Pranitha Subhash New Photos : బ్యూటీఫుల్ అండ్ గ్లామరస్ హీరోయిన్ ప్రణీతా సుభాష్ .. కెరీర్లో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సినిమా అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటున్న ఈ భామ.. అభిమానులకు కూడా ఫుల్ టచ్‌లో ఉంటోంది. స్పెషల్ ఈవెంట్లలోనూ మెరుస్తోంది.
Pranitha Subhash Ramp Walk : తాజాగా ఈమె.. బెంగళూరులో నిర్వహించిన సైమా ప్రీఈవెంట్ ఫంక్షన్లో పాల్గొంది. స్టేజ్‌పై నిర్వహించిన ర్యాంప్ వాక్‌లోనూ పాల్గొని సందడి చేసింది. బ్లాక్ డ్రెస్‌లో ర్యాంప్ వాక్ చేస్తూ ఆకట్టుకుంది. దీనికి సంబంధించిన ఫొటోలను సోషల్‌మీడియాలో అభిమానులనుతో షేర్ చేసింది. బ్లాక్ డిజైన్డ్ లెహంగా, మ్యాచింగ్ బ్లౌజ్, వెనకాల ఈకల లాంటి డిజైన్ కలిగిన డ్రెస్ ధరించి మైండ్ బ్లో చేసింది. ఈ అట్రాక్టివ్ లుక్ ఫ్యాన్స్‌ను బాగా నచ్చింది. అలాగే ఈ ముద్దుగుమ్మ ర్యాంప్ వాక్ చేస్తూ ఇచ్చిన పోజులు కూడా మెస్మరైజింగ్‌గా ఉన్నాయి. ఇంకా ఈ ఫొటోలకు మంచి ఇంట్రెస్టింగ్గా క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది. "ర్యాంప్ వాక్ మించిన ఆరా మరొకటి లేదు! బెంగళూరులో సైమా ప్రీఈవెంట్లో ఇది" అంటూ పేర్కొంది. ఈ నయా లుక్ చూసిన ప్రణీత అభిమానులను ఫుల్ ఖుషీ అవుతున్నారు.
ఇకపోతే మొదటి లాక్ డౌన్ సమయంలో ప్రణీత పెళ్లి బంధంలోకి అడుగుపెట్టింది. గతేడాది ఈ ముద్దుగుమ్మ ఓ పాపకు కూడా జన్మనిచ్చింది. అయినా ఆమె అందం ఏమాత్రం చెక్కుచెదరలేదు. ఇంకా తన గ్లామర్‌తో కుర్రాళ్లను అట్రాక్ట్ చేస్తూనే ఉంది. ఎందుకంటే ఈ భామ గ్లామర్ విషయంలో మరింతగా జాగ్రత్తలు తీసుకుంటూ వాటిని సోషల్‌మీడియా ద్వారా తెలియజేస్తూ ఉంది. అలా రోజురోజుకు ఈ ముద్దుగుమ్మ మరింత యంగ్‌గా కనిపిస్తోంది.
Pranitha Subhash Upcoming Movie : ప్రణీత 'పోక్రి' అనే కన్నడ సినిమాతో నటిగా మారిన ప్రణీత 'ఏం పిల్లో ఏం పిల్లడో'తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 'బావ', 'అత్తారింటికి దారేది', 'రభస' తదితర చిత్రాల్లో నటించింది. 'అత్తారింటికి దారేది' సినిమాతో బుట్టబొమ్మగా పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్‌లో.. మలయాళంలోకి ఎంట్రీ ఇవ్వనుంది. అక్కడి సూపర్ స్టార్ దిలీప్ కుమార్ 148వ చిత్రంలో నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. మరి తెలుగులో ఎప్పుడు రీఎంట్రీ ఇస్తుందోనని అభిమానులు ఎదురుచూస్తున్నారు.
మిల మిల మెరిసే తార.. అందాల ప్రణీత
సినిమాలకు బ్రేక్ ఇచ్చి అమ్మతనాన్ని ఆస్వాదిస్తున్న అందాల భామలు