దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ మూవీలో ఎంఎం కీరవాణి స్వరపరిచిన నాటు నాటు సాంగ్ ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ కావడమే కాదు.. ఏకంగా ఆస్కార్ అవార్డును కూడా సొంతం చేసుకుంది. ఈ అవార్డును అందుకుంటున్న సమయంలో సంగీత దర్శకుడు కీరవాణి.. తాను కార్పెంటర్స్ పాటలు వింటూ పెరిగానని, ఇప్పుడు ఆస్కార్స్ అందుకొనే స్థాయికి వచ్చానని వెల్లడించారు. ఆ తర్వాత ఆయన ఒక పాట కూడా పాడి వినిపించారు. అయితే, అది ఆయన స్వరపరిచినది కాదు.. కార్పెంటర్స్‌లోని టాప్ ఆఫ్ ది వరల్డ్ అనే ఫేమస్ సాంగ్. దాన్నే ఆయన ఆస్కార్ వేదికపై రీక్రియేట్ చేసి వినిపించారు. అందుకే ఆ పాట వినగానే.. హాలీవుడ్ సెలబ్రిటీలంతా ఎంతో సంతోషంతో కేరింతలు కొట్టారు. కరతాళ ధ్వనులతో కీరవాణిని అభినందించారు.
ఎవరీ కార్పెంటర్స్?
క్యారెన్, రిచర్డ్ కార్పెంటర్ అనే అన్నా చెల్లెళ్లు క్రియేట్ చేసిందే ఈ కార్పెంటర్స్. రిచర్డ్ ఆర్కెస్ట్రా స్కిల్స్‌కు క్యారెన్ వాయిస్ తోడైంది. కొద్దిరోజుల్లోనే వారు తమ పాటలతో శ్రోతలను మంత్రముగ్దులను చేశారు. అవి రేడియోల్లో కూడా ప్రసారం కావడంతో కార్పెంటర్స్‌కు బోలెడంత క్రేజ్ వచ్చింది. కార్పెంటర్స్ నుంచి వచ్చిన పాటల్లో టాప్ ఆఫ్ ది వరల్డ్ ట్యూన్ బాగా ఫేమస్ అయ్యింది. ఆ పాట ఇప్పటికీ అక్కడ ప్రతి ఇంట్లో మార్మోగుతూనే ఉంటుంది. అందుకే, కీరవాణి.. స్పీచ్‌కు బదులుగా ఆ పాటను ఎంపిక చేసుకున్నారు. అక్కడి ప్రజల మనసు దోచుకున్నారు. ఆర్ఆర్ఆర్ ద్వారా రాజమౌళి ఎంతోమంది భారతీయులను గర్వడపడేలా చేశారంటూ కీరవాణి వెల్లడించారు.
-
@mmkeeravaani #NaatuNaatuSong #Oscars #RRRForOscars @RRRMovie pic.twitter.com/VM0iS4V7S5
— BA Raju's Team (@baraju_SuperHit) March 13, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">@mmkeeravaani #NaatuNaatuSong #Oscars #RRRForOscars @RRRMovie pic.twitter.com/VM0iS4V7S5
— BA Raju's Team (@baraju_SuperHit) March 13, 2023@mmkeeravaani #NaatuNaatuSong #Oscars #RRRForOscars @RRRMovie pic.twitter.com/VM0iS4V7S5
— BA Raju's Team (@baraju_SuperHit) March 13, 2023
బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటు నాటుకు అకాడమీ అవార్డ్ అందుకుంది. ఈ ఘనత అందుకున్న తొలి తెలుగు పాటగా, తొలి భారతీయ సినిమా పాటగా నాటు నాటు చరిత్ర సృష్టించింది. మన దేశానికి వచ్చిన తొలి ఆస్కార్ అవార్డు ఇది. ఇప్పటి వరకు భారతీయులు అందుకున్న ఆస్కార్ అవార్డులు అన్నీ హాలీవుడ్ సినిమాలు ద్వారా వచ్చినవే. లెజెండరీ దర్శకుడు సత్యజిత్ రేకు గౌరవ ఆస్కార్ ఇచ్చారు. ఇంతకు ముందు సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించిన జయహో పాటకు ఆస్కార్ వచ్చింది. అయితే అది ఇండియన్ సినిమాలో పాట కాదు. హాలీవుడ్ దర్శకుడు డానీ బోయల్ తెరకెక్కించిన ఇంగ్లీష్ సినిమా స్లమ్ డాగ్ మిలినియర్లోనిది.
ఇవీ చదవండి: