ETV Bharat / entertainment

పవన్​ కల్యాణ్​ కొత్త లుక్​.. అధ్యాపకుడిగా తొలిసారి - pawan kalyan LATest movie

పవర్​స్టార్​ పవన్‌ కల్యాణ్‌ కొత్త పాత్రలో కనిపించబోతున్నారు. హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో 'భవదీయుడు భగత్‌సింగ్‌'ను చేయనున్న పవన్​.. అందులో అధ్యాపకుడి పాత్ర పోషించనున్నారు.

Pawan Kalyan
పవన్​కల్యాణ్​
author img

By

Published : May 23, 2022, 6:28 AM IST

Updated : May 23, 2022, 12:48 PM IST

పవన్‌ కల్యాణ్‌ ప్రస్తుతం 'హరి హర వీరమల్లు' సినిమాతో బిజీగా ఉన్నారు. అలాగే హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో 'భవదీయుడు భగత్‌సింగ్‌'ను పూర్తి చేయాల్సి ఉంది. 'గబ్బర్‌ సింగ్‌' వంటి హిట్‌ తర్వాత పవన్‌ - హరీష్‌ కలయికలో రూపొందుతోన్న రెండో చిత్రమిది. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. పూజా హెగ్డే కథానాయిక. ఇప్పటికే అధికారికంగా ప్రకటించిన ఈ సినిమా.. ఆగస్ట్‌ నుంచి రెగ్యులర్‌ చిత్రీకరణ ప్రారంభించుకోనుంది. ఈ విషయాన్ని దర్శకుడు హరీష్‌ శంకర్‌ ఓ జాతీయ మీడియాతో పంచుకున్నారు. ''ఇది సూపర్‌ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా ఉండనుంది. పూర్తిగా కాలేజీ బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుంది. పవన్‌ కల్యాణ్‌ తొలిసారి లెక్చరర్‌ పాత్రలో సందడి చేయనున్నారు. ఆయన చాలా అందమైన లుక్‌లో కనిపిస్తారు. ఆగస్ట్‌ నుంచి హైదరాబాద్‌లో చిత్రీకరణ ప్రారంభమవుతుంది. 80శాతం షూటింగ్‌ ఇక్కడే కొనసాగుతుంది. దీన్ని పాన్‌ ఇండియా స్థాయికి తీసుకెళ్లే ఆలోచన లేదు'' అని హరీష్‌ ఆ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

శర్వా.. కొత్త కబురు: ఇటీవలే 'ఆడవాళ్లు మీకు జోహార్లు' చిత్రంతో ప్రేక్షకుల్ని పలకరించారు శర్వానంద్‌. దీని తర్వాత ఆయన మరో కొత్త కబురేదీ వినిపించలేదు. అయితే, ఇప్పుడాయన ఓ కొత్త చిత్రానికి పచ్చజెండా ఊపినట్లు సమాచారం. దర్శకుడు కృష్ణచైతన్య చెప్పిన కథకు ఆయన ఓకే చెప్పారని తెలిసింది. ఈ ప్రాజెక్ట్‌ను పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ నిర్మించేందుకు సిద్ధమైంది. చైతన్య మార్క్‌ విభిన్నమైన కథాంశంతో ఈ చిత్రం రూపొందుతుందని, శర్వా నుంచి ప్రేక్షకులు కోరుకునే అన్ని అంశాలు దీంట్లో పుష్కలంగా ఉంటాయని తెలిసింది. ఇది జూన్‌లో లాంఛనంగా ప్రారంభం కానుంది. జులై నుంచి రెగ్యులర్‌ చిత్రీకరణ మొదలు పెట్టనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం శర్వానంద్‌ నటించిన 'ఒకే ఒక జీవితం' విడుదలకు సిద్ధమవుతోంది.

sharavanand
శర్వానంద్‌

ఇదీ చదవండి: బ్లాక్​డ్రెస్​లో బేబీ బంప్​తో సోనమ్ కపూర్​​.. ఫొటోలు వైరల్​

Last Updated : May 23, 2022, 12:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.