ETV Bharat / entertainment

Prabhas Birthday Celebrations : రెబల్​​స్టార్ బర్త్​డే సెలబ్రేషన్స్ షూరూ.. దేశంలోనే అతిపెద్ద కటౌట్​! - ప్రభాస్ కటౌట్ ఏర్పాటు

Prabhas Birthday Celebrations : రెబల్ ​స్టార్ ప్రభాస్ అక్టోబర్ 23న.. 44వ పుట్టినరోజు జరుపుకోనున్నారు. ఈ క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయన బర్త్​డే సెలబ్రెషన్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. సోమవారం ఆయన పుట్టినరోజు సందర్భంగా అభిమానులు దేశంలోనే అతిపెద్ద కటౌట్ ఏర్పాటు చేయనున్నారు. మరి అది ఎక్కడంటే?

Prabhas Birthday Celebrations
Prabhas Birthday Celebrations
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 22, 2023, 3:49 PM IST

Updated : Oct 22, 2023, 4:11 PM IST

Prabhas Birthday Celebrations : రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సలార్', 'కల్కి' సినిమా షూటింగుల్లో బిజీగా గడుపుతున్నారు. 'బాహుబలి' సినిమా తర్వాత ప్రభాస్ పాన్ ఇండియా స్టార్​గా ఎదిగిపోయిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు భారత్​లోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో క్రేజ్ వచ్చింది. దీంతో ఆయనకు ఫ్యాన్​ ఫాలోయింగ్​ సైతం విపరీతంగా పెరిగింది. ఇక అక్టోబర్ 23 సోమవారం ప్రభాస్ తన 44 పుట్టినరోజును జరుపుకోనున్నారు. ఈ క్రమంలో జపాన్​లో ఉన్న ఆయన ఫ్యాన్స్.. బర్త్​డే సెలబ్రేషన్స్​ను గ్రాండ్​గా నిర్వహించేందుకు ప్లాన్​​ చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు వీడియోలు కూడా నెట్టింట తెగ వైరల్​ అవుతున్నాయి.

మరోవైపు రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభాస్ బర్త్​డే సంబరాలు ఘనంగా జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో హైదరాబాద్​లోని ప్రభాస్ ఫ్యాన్స్.. ఈ పుట్టినరోజును మరింత స్పెషల్​గా చేయనున్నారు. నగరంలోని కూకట్​పల్లి ఏరియాలో ప్రభాస్ పుట్టినరోజును పురస్కరించుకొని.. అభిమానులు ఓ భారీ కటౌట్ ఏర్పాటు చేయనున్నారు. ఇది దేశంలో అతిపెద్ద కటౌట్​గా నిర్మాణం కానున్నట్లు తెలుస్తోంది. సమయం తక్కువగా ఉండటం వల్ల.. కటౌట్​కు సంబంధించిన పనులు చకచకా జరుగుతున్నాయి. కటౌట్ నిర్మాణ పనుల ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్​గా మారాయి. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు.

ఓపెనింగ్ ఎప్పుడంటే.. అక్టోబర్ 23 సోమవారం ఉదయానికి కటౌట్ పనులు పూర్తి చేసి ఆవిష్కరణకు సిద్ధం చేయనున్నారు. ఉదయం 11 గంటలకు కటౌట్ ఆవిష్కరణ ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రభాస్ ఫ్యాన్స్​ హాజరుకానున్నారని సమాచారం.

సలార్ అప్​డేట్..
Salaar Trailer.. రెబర్​ స్టార్ ప్రభాస్ హీరోగా.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'సలార్​'. 'బాహుబలి' సినిమా తర్వాత ఆ రేంజ్​ హిట్​ ప్రభాస్​కు దక్కలేదు. భారీ అంచనాలతో రిలీజైన 'సాహో', 'రాధేశ్యామ్', 'ఆదిపురుష్'.. కలెక్షన్లు వసూల్ చేసినా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేవు. దీంతో డార్లింగ్ అభిమానులు ఈ సినిమాపైనే అంచనాలు పెట్టుకున్నారు. అయితే అక్టోబర్ 23 ప్రభాస్​ పుట్టిన రోజు సందర్భంగా 'సలార్' ట్రైలర్​ను విడుదల చేస్తారని అందరూ అనుకుంటున్నారు. కానీ, మూవీ టీమ్ నుంచి ఇంతవరకు ఎలాంటి అప్​డేట్​ రాలేదు. దీంతో బర్త్​డే గిఫ్ట్​గా ట్రైలర్​ వచ్చే అవకాశాలు తక్కువ అని అభిమానులు అనుకుంటున్నారు. ఇంకొంతమంది బర్త్​డే కు సడెన్​ సర్​ప్రైజ్​ ఏమైనా ఇస్తారేమో అని భావిస్తున్నారు.

Tollywood Movies Latest Updates : మహేశ్​.. రామ్​చరణ్​.. ప్రభాస్.. మాట తప్పారుగా!

Salaar Vs Dunki : 'సలార్​' దెబ్బ.. 'డంకీ' అబ్బా.. షారుక్ కొత్త మూవీ రిలీజ్​ వాయిదా!

Last Updated : Oct 22, 2023, 4:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.