Prabhas : మోకాలి గాయం కారణంగా చికిత్స కోసం యూరప్ వెళ్లిన రెబల్ స్టార్ ప్రభాస్ తిరిగి హైదరాబాద్‌కు వచ్చేశారు. రెండు నెలల పాటు అక్కడే ఉండి విశ్రాంతి తీసుకున్న ఆయన తాజాగా హైదరాబాద్ విమానాశ్రయంలో కనిపించారు. దీంతో డార్లింగ్ ఫ్యాన్స్ సంబరాల్లో మునిగిపోయారు. డిసెంబర్ 22న 'సలార్' విడుదల కానున్న నేపథ్యంలో ప్రభాస్ త్వరలో ఈ మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొననున్నారని టాక్. అయితే ఈ విషయంపై ఇప్పటివరకు ఎటువంటి అప్డేట్ రాలేదు.
-
The LION is Back To His DEN!!
— Prabhas Trends (@TrendsPrabhas) November 8, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Get Ready to Witness the Biggest Comeback of the one and only King, as the Advance Bookings Of Rebel Star #Prabhas's #Salaar have Started To Open in a Few Locations In USA 🔥👑🌟 pic.twitter.com/2UoMph1boY
">The LION is Back To His DEN!!
— Prabhas Trends (@TrendsPrabhas) November 8, 2023
Get Ready to Witness the Biggest Comeback of the one and only King, as the Advance Bookings Of Rebel Star #Prabhas's #Salaar have Started To Open in a Few Locations In USA 🔥👑🌟 pic.twitter.com/2UoMph1boYThe LION is Back To His DEN!!
— Prabhas Trends (@TrendsPrabhas) November 8, 2023
Get Ready to Witness the Biggest Comeback of the one and only King, as the Advance Bookings Of Rebel Star #Prabhas's #Salaar have Started To Open in a Few Locations In USA 🔥👑🌟 pic.twitter.com/2UoMph1boY
ఇక అక్టోబర్ 23న ప్రభాస్ బర్త్‌డే సందర్భంగా ఏదైనా అప్డేట్ రిలీజ్ చేస్తారనుకుంటే.. అటువంటివేమీ జరగలేదు. దీంతో ఫ్యాన్స్ కాస్త డీలా పడ్డారు. అయినప్పటికీ రిలీజ్ డేట్ చేరువలో ఉండటం వల్ల ఫ్యాన్స్ మూవీ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇక ఇప్పుడు డార్లింగ్ కూడా హైదరాబాద్‌కు వచ్చేయడం వల్ల సలార్ స్పెషల్ పోస్టర్, ట్రైలర్ ఇలా మరిన్ని అప్డేట్స్ వస్తాయేమోనని వెయిట్ చేస్తున్నారు అభిమానులు.
మరోవైపు 'సలార్' ట్రైలర్ కూడా రిలీజ్ అవ్వకముందే దీనికి సంబంధించిన ఓటీటీ హక్కులను దక్కించుకుంది ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్. ఏకంగా రూ.160 కోట్లకు ఈ రైట్స్‌ను సొంతం చేసుకుంది. మూవీ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్.. ఇటీవలే నెట్‌ఫ్లిక్స్‌తో దీనికి సంబంధించిన భారీ డీల్‌ను కూడా కుదుర్చుకున్నట్లు సమాచారం. అయితే ఈ విషయంపై మేకర్స్ నుంచి మాత్రం ఎటువంటి వివరణ లేదు.
సలార్Xడంకీ 'ఢీ'!
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ నటించిన 'డంకీ' కూడా డిసెంబర్ 22నే విడుదల కానుంది. మాస్మహారాజా రవితేజ 'ఈగల్' కూడా ఈ టైమ్‌లోనే విడుదలవుతుందన్న వార్తలు కూడా వైరల్ అవుతున్నాయి. వాస్తవానికి 'సలార్'ను ముందుగా సెప్టెంబర్ 28నే విడుదల చేయాలని భావించినప్పటికీ.. పలు కారణాలతో డిసెంబర్ 22కి వాయిదా వేశారు నిర్మాతలు. ఇక ఆ రోజు కూడా పలువురు పెద్ద హీరోలు కూడా రిలీజ్‌కు సిద్ధంగా ఉండటం వల్ల సలార్‌కు గట్టి పోటీనివ్వడం మాత్రం ఖాయంగా కనిపిస్తోందని అంటున్నారు సినీ విశ్లేషకులు. ఇక సలార్‌కు సంబంధించి ట్రైలర్ కూడా త్వరలోనే రాబోతోందని సమాచారం.
కళ్లు చెదిరే ధరకు అమ్ముడుపోయిన 'సలార్' ఓటీటీ రైట్స్- ఎన్ని కోట్లు అంటే?
'సినిమాలో నా పాత్ర ఓ సర్ప్రైజ్- కార్తితో నా ట్రాక్ అదుర్స్, 'జపాన్' కోసం ఫుల్ వెయిటింగ్'!