ETV Bharat / entertainment

ప్రదీప్​ కొత్త సినిమా అప్డేట్​.. సూర్యపై ఎఫ్‌ఐఆర్‌.. అసిస్టెంట్స్‌కు రాజ‌మౌళి గిఫ్ట్స్ - రాజమౌళి ఆర్​ఆర్​ఆర్​

సూర్య హీరోగా తెరకెక్కిన 'జై భీమ్‌'పై వివాదం ఇంకా ఆగలేదు. ఈ సినిమాలో నటించిన సూర్య, నిర్మించిన జ్యోతికపై కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది. అలాగే 'ఆర్​ఆర్​ఆర్'​, యాంకర్​ ప్రదీప్​ కొత్త సినిమా అప్డేట్స్​ మీకోసం..

update
మూవీ అప్డేట్స్​
author img

By

Published : May 5, 2022, 8:57 PM IST

'ఆర్ఆర్ఆర్' సినిమాతో తెలుగు సినిమా స‌త్తాను మరోసారి ప్ర‌పంచానికి చాటారు దర్శకధీరుడు రాజ‌మౌళి. ఈ సినిమా హిట్​ కావడంలో భాగ‌మైన డైరెక్ష‌న్ టీమ్​తో పాటు స‌హాయ సిబ్బందికి రాజ‌మౌళి కాస్ట్‌లీ గిఫ్ట్‌ల‌ను అందజేశారట. అసిస్టెంట్స్ అంద‌రికి ఖ‌రీదైన ఐఫోన్‌ల‌ను బ‌హుమ‌తిగా ఇచ్చిన‌ట్లు సమాచారం. అలాగే ఈ సినిమా లైన్​ ప్రొడ్యూసర్​, కీర‌వాణి స‌తీమ‌ణి వ‌ల్లి కూడా త‌న అసిస్టెంట్స్ అందరికి న‌గ‌దును బ‌హుమ‌తిగా అందించిన‌ట్లు స‌మాచారం.

సూర్య, జ్యోతికపై కేసు!

సూర్య హీరోగా తెరకెక్కిన 'జై భీమ్‌' చిత్రం ఎన్ని ప్రశంసలు అందుకుందో ఓ వర్గం నుంచి అదే స్థాయిలో విమర్శలు ఎదుర్కొంది. తమిళనాడుకు చెందిన వన్నియార్లు అనే కమ్యూనిటీని అవమానించారంటూ సినిమా విడుదల సమయంలో పీఎంకే నేత అన్బుమణి రామదాసు ఆరోపించగా, అదే సామాజిక వర్గానికి చెందిన 'రుద్ర వన్నియర్‌ సేన' గతేడాది నవంబరులో కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలోని కొన్ని సీన్లు తమ ప్రతిష్టను దెబ్బతిసేలా ఉన్నాయంటూ ఆ సేన పిటిషన్‌లో పేర్కొంది. గురువారం ఆ పిటిషన్‌ను విచారించిన సైదాపేట్‌ కోర్టు సూర్యతోపాటు ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించిన ఆయన సతీమణి జ్యోతిక, దర్శకుడు జ్ఞానవేల్‌పై కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది. జస్టిస్‌ చంద్రు కెరీర్‌లో కీలకంగా నిలిచిన కొన్ని సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం నేరుగా ఓటీటీ అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదలై (2021 నవంబరు 2), విశేష ప్రేక్షకాదరణ పొందింది. ఆస్కార్‌ పోటీల్లోనూ నిలిచింది.

ప్రదీప్ సినిమా కబురు

తన కొత్త సినిమాకు సంబంధించి త్వరలోనే ప్రేక్షకులకు తీపి కబురు చెప్పనున్నట్లు ప్రముఖ వ్యాఖ్యాత, నటుడు ప్రదీప్ తెలిపారు. బుల్లితెర షోల ద్వారా తనను అభిమానించే ప్రేక్షకుల కోసం మంచి కథతో రాబోతున్నట్లు వెల్లడించారు. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా కోసం సర్కార్-2 షో చేస్తున్న ప్రదీప్.. ఆ షో వివరాలను వెల్లడిస్తూ తన అభిమాన ప్రేక్షకులు ఎదురుచూస్తోన్న సినిమా కబురు కూడా ప్రకటించాడు. అలాగే ఓటీటీలో వెబ్ సిరీస్ లు, వెబ్ ఫిల్మ్స్ లో నటించేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలిపాడు. త్వరలోనే ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించనున్నట్లు ప్రదీప్ పేర్కొన్నాడు.

ఇదీ చదవండి: 11రూపాయలకే​ సినిమా చేసిన స్టార్ హీరోయిన్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.