Pawan Kalyan OG Movie : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో ఫుల్ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. అయితే పవన్ చేతిలో ప్రస్తుతం రెండు మూడు చిత్రాలు కూడా ఉన్నాయి. అందులో సాహో ఫేమ్ సుజీత్ తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం 'ఓజీ'(OG Movie) కూడా ఒకటి. మాఫియా నేపథ్యంలో గ్యాంగ్ స్టర్ డ్రామాగా రూపుదిద్దుకుంటోంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. ముంబయిలో ఎక్కువ భాగం చిత్రీకరణ జరుపుకుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి నటుడు వెంకట్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఆయన ఈ ఓజీ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. పవన్ కల్యాణ్ అభిమానులకు ఈ చిత్రం తప్పకుండా నచ్చుతుందని ఆయన అన్నారు.
"ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తున్నాను. హీరోగా ఈ మధ్యే ఓ సినిమా కూడా ప్రారంభమైంది. ఇంకా ఎటువంటి టైటిల్ ఖరారు కాలేదు. పవన్ కల్యాణ్ ఓజీలో కీలక పాత్ర కూడా పోషిస్తున్నాను. అన్నయ్య(చిరంజీవి నటించిన సినిమా) సమయం నుంచే పవన్ కల్యాణ్‌తో పరిచయం ఉంది. దాదాపు 23 ఏళ్ల తర్వాత కలిసి పని చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. పవన్‌కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ చూస్తుంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఆయన అభిమానులకు ఈ చిత్రం ఫుల్ మీల్స్. సుజీత్..టాలెంట్ ఉన్న డైరెక్టర్. ఈ సినిమాలో చాలా మంది యాక్టర్స్ ఉన్నారు. తెలుగు చిత్ర సీమలో ఇదొక ట్రెండ్ సెట్టింగ్ మూవీ" అని వెంకట్ పేర్కొన్నారు.
OG Movie Story : ఇకపోతే జపాన్ - ముంబయి నేపథ్యంలో ఓజీ సినిమా కథ సాగనున్నట్లు తెలుస్తోంది. పవన్ కల్యాణ్ సరసన ప్రియాంకా మోహన్ హీరోయిన్గా నటిస్తోంది. ఇమ్రాన్ హష్మీ, అర్జున్ దాస్, శ్రియా రెడ్డి, ప్రకాశ్ రాజ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై దానయ్య నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం ఈ సినిమాకు సంబంధించి విడుదలైన గ్లింప్స్ కూడా ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
'గుంటూరు కారం' - అరే అచ్చం పవన్ సినిమాకు జరిగినట్టే జరుగుతోందిగా!
సంక్రాంతి సినిమాల బిజినెస్ లెక్కలు - బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎన్ని కోట్లు అంటే?