ETV Bharat / entertainment

Project K కామిక్ ఆర్ట్​ వెర్షన్​.. కథ ఇదేనటా! - Project K కామిక్ ఆర్ట్​ వెర్షన్​

prabhas Project K comic event : 'ప్రాజెక్ట్ కె' కామిక్ ఆర్ట్​ వెర్షన్​ను రిలీజ్ చేసింది మూవీటీమ్​. ప్రస్తుతం సోషల్​మీడియా అంతా దీని గురించే చర్చ కొనసాగుతోంది. ఆ వివరాలు..

Project K comic
'Project K' కామిక్ ఆర్ట్​ వెర్షన్​.. కథ ఇదేనటా
author img

By

Published : Jul 20, 2023, 3:01 PM IST

Updated : Jul 20, 2023, 3:25 PM IST

prabhas Project K comic event : ప్రభాస్​ ప్రధాన పాత్రలో రానున్న 'ప్రాజెక్ట్ కె' ప్రమోషన్స్​ వరల్డ్ వైడ్​ రేంజ్​లో గ్రాండ్​గా జరుగుతున్నాయి. ఇప్పటికే సినిమాకు సంబంధించి రిలీజైన ప్రభాస్, దీపికా పదుకొణె ఫస్ట్ లుక్స్​ సోషల్​మీడియాను షేక్ చేస్తున్నాయి. మార్వెల్ హీరోలా ప్రభాస్, హాలీవుడ్ హీరోయిన్​లా దీపిక అదిరిపోయారంటూ అభిమానులు తెగ కామెంట్లు పెడుతున్నారు. ఇకపోతే ఈ సినిమా టైటిల్ గ్లింప్స్​ను మరి కొన్ని గంటల్లో విడుదల కానుంది. అమెరికా వేదికగా శాన్ డీగోలోని ప్రతిష్టాత్మక కామిక్ కాన్​లో ప్రపంచానికి తెలియజేసేలా దీన్ని గ్రాండ్​గా ఆవిష్కరిస్తున్నారు. ఇప్పటికే దీనికోసం ప్రభాస్, కమల్ హాసన్, చిత్ర నిర్మాత అశ్వినీ దత్ సహా మిగతా మూవీటీమ్​ అక్కడికీ చేరుకుని ప్రమోషన్స్ మొదలుపెట్టేసింది.

Project K Sandiego : ఈ కామిక్ కాన్ ఈవెంట్​లో వరల్డ్ వైడ్​గా ఉన్న చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులంతా ఫుల్ ఖుషీగా సందడి చేస్తున్నారు. 'ప్రాజెక్ట్ కె' చిత్రబృందం కూడా ప్రేక్షకులతో కలిసిపోయి.. తమ రైడర్స్​తో జోరుగా ప్రమోషన్స్ చేస్తోంది. ఇక ఈ ఈవెంట్​లో ప్రభాస్, కమల్​హాసన్​ గ్రాండ్ ఎంట్రీ, వారి లుక్స్​ అదిరిపోయాయి. అభిమానులు వాటిని చూసి ఫిదా అయిపోతున్నారు. ఈ కామిక్ ఈవెంట్​లో 'ప్రాజెక్ట్ కె' మూవీటీమ్​ చేసే ప్రతి ఒక్క విషయాన్ని.. నిర్మాణ సంస్థ తన అధికార సోషల్​ మీడియా అకౌంట్​లో ఎప్పటికప్పుడూ పోస్ట్​ చేస్తోంది. ఫ్యాన్స్​లో, సినీ ప్రియుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. దీంతో సోషల్​మీడియా అంతా ప్రాజెక్ట్​ కె రచ్చే కొనసాగుతోంది. వాటికి సంబంధించిన విషయాలు, ఫొటోలు, పోస్టర్లు చక్కర్లు కొడుతున్నాయి.

అయితే ఇప్పుడు కామిక్ కాన్ ఈవెంట్​లో 'ప్రాజెక్​ కె' మూవీటీమ్​.. తమ సినిమాను కామిక్​ ఆర్ట్​ వెర్షన్​లో రిలీజ్ చేసింది. దీనికి సంబంధించిన ఫొటోను ట్విటర్​లో పోస్ట్ చేసింది. అయితే ఇప్పటికే ఈ పేజీలు సోషల్​మీడియాలో లీక్​ అయిపోయి ట్రెండ్ అయ్యాయి. ఇప్పుడు వాటినే నిర్మాణ సంస్థ వైజయంతీ కూడా షేర్ చేసుకుంది. ప్రాజెక్ట్ కె కామిక్ ఆర్ట్​ వెర్షన్​ అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది. ఇక వీటిని చూసిన నెటిజన్లు అభిమానులు.. సినిమా కథ ఇదే అంటూ, అందుల ఇలా రాసి ఉందంటూ చెబుతున్నారు.

project K movie story : కలియుగం చివర్లో ప్రజలను హింసించే రాక్షసుడు ఒకడు ఉంటాడని, అతడిని ఎదురించేందుకే దేవుడిలా ప్రభాస్ వస్తారని అంటున్నారు. ఈ కథను హాలీవుడ్​ స్టైల్​లో రూపొందిస్తున్నారని అంటున్నారు. దాదాపు రూ. 500 కోట్ల భారీ బడ్జెట్​తో ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్​ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఇకపోతే ఈ సినిమాలో బాలీవుడ్ బిగ్​ బీ అమితాబ్ బచ్చన్, హాట్ బ్యూటీలు దీపికా పదుకొణె, దిశా పటానీ, కమల్ హాసన్.. పలువురు స్టార్ ఇందులో నటిస్తున్నారు.

ఇదీ చూడండి:

యమా స్టైలిష్​ లుక్​లో ప్రభాస్​.. 'రైడర్స్'​ కంట్రోల్​లోకి కామిక్​ కాన్​ ఈవెంట్​

అమెరికాకు రానా వెళ్లింది అందుకేనా?.. రెండు పెద్ద సర్​ప్రైజ్​లే!

Last Updated : Jul 20, 2023, 3:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.