ETV Bharat / entertainment

'సుందర్'​ కోసం పవర్​స్టార్.. 'మేజర్'​పై 'లైగర్​' కామెంట్ - సుడల్

కొత్త చిత్రాల అప్డేట్లు వచ్చేశాయి. నాని నటించిన 'అంటే సుందరానికీ', అడివి శేష్ 'మేజర్', 'హ్యాపీ బర్త్​డే', 'సుడల్' చిత్రాల విశేషాలు ఇందలో ఉన్నాయి.

ante sundaraniki pre release event
vijay devarakonda
author img

By

Published : Jun 7, 2022, 10:55 PM IST

నేచురల్​ స్టార్​ నాని కోసం పవర్​స్టార్ పవన్​కల్యాణ్​ రంగంలోకి దిగనున్నారు. నాని నటించిన 'అంటే సుందరానికీ' సినిమా ప్రీ రిలీజ్​ ఈవెంట్​కు పవన్​ ప్రత్యేక అతిథిగా హాజరుకానున్నారు. జూన్​ 9న సాయంత్రం 6గంటలకు హైదరాబాద్​లోని శిల్పకళా వేదికలో ఈ వేడుక జరగనుంది.

ante sundaraniki pre release event
.

ఈ సినిమాలో నానికి జోడీగా నజ్రియా నజీమ్‌ నటించింది. జూన్​ 10న ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది. మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై నవీన్‌ యెర్నేని, వై. రవిశంకర్‌లు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు వివేక్‌ ఆత్రేయ దర్శకత్వం వహించారు.

మేజర్​కు లైగర్​ సలామ్: 26/11 ఉగ్రదాడుల్లో పోరాడి ప్రాణాలను అర్పించిన మేజర్​ సందీప్​ ఉన్నికృష్ణన్​ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం 'మేజర్​'. శుక్రవారం విడుదలైన ఈ చిత్రం దేశవ్యాప్తంగా ప్రేక్షకుల మన్నన పొందుతోంది. ఈ క్రమంలోనే సినిమా చూసిన హీరో విజయ్ దేవరకొండ.. మేజర్​ సందీప్​, చిత్రబృందంపై ప్రశంసలు కురిపించారు.

  • #MajorTheFilm
    A film filled with passion, love & sincerity.

    A man to look upto.
    A man we can all learn from.
    A true Idol.

    Definitely watch this one to know about our hero. Congratulations to the entire team!

    And my warmest respect and love to the parents of Major Sandeep! pic.twitter.com/1XWPAaJkbi

    — Vijay Deverakonda (@TheDeverakonda) June 7, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"'మేజర్'.. ప్యాషన్​, ప్రేమ, చిత్తశుద్ధితో చేసిన సినిమా​. సందీప్ ఉన్నికృష్ణన్.. ఆదర్శప్రాయుడు. మనం ఆయన నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. మన హీరో గురించి తెలుసుకోవడానికి ఈ సినిమా కచ్చితంగా చూడాలి. మేజర్ చిత్రబృందానికి శుభాకాంక్షలు. మేజర్ సందీప్​ తల్లిదండ్రులకు నా ప్రేమ, గౌరవం తెలియజేస్తున్నా" అని విజయ్ ట్వీట్ చేశారు.

'హ్యాపీ బర్త్‌డే' టీజర్: ఇంటింటికీ తాగు నీరు, ఉద్యోగం అనే మాటలు అప్పుడప్పుడూ వింటుంటాం. ఇంటింటికీ గన్‌.. దాని వల్ల ఫన్‌ అని ఎప్పుడైనా విన్నారా? ‘గన్‌ బిల్‌’ గురించి మీకు తెలుసా? ఈ ఆసక్తికర ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలియాలంటే 'హ్యాపీ బర్త్‌డే' సినిమా చూడాల్సిందే. లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో 'మత్తు వదలరా' ఫేం రితేశ్‌ రానా తెరకెక్కిస్తున్న పాన్‌ ఇండియా చిత్రమిది. ఈ సినిమాని జులై 15న విడుదలచేయనున్న నేపథ్యంలో చిత్ర బృందం ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ మేరకు మంగళవారం టీజర్‌ను పంచుకుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

30 భాషల్లో 'సుడల్': తమిళంలో 'విక్రమ్​ వేదా' లాంటి బ్లాక్​బస్టర్​​ చిత్రాన్ని తెరకెక్కించిన పుష్కర్​-గాయత్రి కాంబోలో మరో ఆసక్తికర ప్రాజెక్టు తెరకెక్కుతోంది. తెలుగు సహా దాదాపు 30 భాషల్లో 'సుడల్​-ది వోర్టెక్స్​' అనే సిరీస్​ను రూపొందిస్తోంది ఈ దర్శక ద్వయం. ఖాతిర్, ఐశ్వర్యా రాజేశ్​ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్​ సీజన్​ 1.. అమెజాన్ ప్రైమ్​ వేదికగా జూన్ 17న ప్రసారంకానుంది.

ఇదీ చూడండి: సూర్యతో నటించబోయే సినిమాలో.. : కమల్​ హాసన్ క్రేజీ కామెంట్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.