ETV Bharat / entertainment

దీపావళి వేళ పుష్ప-2 అప్​డేట్​​ ఇచ్చిన అల్లు అర్జున్​ - ​ ఖుషీలో బన్నీ ఫ్యాన్స్! - పుష్ప 2 లేటెస్ట్​ అప్డేట్​

Pushpa 2 Update : 'పుష్ప-2' సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్​ అప్​డేట్​​ ఇచ్చారు హీరో అల్లు అర్జున్​. తాజాగా మంగళవారం మూవీ ప్రీ రిలీజ్​ ఈవెంట్​లో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. అదేంటంటే..

Pushpa 2 Update Revealed By Allu Arjun
Pushpa 2 Update
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 12, 2023, 9:57 AM IST

Updated : Nov 12, 2023, 11:30 AM IST

Pushpa 2 Update : లెక్కల మాస్టర్​ సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్​ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'పుష్ప-2 : ది రూల్​'. వచ్చే ఏడాది ఆగస్టు 15న విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్​ అప్​డేట్​​ ఇచ్చారు బన్నీ. హైదరాబాద్​లో తాజాగా జరిగిన 'మంగళవారం' మూవీ ప్రీ-రిలీజ్​ ఈవెంట్​కు ​హాజరైన ఆయన అభిమానుల కోరిక మేరకు తన అప్​కమింగ్​ ప్రాజెక్ట్​ గురించి కొన్ని విషయాలను రివీల్​ చేశారు. దీంతో ఫ్యాన్స్​ ఫుల్​ ఖుషీలో ఉన్నారు.

"ఇప్పుడు నేను 'పుష్ప-2' షూటింగ్​ ముగించుకునే వచ్చాను. రామోజీ ఫిలిం సిటీలో ప్రస్తుతం షూట్​ జరుగుతుంది. ఈ సీన్స్​ కోసమే నేను చేతులకు పారాణీ, గోళ్లకు నెయిల్​ పాలిష్​ రాసుకున్నాను. అయితే రాబోయే 'పుష్ప-2' మీ ఊహలకు అందకుండా ఉంటుంది. ప్రస్తుతానికైతే ఇదే అప్డేట్​. సినిమా విడుదలయ్యాక మీరే చూస్తారు కదూ' అని 'మంగళవారం' సినిమా గురించి పలు విషయాలు చెప్పిన తర్వాత తన సినిమా గురించి చెప్పుకొచ్చారు అల్లు అర్జున్​.

'పుష్ప' పార్ట్​ 1 ఏ స్థాయిలో చరిత్ర సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటు దక్షిణాది, అటు ఉత్తరాదితో పాటు విదేశాల్లోనూ ఓ ఊపు ఊపింది ఈ మువీ. ఇందులో బన్నీ నటనకు ఇండస్ట్రీతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఫిదా అయ్యారు. ముఖ్యంగా హిందీ ఫ్యాన్స్​ అయితే ఈ చిత్రానికి బ్రహ్మరథం పట్టారు. అంతలా అక్కడి వారి అభిరుచులకు అనుగుణంగా మెప్పించారు ఐకాన్​ స్టార్​. ఇక దీనికి సీక్వెల్​గానే 'పుష్ప ది రూల్​​' రూపొందుతోంది. ప్రస్తుతం దీని కోసం అటు అల్లు అర్జున్​ ఫ్యాన్స్​తో పాటు ఆడియెన్స్​ కూడా తెగ వెయిట్​ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్​గా నేషనల్​ క్రష్​ రష్మిక నటిస్తోంది. మొదటి భాగంలోలా ఇందులోనూ శ్రీవల్లి పాత్రతో ఆమె అలరించనుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Mangalavaaram Release Date : మరోవైపు డైరెక్టర్ అజయ్​ భూపతి దర్శకత్వంలో పాయల్ రాజ్‌పుత్ ముఖ్య పాత్రలో తెరకెక్కిన 'మంగళవారం' సినిమా నవంబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది.

దీపాల కాంతుల్లో తారల ధగధగలు - ఫెస్టివ్ మోడ్​లో రాశి, కల్యాణి, రుక్సార్

'అనాధాశ్రమానికి వెళ్తా - మరాఠీ సంప్రదాయంలో జరుపుకుంటా'- తారల దీపావళి సంబరాలు ఇలా!

Last Updated : Nov 12, 2023, 11:30 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.