ETV Bharat / entertainment

రూల్ చేయడానికి పుష్పరాజ్ వచ్చేస్తున్నాడు, మేకర్స్ కీలక అప్డేట్ - పుష్ప 2 రిలీజ్ డేట్

దేశవ్యాప్తంగా ఘన విజయం సాధించిన 'పుష్ప: ది రైజ్' చిత్రానికి కొనసాగింపుగా వస్తున్న 'పుష్ప: ది రూల్'కు ముహూర్తం కుదిరింది. అప్​డేట్​ కోసం అభిమానుల ఎన్నో రోజుల ఎదురుచూపులకు తెరపడింది.

pushpa 2 release date
pushpa 2 release date
author img

By

Published : Aug 21, 2022, 5:44 PM IST

Pushpa 2 release date: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ర‌ష్మిక ప్రధాన పాత్రలో నటించిన 'పుష్ప‌' తొలి భాగం... దేశవ్యాప్తంగా సంచలన విజయం సాధించింది. ముఖ్యంగా నార్త్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. సినిమాలో బన్నీ చెప్పిన డైలాగ్​లు, శ్రీవల్లి పాటకు వేసిన స్టెప్పులు ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ దక్కించుకున్నాయి. 'తగ్గేదే లే' అని పుష్పరాజ్ చెప్పిన డైలాగ్, ఆ మేనరిజాన్ని అనుకరించనివారు లేరంటే అతిశయోక్తి కాదు. ఈ నేపథ్యంలో పుష్ప రెండో భాగంపై అంచనాలు మరింత పెరిగిపోయాయి.

pushpa 2 release date
.

Pushpa 2 poster: ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించింది. రెండో భాగం త్వరలోనే సెట్స్​పైకి వెళ్లనుంది. పలు పాత్రలకు నటీనటులను ఎంపిక చేసే పనిలో ఉన్నారు డైరెక్టర్​ సుకుమార్​. ఈ నేపథ్యంలో మేకర్స్ తాజాగా ఓ అప్డేట్ ఇచ్చారు. సోమవారం చిత్ర పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. దేశం అత్యంత ఆసక్తితో ఎదురుచూస్తున్న సీక్వెల్​ను భారీస్థాయిలో తీసుకొస్తున్నట్లు తెలిపారు. అభిమానులు ఈ సర్​ప్రైజ్ అప్​డేట్​తో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

pushpa 2 release date
మేకర్స్ అప్డేట్

పుష్ప.. తెలుగు, మ‌ల‌యాళం, హిందీతోపాటు మిగిలిన భాష‌ల్లో మంచి టాక్‌తో పాటు క‌లెక్ష‌న్ల‌ను రాబ‌ట్టింది. ముఖ్యంగా బన్నీ మాస్​గెటప్, నటన, డైలాగ్స్​, సాంగ్స్​, సుకుమార్​ టేకింగ్, దేవీ శ్రీ ప్రసాద్​ మ్యూజిక్​​ సినిమాకే హైలైట్​గా నిలిచాయి. స్టార్​ హీరోయిన్​ సమంత చిందులేసిన 'ఊ అంటావా మావ' స్పెషల్​ సాంగ్​ దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది. క‌న్న‌డ భామ ర‌ష్మిక ఈ చిత్రంలో శ్రీవ‌ల్లిగా డీ గ్లామ‌ర్ పాత్ర‌లో న‌టించి.. ఓ రేంజ్​లో పాపులారిటీ సంపాదించుకుంది. సోషల్​మీడియా ఇంటా బయట ఎక్కడ చూసినా పుష్ప ఫీవరే. రీల్స్, సాంగ్స్​, డైలాగ్స్​తో నెటిజన్లు తగ్గేదేలే అంటూ తెగ సందడి చేశారు. అందుకే దేశవ్యాప్తంగా సినీ అభిమానులు పుష్ప-2 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.