ETV Bharat / entertainment

ఆ సెంటిమెంట్ డేట్​కే ప్రభాస్ 'కల్కి' - చిరు సినిమా రోజే థియేటర్లలోకి - నాగ్ అశ్విన్ కల్కి

Prabhas Kalki 2898 Ad Release Date : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ 'కల్కి' సినిమా రిలీజ్ డేట్ ఖరారు చేసుకున్నట్లు తెలిసింది. ఆ వివరాలు.

ఆ సెంటిమెంట్ డేట్​కే ప్రభాస్ 'కల్కి' - చిరు సినిమా రోజే థియేటర్లలోకి

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 9, 2024, 1:06 PM IST

Prabhas Kalki 2898 Ad Release Date : భారతీయ చిత్రసీమలో అత్యంత ఖరీదైన పాన్​ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న చిత్రం 'కల్కి ఏడి 2898'. అయితే ఈ సినిమా విడుదల తేదీని ఖరారు చేసుకున్నట్టు తెలిసింది. అధికారికంగా ఇంకా ప్రకటించలేదు కానీ మే 9న మొదటి భాగాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్ణయించుకున్నారట. ఈ దిశగా నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ ప్లాన్​ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో బజ్ క్రియేట్ అవుతోంది. ఈ విడుదల తేదీని సంక్రాంతిని పురస్కరించుకొని జనవరి 12న ప్రకటిస్తారనే చర్చ నడుస్తోంది.

అయితే ఆ రోజే ఎందుకు? ప్రత్యేకత ఏమిటి? అంటే - ఈ డేట్ వెనుక వైజయంతి మూవీస్​కు ఓ సెంటిమెంట్ దాగి ఉంది. 1990లో ఇదే డేట్​కు వైజయంతి నిర్మాణ సంస్థలో చిరంజీవి, శ్రీదేవి జంటగా 'జగదేకవీరుడు అతిలోకసుందరి' రిలీజై ఒక ల్యాండ్ మార్క్ మూవీగా చరిత్రలో నిలిచిపోయింది. చిరంజీవి కెరీర్ బెస్ట్ టాప్ 5 మూవీస్​లో ఈ చిత్రానికి ప్రత్యేక స్థానం ఉంది.

మే 9కి - 'కల్కి' సినిమాకు మరొక అనుబంధం కూడా ఉంది. కల్కి దర్శకుడు నాగ్ అశ్విన్ గతంలో దర్శకత్వం వహించిన సావిత్రి బయోపిక్ 'మహానటి' కూడా అదే రోజు రిలీజ్ అయింది. దీనిని వైజయంతి మూవీస్ సమర్పణలో స్వప్న మూవీస్​ బ్యానర్​పై అశ్వినీదత్ కుమార్తెలు స్వప్నదత్, ప్రియాంక దత్ నిర్మించారు. అలా దర్శక, నిర్మాతలకు బాగా కలిసి వచ్చిన రోజుమే 9నే 'కల్కి'ని కూడా విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది.

'మహానటి' తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న చిత్రమే 'కల్కి 2989 ఏడీ'. ఈ చిత్రాన్ని దాదాపు రూ. 400 కోట్ల బడ్జెట్​తో నిర్మిస్తున్నట్లు తెలిసింది. సినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకోణె కథానాయికగా నటిస్తున్నారు. ఇండియన్ సినిమా లెజెండరీ హీరోలు బిగ్ బీ అమితాబ్ బచ్చన్, లోక నాయకుడు కమల్ హాసన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కమల్ హాసన్ విలన్ రోల్ చేస్తున్నారని సమాచారం.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.