగా ఆడేందుకు నాకు మద్దతు దొరుకుతుంది. ప్రత్యక్షంగా వీక్షించేందుకు వచ్చిన ప్రతి అభిమానికి ధన్యవాదాలు. తప్పకుండా బెంగళూరుకు నా మనసులో ప్రత్యేక స్థానం ఉంటుంది" అని రచిన్‌ భావోద్వేగానికి లోనయ్యాడు.

Last Updated : Nov 10, 2023, 12:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.