ETV Bharat / entertainment

నడిచేందుకు ప్రభాస్ ఇబ్బందులు​.. ఈవెంట్​లో ఏమైంది? - నడవలేని స్థితిలో ప్రభాస్​

ఆదిపురుష్​ టీజర్ రిలీజ్​ ఈవెంట్​లో ప్రభాస్​ సరిగ్గా నడవలేని స్థితిలో కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. ఇంతకీ ఆయనకి ఏమైందంటే?

prabhas adipurush
నడవలేని స్థితిలో ప్రభాస్​
author img

By

Published : Oct 3, 2022, 1:38 PM IST

Updated : Oct 3, 2022, 1:54 PM IST

బాలీవుడ్‌ దర్శకుడు ఓం రౌత్‌ దర్శకత్వంలో పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ హీరోగా రూపొందుతున్న భారీ బడ్జెట్​ చిత్రం 'ఆదిపురుష్‌'. రామాయణం ఇతివృత్తంగా ఈ సినిమాను తీర్చిదిద్దుతున్నారు. దసరా కానుకగా ఆదివారం 'ఆదిపురుష్‌' టీజర్‌ను అయోధ్య వేదికగా సరయు నది తీరాన గ్రాండ్‏గా విడుదల చేశారు. అయితే గ్రాండ్‌గా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రభాస్‌ను చూసిన ఆయన అభిమానులు.. ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డార్లింగ్‌కు ఏమైంది అంటూ కంగారు పడుతున్నారు.

ఏమైందంటే.. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభాస్‌ వైట్​ అండ్​ వైట్​ లుక్​లో బాగానే కనపడ్డారు. అయితే ఆయన నడవడానికి చాలా ఇబ్బంది పడినట్లు అర్థమవుతోంది. దీనికి సంబంధించి ఓ వీడియో ఒకటి సోషల్​మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ వీడియోలో డార్లింగ్​ మెట్లు దిగేందుకు దర్శకుడు ఓం రౌత్‌, కృతి సనన్‌ సాయం తీసుకున్నారు. వారి చేతులు పట్టుకుని మెట్లు దిగారు. ఇక ఈ వీడియోలు చూసిన అభిమానులు.. ప్రభాస్‌కు ఏమైంది? అని ఆందోళన వ్యక్తం చేస్తూ ఆరా తీస్తున్నారు.

కాగా, కొద్ది రోజుల క్రితం రాధేశ్యామ్​ విడుదల తర్వాత.. ప్రభాస్​ సర్జరీ కోసం విదేశాలకు వెళ్లారు. కొంతకాలం విరామం తీసుకుని షూటింగ్​లలో పాల్గొన్నారు. బహుశ ఆ గాయం మళ్లీ తిరగబెట్టి ఉండవచ్చని.. అందుకే ఆయన నడవడానికి ఇబ్బంది పడ్డారని అభిప్రాయపడుతున్నారు.

ఇదీ చూడండి: Adipurush: హనుమంతుడిగా నటించింది ఎవరో తెలుసా?

Last Updated : Oct 3, 2022, 1:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.