Aaron Carter Passes Away: దక్షిణ కాలిఫోర్నియా సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ సింగర్, ర్యాపర్ ఆరోన్ కార్టర్(34) ఆదివారం మృతి చెందారు. అయితే ఆయన మృతదేహం బాత్ టబ్‌లో అనుమానాస్పద స్థితిలో లభ్యమైంది. ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు, ఫ్యాన్స్ సంతాపం తెలుపుతున్నారు.
అతి చిన్న వయస్సులో ఆరోన్ ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. 1997 సంవత్సరంలో 'బ్యాక్ స్ట్రీట్ బాయ్స్'తో ఆయన కెరీర్‌ను స్టార్ట్ చేశారు. అదే సంవత్సరం గోల్డ్- సెల్లింగ్ సెల్ఫ్ టైటిల్డ్ ఆల్బమ్‌ను రిలీజ్ చేశారు. 2000 సంవత్సరంలో ఆరోన్స్ పార్టీ (కమ్ గెట్ ఇట్) అనే టైటిల్ సాంగ్‌తో ట్రిపుల్-ప్లాటినమ్ అందుకున్నారు. వీటితో పాటు 'ఐ వాంట్ కాండీతో' సహా ఎన్నో హిట్ సాంగ్స్ అందించారు.
పాటలతో పాటు కొన్ని సినిమాల్లో కూడా ఆయన నటించి ప్రేక్షకులను అలరించారు. అందరి మనసుల్లో చోటు సంపాదించుకున్నారు. అంతటి ఘనత పొందిన కార్టర్ మరణాన్ని సినీ పరిశ్రమ జీర్ణించుకోలేకపోతోంది. అయితే ఆయన మృతికి కారణాలేంటో ఇప్పటిదాకా తెలియరాలేదు.
ఇవీ చదవండి:ప్రభాస్ 'సాహో' యాక్షన్ సీన్‌పై నెట్‌ఫ్లిక్స్ సెటైర్.. డార్లింగ్ ఫ్యాన్స్ ఫుల్ ఫైర్
కత్రిన రేంజ్ మాములుగా లేదుగా.. ఒక్కో ఇన్‌స్టా పోస్ట్‌కు అంత రెమ్యునరేషనా ?