ETV Bharat / entertainment

'సలార్'​ షూటింగ్​లో ప్రభాస్ పిక్స్ లీక్.. కంగారులో యూనిట్​! - prabhas new movie

'సలార్'​ సినిమాకు సంబంధించిన ఓ వార్త సోషల్​ మీడియాలో చక్కర్లు కొడుతోంది. షూటింగ్​లో ప్రభాస్​ పిక్స్​ లీక్​ అయినట్లు కొన్ని ఫొటోలు వైరల్​ అవుతున్నాయి.

salaar
సలార్
author img

By

Published : May 24, 2022, 12:30 PM IST

కేజీఎఫ్​ డైరెక్టర్​ ప్రశాంత్​ నీల్​- రెబల్​స్టార్​ ప్రభాస్​ కాంబినేషన్​లో వస్తున్న 'సలార్'​ సినిమా కోసం దేశవ్యాప్తంగా ఉన్న 'డార్లింగ్' అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమాను ప్రకటించి.. చాలా కాలం అయినా.. ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్​ రాలేదు. అయితే తాజాగా సినిమా రెండో షెడ్యూల్​ షూటింగ్​ ప్రారంభమైంది. అయితే షూటింగ్​ మొదలైన తొలిరోజు ప్రభాస్​ సెట్​లోకి అడుగ పెట్టగా.. ఆ పిక్స్​ లీక్​ అయ్యాయి.

ప్రభాస్ ఓ అమ్మాయితో మాట్లాడుతున్న ఫొటో, కుర్చీలో కూర్చున్న ఫొటో, సెట్ కు సంబంధించిన మరో ఫొటో లీక్ అయ్యాయి. దీంతో చిత్ర యూనిట్​ కంగారు పడుతున్నట్లు సమాచారం. అయితే ఇది ఎవరి పని అనే దానిపై యూనిట్​ సభ్యులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో శృతి హాసన్, జగపతి బాబు, పృథ్విరాజ్ సుకుమారన్, ఈశ్వరీరావు తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. 'కేజీఎఫ్'ను నిర్మించిన హంబాలే ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని కూడా నిర్మిస్తోంది.

ఇదీ చదవండి: దీపిక అస్సలు తగ్గట్లేదుగా.. కేన్స్​లో మరోసారి గ్లామర్​ షో

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.