ETV Bharat / entertainment

పవన్ కళ్యాణ్‏ ఫేవరెట్​ హీరోలు ఎవరో తెలుసా? - Pawan kalyan varahi yatra

Pawankalyan favourite hero : టాలివుడ్ పవర్​ స్టార్ పవన్​ కల్యాణ్ తనకిష్టమైన ఫేవరెట్ హీరోలు ఎవరో చెప్పారు. ఆ వివరాలు..

Pawankalyan heroes
పవన్ కళ్యాణ్‏ ఫేవరెట్​ హీరోలు ఎవరో తెలుసా?
author img

By

Published : Jun 17, 2023, 9:23 PM IST

Updated : Jun 17, 2023, 9:48 PM IST

Pawankalyan favourite hero : టాలివుడ్ పవర్​ స్టార్ పవన్​ కల్యాణ్.. ​ ఈ పేరుకు ఉండే క్రేజే వేరు. ఆయన తెరపై కనిపిస్తే చాలు బాక్సాఫీస్​ ముందు రికార్డులు వరుస కడతాయి. ఫ్యాన్స్​ ఈలలు, గోలలతో థియేటర్లు దద్దరిల్లుతాయి. మరి ఇంతటి భారీ స్థాయిలో క్రేజ్​ను సంపాదించున్న పవన్​కు.. తన తోటి హీరోల్లో ఏ కథానాయకుడు అంటే ఇష్టమో తెలుసా? ఆ విషయాన్ని ఆయనే చెప్పారు.

ప్రస్తుతం పవర్​ స్టార్​ ఓ వైపు రాజకీయాలతో మరోవైపు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటున్నారు. సినిమా షూటింగ్​లలో పాల్గొంటూనే.. రాజకీయ ప్రచార సభల్లోనూ పాల్గొంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ ప్రచార సభలో పవన్​ తనకిష్టమైన హీరోలు ఎవరో చెప్పుకొచ్చారు. తన వారాహి యాత్రలో భాగంగా యువతను, సినీ స్టార్స్​ను ఉద్దేశించి ప్రసంగిస్తూ చెప్పారు.

Pawan kalyan varahi yatra : ఈ యాత్రలో భాగంగా మాట్లాడుతూ.. "సినిమాలు వేరు.. రాజకీయం వేరు. మీరందరూ ఏ హీరోనైనా ఇష్టపడండి. కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం అంతా ఒక్కచోటికి చేరాలి. నా తోటి నటులంటే నాకెంతో గౌరవం. వారి సినిమాలు చూస్తాను. నాకు రామ్​చరణ్​, ఎన్టీఆర్, ప్రభాస్, చిరంజీవి అంటే చాలా ఇష్టం. ఎంతో గౌరవం" అని అన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్​మీడియాలో వైరల్ అవ్వడం ప్రారంభమైంది. ఇది చూసిన నెటిజన్లు దాన్ని ట్రెండ్ చేస్తూ లైక్స్​, కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.

Pawankalyan Upcoming movies : ప్రస్తుతం పవన్ కల్యాణ్​ చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. వీటిలో ఇప్పటికే సముద్రఖని దర్శకత్వంలోని 'బ్రో' సినిమా షూటింగ్ పూర్తైంది. మల్టీస్టారర్​గా రూపొందుతున్న ఈ చిత్రంలో మెగా హీరో సాయితేజ్​తో​ కలిసి నటించారు పవన్​. ఇకపోతే హరీశ్ శంకర్ దర్శకత్వంలో 'ఉస్తాద్​ భగత్ సింగ్​' సినిమా చేస్తున్నారు. ఇందులో పోలీస్​ ఆఫీసర్​గా కనిపించనున్నారు. క్రిష్ డైరెక్షన్​లో 'హరిహర వీరమల్లు' సినిమా చాలా కాలం నుంచి షూటింగ్ జరుపుకుంటున్నా ఎటువంటి అప్డేట్స్​ లేవు. సాహో ఫేం సుజీత్​ దర్శకత్వంలో 'ఓజీ' సినిమా చేస్తున్నారు. భారీ యాక్షన్ ఎంటర్​టైనర్​గా గ్యాంగ్​ స్టర్​ నేపథ్యంలో రూపొందుతోందీ చిత్రం. త్వరలోనే ఈ చిత్రాలన్నీ రిలీజ్​ కానున్నాయి. వీటి కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇదీ చూడండి :

పవన్ కల్యాణ్​ 'OG'.. 70 ఏళ్లు వెనక్కి!

Pawan Kalyan OG : పవన్​ కల్యాణ్​ 'ఓజీ'లో పవర్​ఫుల్​ లేడీ.. ఓకే చెప్పిన 'పొగరు' బ్యూటీ

Last Updated : Jun 17, 2023, 9:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.