ETV Bharat / entertainment

ప్రభాస్​ 'సలార్​' లుక్ లీక్​.. 'ఆచార్య'లో కాజల్​ సీన్స్​కు కత్తెర! - acharya kajal agarwal release date

'సలార్'​ సినిమాలోని ప్రభాస్ లుక్​ లీక్​ అయి సోషల్​మీడియాలో వైరల్​గా మారింది. మరోవైపు 'ఆచార్య' సినిమాలోని కాజల్​ సన్నివేశాల్ని కత్తిరించినట్లు అంతా మాట్లాడుకుంటున్నారు.

Acharya movie Kajal Agarwal
Prabhas Salar movie look leaked
author img

By

Published : Apr 19, 2022, 1:14 PM IST

Prabhas Salaar look leaked: 'బాహుబలి'తో పాన్​ ఇండియా హీరోగా మారిన టాలీవుడ్​ కథానాయకుడు ప్రభాస్​. 'కేజీఎఫ్'​తో పాన్​ ఇండియా డైరెక్టర్​గా మారిన కన్నడ దర్శకుడు ప్రశాంత్​నీల్​. ఈ ఇద్దరి కాంబోలో తెరకెక్కుతున్న పవర్​ఫుల్​ యాక్షన్​ ప్యాక్డ్​ చిత్రం 'సలార్​'. ఈ సినిమా అప్డేట్స్​ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు.. వచ్చే నెలలో గ్లింప్స్​ను విడుదల చేస్తున్నట్లు తెలిపి వారిలో జోష్​ను నింపింది మూవీటీమ్​.​​ ఈ క్రమంలోనే సినిమా షూటింగ్​ స్పాట్​లోని ప్రభాస్​ లుక్​ లీక్​ అయింది. ఇందులో ప్రభాస్ మాస్​ లుక్​తో ఆకట్టుకుంటున్నారు.

ప్రస్తుతం ఇది సోషల్​మీడియాలో వైరల్​గా మారింది. 'కేజీఎఫ్'​కు మించిన మాస్ మసాలా మూవీని ప్రశాంత్​ నీల్​ అందించనున్నారని ఫ్యాన్స్​ ట్వీట్స్​ చేస్తున్నారు. కాగా, ఈ సినిమాను తెలుగు, కన్నడ భాషల్లో రూపొందించడం సహా పాన్​ఇండియా స్థాయిలో విడుదల చేయనున్నారు. ఈ చిత్రంతోనే కన్నడలోకి ప్రభాస్​ అరంగేట్రం చేయనున్నారు. ప్రభాస్​ ద్విపాత్రాభినయం చేస్తున్నారట! 'కేజీఎఫ్​' ఫేమ్​ రవి బస్రూర్​ సంగీతాన్ని అందిస్తున్నారు. కన్నడ నటుడు మధు గురుస్వామి, మలయాళ హీరో పృథ్వీరాజ్​ కీలక పాత్ర పోషిస్తున్నారు. శ్రుతిహాసన్​ హీరోయిన్​.

Prabhas Salar movie look leaked
ప్రభాస్​ సలార్​ లుక్​

Acharya movie Kajal Agarwal scenes deleted: మెగాస్టార్​ చిరంజీవి, రామ్​చరణ్​ ప్రధాన పాత్రలో కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న సినిమా 'ఆచార్య'. ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. కాజల్​ అగర్వాల్​, పూజాహెగ్డే హీరోయిన్లు. అయితే ఈ చిత్రంలో కాజల్​ సన్నివేశాలని కత్తిరించారనే అనుమానం అభిమానుల్లో మొదలైంది. ఆమె పాత్ర కూడా పూర్తిస్థాయిలో ఉండకపోవచ్చని అంతా మాట్లాడుకుంటున్నారు. ఇటీవలే విడదలై ట్రైలర్​లో పూజాహెగ్డేను చూపించినప్పటికీ.. కాజల్​ను అస్సలు చూపించకపోవడం ఓ కారణం.

మరోవైపు, కరోనా వల్ల తొలుత షూటింగ్ వాయిదా పడటం, చిత్రీకరణ మళ్లీ ప్రారంభమయ్యేటప్పటికీ ఆమెకు ప్రెగ్నెన్సీ రావడం వంటివి జరగడం వల్ల షూటింగ్​లో కాజల్​ పాల్గొనలేకపోయిందని సమాచారం. అందుకే ఆమె పాత్రలో కూడా కాస్త మార్పులు చేశారని తెలిసింది. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే సినిమా వచ్చే వరకు వేచి ఉండాల్సిందే.

ఇదీ చూడండి: మాల్దీవుల్లో రాఖీభాయ్​.. అర్ధరాత్రి చార్మినార్​కు​ రాజమౌళి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.