ETV Bharat / entertainment

టాలీవుడ్​ స్టార్స్​కు స్పెషల్ ఇన్విటేషన్- రామమందిరం ఓపెనింగ్​కు ప్రభాస్, చిరు - శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ఆహ్వానాలు

Prabhas Ayodhya Ram Mandir : అయోధ్య శ్రీ రామ మందిరం ప్రారంభోత్సవానికి టాలీవుడ్ స్టార్​ ప్రభాస్​కు ఆహ్వానం అందింది. ఇదివరకే మెగాస్టార్ చిరంజీవిని ఆహ్వానించిన ఆలయ ట్రస్టు తాజాగా ప్రభాస్​కు ఆహ్వానం పంపింది.

Prabhas Ayodhya Ram Mandir
Prabhas Ayodhya Ram Mandir
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 26, 2023, 11:08 AM IST

Updated : Dec 26, 2023, 11:32 AM IST

Prabhas Ayodhya Ram Mandir : అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవానికి సమయం దగ్గరపడుతోంది. 2024 జనవరి 22న ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా ఆలయం ప్రారంభం కానుంది. ఈ క్రమంలో ఆలయ ట్రస్టుతోపాటు అధికారులు కూడా పనులన్నీ చకచకా పూర్తి చేస్తున్నారు. ఈ శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు దేశంలోని పలువురు పండితులకు, సెలబ్రెటీలకు ఇప్పటికే అహ్వానం పంపింది. ఈ నేపథ్యంలో సినీ ఇండస్ట్రీకి సంబంధించిన పలువురు ప్రముఖులకు కూడా ఆహ్వానం అందింది.

బాలీవుడ్ బిగ్​బి అమితాబ్ బచ్చన్, మాధురి దీక్షిత్, అనుపమ్ ఖేర్, అక్షయ్ కుమార్, సూపర్​స్టార్ రజనీకాంత్, మెగాస్టార్ చిరంజీవి, సంజయ్​లీలా బన్సాలీ, మోహన్ లాల్, ధనుష్, రిషభ్ శెట్టికి ఇప్పటికే రామమందిరం ప్రారంభోత్సవానికి ఆహ్వానం అందింది. ఇక తాజాగా మరికొంత మంది సినీ నటులను ట్రస్టు ఆహ్వానించింది. ఈ లిస్ట్​లో బాలీవుడ్ నుంచి రణ్​బీర్ కపూర్, ఆలియా భట్, అజయ్ దేవ్​గణ్, సన్నీ దేవోల్, టైగర్ జాకీష్రాఫ్, ఆయుష్మాన్ ఖురానా, టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్, కేజీఎఫ్ ఫేమ్ యశ్​ ఉన్నారు.

Ayodhya Invitation to Cricketers : సినీ నటులే కాకుండా క్రికెటర్లను కూడా ట్రస్టు ఆహ్వానించింది. క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్, టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి ఆహ్వానం అందింది. వీరితోపాటు ప్రముఖ టీవీ సీరియల్​ రామాయణంలో సీతారాముల పాత్రలు పోషించిన అరుణ్​ గోవిల్​, దీపికా చిక్లియా, పారిశ్రామికవేత్తలు ముకేశ్​ అంబానీ, గౌతమ్ అదానీ, రతన్ టాటా సహా దేశంలోని న్యాయమూర్తులు, శాస్త్రవేత్తలు, రచయితలు, కవులకు కూడా ఆహ్వానాలు పంపామని ట్రస్టు నిర్వాహకులు తెలిపారు.

వీరితో పాటు సాధువులు, పూజారులు, మతపెద్దలు, మాజీ సివిల్ సర్వెంట్లు, రిటైర్డ్ ఆర్మీ అధికారులు, న్యాయవాదులు, సంగీత విద్వాంసులు, వివిధ దేశాల్లో ఉన్న హిందూ కుటుంబాలకు, పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డు గ్రహీతలకు ఇప్పటికే ఆహ్వానం పంపినట్లు ట్రస్టు నిర్వాహకులు వెల్లడించారు. దాదాపు 15వేల మంది బస చేసేందుకు టెంట్ సిటీ ఏర్పాటు చేస్తున్నారు.

'సలార్'​కు ఓకే చెప్పింది అందుకే!- పార్ట్ 2 వేరే లెవల్​ : ప్రభాస్

అయోధ్య రామాలయానికి హైదరాబాద్ తలుపులు

Last Updated : Dec 26, 2023, 11:32 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.