బాలీవుడ్ కింగ్ కాంగ్ షారుక్ ఖాన్ నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ 'పఠాన్'. ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. విడుదలకు ముందు ఎన్నో విమర్శలు వచ్చిన్నప్పటికీ.. రిలీజ్ తర్వాత తొలి రోజు నుంచే అద్భుతమైన టాక్‌తో కలెక్షన్ల సునామీ సృష్టించింది. బాలీవుడ్లో అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా రికార్డు సృష్టించింది. ఇన్ని రోజులు బాహుబలి-2 పేరిట ఉన్న రికార్డును పఠాన్ బద్దలుగొట్టింది. హిందీలోనే కాకుండా ఈ సినిమా తెలుగులోనూ పలు రికార్డులు బ్రేక్ చేసింది.
పఠాన్ సినిమా తెలుగు రాష్ట్రాల్లో (నిజాం/ ఆంధ్ర)లో చరిత్ర క్రియేట్ చేసింది. తెలుగు వర్షన్‌తో సహా రూ.50 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన తొలి మొదటి హిందీ చిత్రంగా నిలిచింది. అవతార్-2 తర్వాత రూ.50 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన రెండో నాన్ సౌత్ సినిమాగా ఘనత సాధించింది. అవతార్-2 సినిమా రూ.70 కోట్లు (నెట్) వసూళ్లు సాధించిగా.. బ్రహ్మాస్త్ర, అవేంజర్స్ ఎండ్‌గేమ్ దాదాపు రూ.35 కోట్లు కెలక్షన్లు రాబట్టాయి. హిందీ సినిమాలకు దక్షిణాదిలో ఎక్కువ కలెక్షన్లు నిజాం సర్య్కూట్ నుంచే వస్తాయి. ఇక, బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నుంచి రాబోతున్న సినిమా 'కిసీ కా భాయ్ కిసీ కా జాన్' ఈద్ పండగ సందర్భంగా విడుదల అవుతోంది. ఈ చిత్రం కూడా నైజాంలో మంచి కలెక్షన్లు రాబట్టే అవకాశం ఉంది.
వారాల వారీగా పఠాన్ కలెక్షన్లు..
- మొదటి వారం - రూ.27 కోట్లు (9 రోజులు)
- రెండో వారం- రూ. 5.99 కోట్లు
- మూడో వారం - రూ. 2.48 కోట్లు
- నాలుగో వారం - రూ. 82 లక్షలు
- ఐదో వారం - రూ. 52 లక్షలు
- ఆరో వారం - రూ. 47 లక్షలు
- ఏడో వారం - 13 లక్షలు
- ఎనిమిదో వారం - 4 లక్షలు
- తొమ్మిదో వారం - దాదాపు రూ. 1 లక్ష
- మొత్తం - రూ. 38.09 కోట్లు
తెలుగు రాష్ట్రాల్లో యాక్షన్ సినిమాలకు మంచి ఆదరణ లభిస్తోంది. అలాంటి చాలా సినిమాలు రూ. 30 కోట్ల (నెట్) పైగా కలెక్షన్లను సాధిస్తున్నాయి. ఇప్పటివరకు నైజా/ఆంధ్ర సర్కిళ్లలో అత్యధిక కలెక్షన్లు సాధించిన పది సినిమా ఇవే.
- పఠాన్ - రూ. 38.09 కోట్లు
- దంగల్ - రూ. 21.12 కోట్లు
- పీకే - రూ. 20.72 కోట్లు
- సుల్తాన్ - రూ. 19.62 కోట్లు
- వార్ - రూ. 19.31 కోట్లు
- పద్మావతి - రూ. 18.38 కోట్లు
- సంజు - రూ. 17.15 కోట్లు
- బజరంగీ భాయిజాన్ - రూ. 19.91 కోట్లు
- టైగర్ జిందా హై - రూ. 16.47 కోట్లు
- ధూమ్ 3 - రూ. 16.43 కోట్లు