ETV Bharat / entertainment

'NTR 30' ప్రీప్రొడక్షన్ పనులు షురూ.. పవర్​ఫుల్​ క్యారెక్టర్​లో విజయశాంతి! - ఎన్టీఆర్​ 30 నిర్మాణ పనులు

టాలీవుడ్​ స్టార్​ హీరో ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కతోన్న 'NTR 30' సినిమాకు సంబంధించి ఓ అప్డేట్​ నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో తొలి లేడీ సూపర్ స్టార్ విజయశాంతి నటించనున్నారట. మరోవైపు, సినిమా ప్రీప్రొడక్షన్ షురూ చేసినట్లు నిర్మాణ సంస్థ ఆదివారం తెలిపింది.పెట్టింది

ntr30-koratala-siva-begins-pre-production and vijayashanti will act in movie

author img

By

Published : Nov 6, 2022, 7:00 PM IST

NTR 30 Movie: 'ఆర్ఆర్ఆర్' తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పటివరకు కొత్త సినిమాను మొదలుపెట్టలేదు. కొరటాల శివ, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఆయన సినిమాలు చేయనున్నారు. ముందుగా కొరటాల శివ సినిమాను మొదలుపెట్టాల్సివుంది. కానీ ఇప్పటివరకు సినిమా సెట్స్​పైకి వెళ్లలేదు. ఈ ప్రాజెక్ట్ కోసం ఎన్టీఆర్ తన లుక్​ను మార్చుకున్నారు. నెలలు గడుస్తున్నా మూవీ ఇంకా పట్టాలెక్కకపోవడం వల్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొరటాల-ఎన్టీఆర్ సినిమా ఆగిపోయిందని వార్తలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి క్రేజీ అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది. ఈ సినిమా ప్రీప్రొడక్షన్ షురూ చేసినట్లు నిర్మాణ సంస్థ ఓ పోస్ట్ పెట్టింది. ఇందులో దర్శకుడు కొరటాల శివ.. సినిమాటోగ్రాఫర్ రత్నవేలు, ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్​తో కలిసి చర్చిస్తున్నట్లుగా ఉంది. ఈ నెలలోనే ఫార్మల్​గా సినిమాను లాంచ్​ చేసి.. డిసెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ చేయాలని నిర్ణయించుకున్నారట.

ntr30-koratala-siva-begins-pre-production
సినిమాటోగ్రాఫర్ రత్నవేలు, ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్​తో కొరటాల చర్చలు

దర్శకుడు కొరటాల శివ 'ఆచార్య'తో డిజాస్టర్ అందుకున్నారు. అందుకే ఎన్టీఆర్ సినిమా విషయంలో ఎలాంటి తప్పులు జరగకూడదని మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆ కారణంగానే సినిమా ఆలస్యమవుతోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ భామను ఎంపిక చేయాలనుకుంటున్నారు.

విజయశాంతి ఓకే చెబుతారా?
ఈ సినిమాలో పవర్ ఫుల్ మహిళ క్యారెక్టర్ ఒకటి ఉందట. దానికోసం ఒకప్పటి హీరోయిన్, టాలీవుడ్ తొలి లేడీ సూపర్ స్టార్ విజయశాంతిని సంప్రదించినట్లు సమాచారం. ఆమెని కలిసి కొరటాల కథ వినిపించారట. అయితే దీనికి ఆమె ఒప్పుకుందా..? లేదా..? అనే విషయంలో క్లారిటీ రాలేదు.

చాలా ఏళ్లుగా విజయశాంతి ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. 'సరిలేరు నీకెవ్వరు' సినిమాతో రీఎంట్రీ ఇచ్చి భారీ హిట్ అందుకున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ సమయంలో తన పాత్ర నచ్చడం వలనే సినిమా చేశానని.. ఇకపై అలాంటి రోల్ వస్తుందనే నమ్మకం లేదని చెప్పారు. మరి ఆ రేంజ్​లో కొరటాల శివ.. విజయశాంతి కోసం క్యారెక్టర్ రాస్తే మాత్రం ఆమె నటించే అవకాశాలు ఉన్నాయి. మరేం జరుగుతుందో చూడాలి. మరోపక్క ఎన్టీఆర్ కోసం బుచ్చిబాబు చాలా ఎదురుచూస్తున్నారు. మరి ఆయనతో సినిమా ఎప్పుడు మొదలుపెడతారో చూడాలి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.