ETV Bharat / entertainment

'అవెంజర్స్'​ రేంజ్​లో 'ప్రాజెక్ట్​ కె'.. రిలీజ్​పై క్లారిటీ ఇచ్చిన నిర్మాత - ప్రభాస్​ ప్రాజెక్ట్​ కె సీక్వెల్​

Prabhas Project K movie: ప్రభాస్​ నటిస్తున్న 'ప్రాజెక్ట్​ కె' సినిమాపై బిగ్​ అప్డేట్​ ఇచ్చారు నిర్మాత అశ్వనీ దత్​. 'అవెంజర్స్​' తరహాలో పాన్​ వరల్డ్​గా మూవీని రూపొందిస్తున్నట్లు తెలిపారు. 2023లో ప్రభాస్​ పుట్టినరోజున రిలీజ్​ చేసే అవకాశముందని చెప్పారు.

prabhas project K
ప్రభాస్​ ప్రాజెక్ట్​ కె
author img

By

Published : Jul 28, 2022, 5:16 PM IST

Updated : Jul 28, 2022, 7:04 PM IST

Prabhas Project K movie: పాన్​ఇండియా స్టార్​ ప్రభాస్​ నటించనున్న సినిమాల్లో 'ప్రాజెక్ట్ కె'ఒకటి. దీన్ని వైజయంతి మూవీస్​ నిర్మిస్తోంది. అయితే తాజాగా ఈ నిర్మాణ సంస్థ రూపొందించిన దుల్కర్​ సల్మాన్​ 'సీతారామం' విడుదలకు సిద్ధమైంది. దీంతో ఈ చిత్ర ప్రమోషన్స్​లో పాల్గొన్న నిర్మాత అశ్వనీదత్​.. సీతారామం ఘన విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే 'ప్రాజెక్ట్​ కె' గురించి కూడా మాట్లాడారు. చైనా, అమెరికా సహా అంతర్జాతీయ మార్కెట్లను దృష్టిలో పెట్టుకుని పాన్​ వరల్డ్​ స్థాయిలో సినిమాను రూపొందిస్తున్నట్లు తెలిపారు. ప్రాజెక్ట్​కు సీక్వెల్​ కూడా ఉండొచ్చని, 'అవెంజర్స్'​ తరహాలో దీన్ని తెరకెక్కించనున్నట్లు పేర్కొన్నారు. ప్రభాస్​ పాత్ర టెర్రిఫిక్​గా ఉంటుందని, అక బాలీవుడ్​ బిగ్​ బి అమితాబ్​ బచ్చన్​ను​.. ఎన్నడూ చూడని విధంగా చూస్తారని చెప్పారు. ఈ సినిమాను చూశాక.. అభిమానులు తప్పకుండా ఆశ్చర్యపోతారని చెప్పుకొచ్చారు. 2023 నాటికి షూటింగ్​ను పూర్తి చేసి అక్టోబర్​ 18న లేదా 2024 జనవరిలో రిలీజ్​ చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. త్వరలోనే దీనిపై అధికార ప్రకటన వస్తుందని చెప్పారు. 'ప్రాజెక్ట్​ కె' తర్వాత 'జగదేకవీరుడు' సీక్వెల్​ను తెరకెక్కించనున్నట్లు స్పష్టం చేశారు అశ్వనీ దత్​. ఇంకా తమ బ్యానర్​లో నందిని రెడ్డి-నాగచైతన్య కాంబోలో ఓ సినిమా, శ్రీకాంత్​ తనయుడు రాకేష్​ రోషన్​తో ఓ మూవీ ఉంటుందని పేర్కొన్నారు.

చిత్రసీమపై ఘాటు వ్యాఖ్యలు.. సినిమాలపై ప్రేక్షకుల్లో విరక్తి కలిగిందని, వారిని థియేటర్‌కు రప్పించడం ఇప్పుడొక సవాల్‌గా మారిందని అశ్వినీదత్‌ అన్నారు. సీఎంల వద్దకు వెళ్లి టికెట్‌ ధరలు పెంచుకోవడమే ప్రస్తుత స్థితికి కారణమని చెప్పారు. ఇంకా చిత్ర పరిశ్రమపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు, ఏపీ ప్రభుత్వం తీరుపైనా మండిపడ్డారు. "నిర్మాతల శ్రేయస్సు కోసమే అప్పట్లో ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌ ఏర్పాటైంది. ప్రస్తుతం ప్రొడ్యూసర్స్‌ గిల్డ్‌ ఎందుకు వచ్చిందో తెలియట్లేదు. ధరలు తగ్గించాలని ఓసారి.. పెంచాలని మరోసారి చెప్పడం వల్లే సినిమాపై ప్రేక్షకుల్లో విరక్తి కలిగింది. టికెట్‌ ధరలు పెంచిన వాళ్లే ఇప్పుడు ‘షూటింగ్స్‌ బంద్‌’ అని ఆందోళన చేస్తున్నారు. కరోనాతో పాటు టికెట్ల ధరలను పెంచడం, తగ్గించడం, సినిమాలకు వ్యయం ఎక్కువయ్యిందని సీఎంలతో ధరలను పెంచుకున్నారు. ధరలు పెంచకముందే ఒక సెక్షన్‌ ప్రజలు థియేటర్‌కు రావడం లేదు. సినిమాహాల్‌ క్యాంటీన్‌లలో ఎనలేని రేట్లు పెట్టారు. ఫ్యామిలీతో సినిమా రావాలంటేనే విరక్తి పుట్టేలా చేశారు. ఈ లోపు ఓటీటీలు వచ్చాయి. ఓటీటీలపై దండయాత్ర చేస్తున్నారు. కానీ, థియేటర్‌కు జనం రాకుండా ఓటీటీలో సినిమాలు విడుదల చేయకపోతే సినిమాలు చేయడం కష్టం. ఇష్టారీతిన హీరోలకు పారితోషికాలు ఇస్తున్నారనడం సరికాదు. మార్కెట్‌ ధర ప్రకారమే హీరోలు పారితోషికాలు తీసుకుంటారు. హీరోల పారితోషికాల వల్లే టికెట్‌ ధరలు పెంచారనేది అవాస్తవం. గతంలో సమస్యలొస్తే ఎన్టీఆర్‌, నాగేశ్వరరావు వంటి హీరోలు రాలేదు. సమస్యలుంటే ఫిల్మ్‌ ఛాంబరే పరిష్కరించేది. ప్రస్తుత నిర్మాతల్లో స్థిరత్వం లేదు" అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

సీతారామం మరో గీతాంజలి.. "సీతారామం కథ చెప్పినప్పుడు నచ్చింది. స్వప్నతో ముందుకు వెళ్లొచ్చు అని చెప్పా. కెమెరాతో మ్యాజిక్‌ చేశారు. ప్రతి షాట్‌ అబ్బా అనిపిస్తుంది. హనులో ఓ వీక్‌నెస్‌ ఉంది. తనకు తెలియకుండానే సీన్‌ను లాగుతుంటాడు. నాకు సంగీతంపై పరిజ్ఞానం దేవుడిచ్చిన వరం. ట్యూన్‌ అనగానే పసిగడతాను. బాగుంటే ఓకే.. లేకపోతే అక్కడే ఆపేస్తాను. మణిశర్మతో సన్నిహితం ఎక్కువ. హనురాఘవపూడి బాగా కష్టపడ్డారు. మహానటిలో జెమినీ గణేషన్‌ పాత్ర కోసం దుల్కర్‌ సల్మాన్‌ను ఎన్నుకున్నప్పటి నుంచి ఆయనంటే గౌరవం ఏర్పడింది. దుల్కర్‌తో ఏడాదిన్నరకో సినిమా చేద్దామని స్వప్నకు చెప్పా. అనుకోకుండా ఈ సినిమాకు అవకాశం వచ్చింది. ఈ కథకు ఆయనే సరైన హీరో. అలాగే ఈ సినిమా చూసిన తర్వాత ఇంత ఖర్చు పెట్టడం సమంజసమేనని మీరే అంటారు. ఈ సినిమాకు ఖర్చు పెట్టక తప్పదు. ఇది మరోచరిత్ర, గీతాంజలిలాగా ల్యాండ్‌మార్క్‌ సినిమా అవుతుంది" అని అశ్వినీదత్‌ చెప్పుకొచ్చారు

ఇదీ చూడండి: 'ఆ పాయింట్​ బాగా ఆకర్షించింది.. అందుకే 'బింబిసార' కథను ఎంచుకున్నా'

Last Updated : Jul 28, 2022, 7:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.