ప్రముఖ నటుడు ప్రభాస్ దిల్లీలోని లవ్కుష్ రామ్‌లీల కమిటీ అధ్వర్యంలో జరుగుతున్న దసరా వేడుకలకు హారయ్యారు. బాణంతో రావణ దహనం చేశారు. తనను చూడటానికి వచ్చిన వేలాది ప్రజలకు అభివాదం చేశారు. అనంతరం గద చేతబూని అభిమానులకు చూపించారు. ప్రభాస్‌తో పాటు 'ఆదిపురుష్' దర్శకుడు ఓంరౌత్ కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. అయితే భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సైతం రావాల్సి ఉండగా.. పలు అనివార్య కారణాలతో హాజరు కాలేకపోయారు. అంతకుముందు దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చేతుల మీదుగా రావణ దహనం కార్యక్రమం జరిగింది.
లవ్కుష్ రామ్‌లీల కమిటీ అధ్వర్యంలో జరుగుతున్న వేడుకలకు భారీగా ప్రజలు తరలి వచ్చారు. నటుడు ప్రభాస్ వస్తున్నారన్ని సమాచారంతో ఈ మైదానానికి అభిమానులు పోటెత్తారు. లేడీ ఫ్యాన్స్ ప్రభాస్‌కు పూలమాల వేసి సత్కరించారు. దాదాపు 5 లక్షల పాస్‌ల దాకా ముద్రించామని.. అవి చాలకుంటే అందుబాటులో ఉండేలా మరో రెండు లక్షల పాస్‌లు సిద్ధంగా ఉంచామని రామ్‌లీలా కమిటీ అధ్యక్షుడు గురువారం పేర్కొన్నారు.
ఇవీ చదవండి: చిరంజీవి ఫ్యామిలీతో 'గొడవల'పై అల్లు అరవింద్ క్లారిటీ!
నటి శ్రీలీల తల్లిపై పోలీస్ కేసు నమోదు.. ఫిర్యాదు చేసింది ఆయనే