Prashanth Neel Salaar Movie : 'కేజీఎఫ్' సిరీస్‌తో ప్రేక్షకులకు గూస్బంప్స్ తెప్పించిన ప్రశాంత్ నీల్ తాజాగా 'సలార్'తో సెన్సేషన్స్ క్రియెట్ చేస్తున్నాడు. రెబల్ స్టార్ ప్రభాస్, శ్రుతి హాసన్, పృథ్వీరాజ్ సుకుమారన్ లాంటి స్టార్స్‌తో తెరకెక్కిన ఈ మూవీ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద రోజుకో రికార్డు సృష్టిస్తోంది. ఇక ఈ విజయంపై ప్రశాంత్ ఆనందం వ్యక్తం చేశారు. ఇటీవలే ఓ ఇంటర్వ్యూల్లో పాల్గొన్న ఆయన ఈ సినిమాను ఆదరించిన ఆడియెన్స్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. అయితే సోషల్ మీడీయాలో 'డంకీ', 'సలార్' మధ్య జరుగుతున్న ఫైట్ గురించి ఆయన స్పందించారు.
"ఇద్దరు హీరోల సినిమాల మధ్య పోటీ పెడుతూ కొందరు ఫ్యాన్స్ గొడవ పడుతుంటారు. నేను ఇలాంటివాటిని అస్సలు ఎంకరేజ్ చేయను. అసలు వాటి గురించి వినడానికి కూడా ఇష్టపడను. ఈ తరహా పోకడలు సినిమా రంగానికి అస్సలు మంచిది కాదు. స్టార్స్ అంతా ఒకరితో ఒకరు పోటీ పెట్టుకోరు. వాళ్లంతా ఎంతో ఫ్రెండ్లీగా ఉంటారు. ఇక అందరూ అనుకుంటున్నట్లు 'సలార్', 'డంకీ' మధ్య నెగెటివ్ వాతావరణం ఉండాలని నేనెప్పుడూ అనుకోలేదు. 'డంకీ' ప్రొడ్యూసర్లు కూడా అలానే ఆలోచించి ఉంటారు. మేమంతా ఒక్కటే ప్రేక్షకులకు వినోదాన్ని పంచాలనే తపన మా అందరిలోనూ ఉంటుంది. రెండింటి మధ్య పోటీ ఉండటానికి ఇదేం క్రికెట్ మ్యాచ్ కాదు కదా" అని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
మరోవైపు 'సలార్' మూవీని ఇంకాస్త బాగా ప్రమోట్ చేసుంటే బాగుండు. అలా చేసి ఉంటే ఇంకా ఎక్కువ కలెక్షన్లు వచ్చేవంటూ వస్తోన్న వార్తలపై కూడా నీల్ స్పందించారు. 'డంకీ'తో పాటు కాకుండా ఈ సినిమా సోలోగా రిలీజ్ అయ్యుంటే ఇలాంటి వార్తలు వచ్చేవి కాదని ఆయన అన్నారు. ఈ రెండు సినిమాల మధ్య పోటీ పెట్టి ఒకదాన్ని తక్కువగా చూడొద్దంటూ చెప్పుకొచ్చారు.
Salaar Box Office Collection: ప్రభాస్ భారీ యాక్షన్ ఫిల్మ్ సలార్ రెండో వారంలోకి ఎంటర్ అయ్యింది. తొలి వారంలో రికార్డు స్థాయిలో కలెక్షన్లు వసూల్ చేసిన సలార్, ఈ వారంలోనూ అదే జోరును ప్రదర్శిస్తోంది. ఇప్పటికే వరల్డ్‌వైడ్‌గా రూ.500 కోట్లు దాటింది. అటు ఓవర్సీస్లోనూ చరిత్ర సృష్టిస్తోంది. నార్త్ అమెరికాలో ఇప్పటివరకు సలార్ 7.5 మిలియన్ డాలర్లు వసూల్ చేసినట్టు చిత్రబృందం తెలిపింది. ఇక ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ సినిమా హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై రూపొందింది. సినిమాలో ప్రముఖ నటుడు పృథ్విరాజ్, శ్రుతిహాసన్, జగపతిబాబు, శ్రియా రెడ్డి తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
అక్కడ కూడా ప్రభాస్ టాప్ - 'సలార్' డామినేషన్ మాములుగా లేదుగా
'సలార్' మేనియా అన్‌స్టాపబుల్- ఇప్పటి వరకు ఎన్ని రికార్డులు సాధించిందంటే ?