ETV Bharat / entertainment

ఆడిషన్స్​కు నన్ను పిలవండి అంటూ పాయల్​ రిక్వెస్ట్!​- ఇంత క్యూట్​గా అడిగితే ఎవరైనా కాదంటారా?​

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 12, 2023, 2:30 PM IST

Updated : Dec 12, 2023, 5:20 PM IST

Payal Rajput Latest Tweet : 'మంగళవారం' సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్న నటి పాయల్​ రాజ్​పుత్​ తాజాగా సోషల్ మీడియా వేదికగా ఓ ట్వీట్​ చేసింది. అందులో ఆమే ఓ సినిమాలో నటించేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్లు చెప్పుకొచ్చింది. ఇంతకీ ఆ సినిమా ఏదంటే ?

Payal Rajput Latest Tweet
Payal Rajput Latest Tweet

Payal Rajput Latest Tweet : టాలీవుడ్ నటి పాయల్ రాజ్​పుత్ ఇటీవల 'మంగళవారం' సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. మిస్టరీ థ్రిల్లర్​గా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్​ వద్ద మంచి టాక్ అందుకుంది. దీంతో పాయల్​ క్రేజ్ కూడా ఇంతకింత పెరిగింది. ఈ చిత్రంలో తన నటనను చూసిన అభిమానులు తన అప్​కమింగ్ మూవీ అప్​డేట్​ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఈ తార సోషల్ మీడియా వేదికగా ఓ ట్వీట్​ రాసుకొచ్చింది. అందులో తనను ఓ సినిమా ఆడిషన్స్​కు పిలవమని ఆమె కోరింది.

కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి రూపొందిస్తున్న 'కాంతార' ప్రీక్వెల్​ కోసం మూవీ టీమ్​ తాజాగా సామాజిక మాధ్యమాల వేదికగా ఓ ప్రకటనను వెలువరించింది. అందులో భాగంగా ఈ ప్రీక్వెల్​లో నటించేందుకు నటులు కావాలంటూ ఓ పోస్ట్​ను షేర్ చేసింది. దీన్ని చూసిన అభిమానులు ఎంతో మంది కామెంట్ల రూపంలో తమ ఆసక్తిని కనబరిచారు. అయితే నటి పాయల్​ కూడా ఈ ట్వీట్​కు రిప్లై ఇచ్చింది. "ఈ అత్యద్భుతమైన చిత్రంలో భాగం కావాలని నేను కోరుకుంటున్నాను. దయచేసి నన్ను ఆడిషన్ కోసం పరిగణలోకి తీసుకోండి. ఈ ప్రాజెక్ట్‌ కోసం ఆడిషన్‌ ఇవ్వడానికి ఏం చేయాలో దయచేసి చెప్పండి. నా పేరు రీపోస్ట్‌ చేస్తూ సహకరించిన అభిమానులకు నా ధన్యవాదాలు".అంటూ ఆమె ట్వీట్​ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్​ నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. అభిమానులు సైతం తనను ఈ సినిమాలో తీసుకోవాలంటూ హొంబాలే నిర్మాణ సంస్థకు మెసేజ్​లు పెడుతున్నారు.

Payal Rajput Upcoming Movies : ప్రస్తుతం పాయల్‌ రాజ్‌పుత్‌ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. 'గోల్‌మాల్‌', 'ఏంజెల్‌', 'కిరాతక' సినిమాల్లో ఆమె నటిస్తోంది. మరోవైపు అజయ్‌ భూపతి తెరకెక్కించిన మిస్టీరియస్‌ థ్రిల్లర్‌ 'మంగళవారం' మూవీ త్వరలోనే ఓటీటీలో స్ట్రీమ్ అయ్యేందుకు రెడీ అవుతోంది. ఇప్పటికే ఈ మూవీ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ+హాట్‌స్టార్‌ దక్కించుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఈ చిత్రాన్ని డిసెంబరు చివరి వారంలో స్ట్రీమింగ్‌ తీసుకురానున్నట్లు తెలుస్తోంది.

'కాంతార చాప్టర్ 1' టీజర్ ఔట్ - ప్రీక్వెల్​తో బాక్సాఫీస్ రికార్డులు బద్దలు!

పాయల్​ రాజ్​పుత్ పాన్ ఇండియా థ్రిల్లర్​ -​ 'మంగళవారం' మూవీ ఎలా ఉందంటే ?

Last Updated : Dec 12, 2023, 5:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.