ETV Bharat / entertainment

బోల్డ్ సీన్స్​తో హైరేంజ్​లో అమలా పాల్​.. స్టన్నింగ్​ విజువల్స్​తో ట్రైలర్​.. చూశారా? - ఆడుజీవితం ట్రైలర్​ అమలాపాల్ హాట్ సీన్స్​

సినిమా ప్రపంచంలో హీరోయిన్​లు కెరీర్​లో ముందుకు వెళ్లాలంటే.. యాక్టింగ్ స్కిల్స్​తో పాటు అందాల ఆరబోత కూడా కాస్త ఉండాల్సిందే. ఈ గ్లామర్​ ట్రీట్​ ఇవ్వడంలో ముందు ఉండే హీరోయిన్ అమలా పాల్ మరోసారి తన మార్క్ బోల్డ్​ సీన్స్​తో రెచ్చిపోయింది. తాజాగా రిలీజైన ట్రైలర్​లో టాప్​లెస్​గా కనిపించి సోషల్​మీడియాలో హాట్ టాపిక్​గా మారింది. ఆ వివరాలు..

Aadujeevitham trailer heroine Amalapaul bold scenes viral
బోల్డ్ సీన్స్​తో హైరేంజ్​లో అమలా పాల్​.. స్టన్నింగ్​ విజువల్స్​తో ట్రైలర్
author img

By

Published : Apr 11, 2023, 6:55 AM IST

Updated : Apr 11, 2023, 8:04 AM IST

మలయాళ హీరో డైరెక్టర్​ కమ్​ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్-హీరోయిన్ అమలాపాల్ జంటగా నటించిన కొత్త చిత్రం 'ఆడుజీవితం'. పాన్ వరల్డ్ మూవీగా ఆడియెన్స్​ ముందుకు తీసుకురాబోతున్నారు. ఇంగ్లీష్​లో ది గోట్​ లైఫ్​ పేరుతో రిలీజ్ చేయనున్నారు. పదేళ్లుగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఉపాధి కోసం సౌదీ వెళ్లిన వలస కూలీ అక్కడ ఎలాంటి కష్టాలు పడ్డాడనే నేపథ్యంలో రూపొందింది ఈ సినిమా. ఎడారిలో వలస జీవుల ఆకలి వేదన, నీళ్లు కూడా దొరకక పడే కష్టాలు, బానిస బతుకును కళ్లకు కట్టినట్టు చూపించారు. రీసెంట్​గా రెండు రోజుల క్రితం ఈ సినిమా ట్రైలర్​ రిలీజైంది. మెల్లమెల్లగా ఇది ఆడియెన్స్​కు రీచ్​ అవుతోంది. సోషల్​మీడియాలో ట్రెండింగ్​ అవ్వడం ప్రారంభించింది. ఆద్యంతం ఆకట్టుకుంటున్న ఈ ప్రచార చిత్రం నెటిజన్లు చేత కన్నీళ్లు కూడా పెట్టిస్తోంది. నేషనల్ అవార్డు విన్నర్ బ్లెస్సీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించడంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. అలాగే ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ పెయిర్​ ఏఆర్ రెహమాన్-రసూల్ పుకుట్టీలు ఈ సినిమాకు పని చేయడం మరో విశేషం.

ఇకపోతే సుకుమారన్​.. బలమైన, ప్రయోగాత్మక కథలో నటిస్తూ తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. తన నటనతో విమర్శకుల ప్రశంసలను కూడా దక్కించుకుంటుంటారు. కథ కోసం, పాత్ర కోసం.. ప్రాణం పెట్టి నటిస్తుంటారు. ఇప్పుడా విషయాన్ని మరోసారి నిరూపించారు సుకుమారన్​. తాజా ప్రచార చిత్రంలో సుకుమారన్ ఎడారిలో పనిచేసే కూలీగా కనిపించి తన నటనతో మనసును హత్తుకున్నారు. ఈ పాత్ర కోసం ఆయన ఎంతలా శ్రమించారో, కష్టపడ్డారో.. తన మేకోవర్ ఎలా ఛేంజ్​ చేసుకున్నారో ఈ ట్రైలర్​ చూస్తే అర్థమవుతుంది. ఎక్కువ భాగం ఈ చిత్ర షూటింగ్​ను ఎడారిలోనే చిత్రీకరించినట్లు తెలుస్తోంది. సహారా, అల్జీరియా, జోర్డాన్ ఎడారుల్లో ఈ మూవీ షూటింగ్​ జరిగినట్లు సమాచారం. విజువల్స్ చాలా బాగున్నాయి. అయితే ఇంకా షూటింగ్ పూర్తి కాలేదట. వచ్చే ఏడాది ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు మూవీటీమ్​ సన్నాహాలు చేస్తోందట.

అయితే ఇప్పుడు ఈ ట్రైలర్​లో మరో అంశం కూడా హైలైట్​ అవుతోంది. బోల్డ్​నెస్​కు కేరాఫ్​ అడ్రెస్​గా నిలిచే హీరోయిన్ అమలాపాల్​.. ఈ చిత్రంలో పృథ్వీరాజ్​ సరసన నటించింది. ఈ ప్రచార చిత్రంలో కూడా తన మార్క్​ బోల్డ్​నెస్​ను బాగా చూపించింది. మూవీలో మరింత బోల్డ్​గా కూడా నటించినట్లు అర్థమవుతోంది. పృథ్వీరాజ్​తో లిప్​లాక్​ సీన్స్​, టాప్​ లెస్​లో రొమాన్స్​ సీన్స్​లో కనిపించింది. ఇది చూసిన నెటిజన్లు అమలా పాల్​ సీన్స్​ను ట్రెండ్ చేస్తున్నారు. అలానే పృథ్వీరాజ్​ డెడికేషన్​, పాత్ర కోసం ఆయన మారిన విధానాన్ని కూడా ప్రశంసిస్తున్నారు. చూడాలి మరి ఈ సినిమా ఆడియెన్స్​ను ఎంత వరకు ఆకట్టుకుంటుందో..

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: సోనాల్​​, అక్షర హాట్​ ఫొటో షూట్​.. ఆ అందాలు చూస్తే మైండ్​ బ్లాకే!

Last Updated : Apr 11, 2023, 8:04 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.