ETV Bharat / entertainment

డబుల్ ఇస్మార్ట్.. పూరి ఆ సవాళ్లను ఎలా ఎదుర్కొంటారో?

'లైగర్'​ డిజాస్టర్​తో దాదాపు ఎనిమిది నెలలు గ్యాప్ తీసుకున్న పూరి జగన్నాథ్​.. తన కొత్త సినిమాను రామ్​పోతినేనితో 'డబుల్​ ఇస్మార్ట్​'ను ప్రకటించారు. అయితే ఇప్పుడు పూరి ముందు కొన్ని సవాళ్లు ఉన్నాయి. ఏంటంటే?

Purijagannadh
డబుల్ ఇస్మార్ట్.. పూరి ఆ సవాళ్లను ఎలా ఎదుర్కొంటారో?
author img

By

Published : May 15, 2023, 11:17 AM IST

Updated : May 15, 2023, 11:59 AM IST

Double Ismart Ram Puri Jagannath : ఊహించినట్టే పూరి జగన్నాథ్​-హీరో రామ్ కాంబినేషన్​లో 'ఇస్మార్ట్ శంకర్' సీక్వెల్​ అఫీషియల్ అనౌన్స్​మెంట్​ వచ్చింది. నిజానికి 'లైగర్' లాంటి భారీ డిజాస్టర్​తో.. పూరి జగన్నాథ్​తో సినిమా చేసేందుకు హీరోలు, నిర్మాతలు వెనకడుగు వేశారని జోరుగా ప్రచారం సాగింది. విజయ్​ దేవరకొండ 'జనగనమణ' కూడా దాదాపు ఆ కారణంగానే ఆగిపోయింది. దీంతో సాధారణంగా వరుస సినిమాలు చేస్తూ త్వరత్వరగా పూర్తి చేసే పూరి.. లైగర్​ తర్వాత దాదాపు ఎనిమిది నెలలు సైలెంట్​గా ఉండిపోయారు.

మరోవైపు ఇదే సమయంలో రామ్​-పూరి కలయిక ప్రచారం తెరపైకి వచ్చినా.. అది సాధ్యమవుతుందో లేదో అనే అనుమానం అభిమానుల్లో భారీగానే నెలకొంది. కానీ రామ్.. ధైర్యంగా ఓ అడుగు ముందుకేసి.. తాను ఫ్లాపుల్లో ఉన్నప్పుడు లైఫ్ ఇచ్చిన పూరికి కృతజ్ఞతతో తిరిగి ఛాన్స్​ ఇచ్చారు. సీక్వెల్​కు ఓకే చెప్పేశారు. రీసెంట్​గా రెండు రోజుల కిందట సినిమాను ప్రకటించడమే కాకుండా.. ఒకరోజు మందు సినిమా రిలీజ్​ డేట్​ను కూడా చెప్పేశారు. పాన్​ ఇండియా లెవల్​లో విడుదల చేస్తామని పేర్కొన్నారు.

అసలీ సీక్వెల్​ స్క్రిప్ట్.. ఫస్ట్ పార్ట్​ రూపొందుతున్నప్పుడే మొదలయ్యిందట! ఇప్పుడు 'లైగర్'​ తర్వాత తీసుకున్న బ్రేక్​లో సీక్వెల్​ స్క్రిప్ట్​ను బాగా డెవలప్​ చేసి ఫైనల్​ వెర్షన్​ను పూరి పూర్తి చేశారట. తన టీమ్​తో కలిసి ఒకటికి పదిసార్లు ఆలోచించి స్క్రిప్ట్​ను పూర్తి చేశారని వినికిడి. అయితే అంతా బాగానే ఉంది కానీ .. రిలీజ్ డేట్​ను 2024 మార్చి 8 ప్రకటించారు.

ప్రస్తుతం రామ్.. బోయపాటితో సినిమా చేస్తున్నారు. ఆ మూవీ ఆగస్టుకు పూర్తి అవుతుందట! అప్పుడు నుంచి లెక్క లేసుకున్నా.. పూరికి తన సినిమా షూట్​ పూర్తి చేసి ఫస్ట్ కాపీ సిద్ధం చేయడానికి కేవలం ఆరు నెలల సమయం మాత్రమే ఉంది. ఈ వేగం పూరికి కొత్తేమి కాదు కానీ.. ఇప్పుడు పరిస్థితులు మునపటిలా లేవు. చాలా జాగ్రత్త పాటించాల్సి ఉంటుంది. అసలే 'లైగర్' రిజల్ట్​.. పూరి మార్కెట్​పై తీవ్రంగా ప్రభావం పడింది. ఇప్పటికే నష్టాలను పూడ్చాలని లైగర్​ డిస్ట్రిబ్యూటర్లు హైదరాబాద్​లో ధర్నాకు కూడా దిగారు. కాబట్టి.. ఇదంతా డబుల్ ఇస్మార్ట్ బిజినెస్ విషయంలో ఎఫెక్ట్ చూపించొచ్చు!

మరోవైపు ఆడియెన్స్​తో పాటు రామ్ పెట్టుకున్న నమ్మకాన్ని.. పూరి నిలబెట్టుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే ఇస్మార్ట్ శంకర్ సమయంలో కొన్ని అంశాలు కలిసి రావడంతో అది హిట్​ అయిపోయింది. అలా అని ఆ చిత్రాన్ని పూరి తీసిన అల్ టైమ్​ బెస్ట్ హిట్స్​లో చోటివ్వలేం. ఏదేమైనా ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్.. ఫస్ట్ భాగానికి మించి ఉంటుందని రుజువు చేయడంతో పాటు చెప్పిన సమయంలో రిలీజ్​ చేసే ఛాలెంజ్​ను పూరి ఎదురుకోవాల్సి ఉంటుంది. చూడాలి మరి.. ఈ సీక్వెల్​ను పూరి ఎలా చూపించబోతున్నారో, ఎలా పూర్తి చేస్తారో..

ఇదీ చూడండి: 'బిచ్చగాడు' బ్రాండ్​ తగ్గలా.. సీక్వెల్​కు కోట్లలో బిజినెస్​!

Last Updated : May 15, 2023, 11:59 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.