ETV Bharat / entertainment

తేదీ మార్చుకున్న నితిన్​.. కాజల్​పై నెటిజన్ల ట్రోల్స్​!

author img

By

Published : May 8, 2022, 10:03 PM IST

Kajal Aggarwal gets Trolled: నితిన్ నటిస్తున్న యాక్షన్ ఎంటర్​టైనర్​ 'మాచర్ల నియోజకవర్గం' మరోసారి వాయిదా పడింది. కొత్త తేదీని ప్రకటిస్తూ ఆదివారం ఓ పోస్టర్​ను విడుదల చేశారు మేకర్స్​. ఇక మదర్స్​ డే సందర్భంగా నటి కాజల్ అగర్వాల్ చేసిన ఓ పోస్ట్​ కారణంగా ఆమె నెటిజన్ల నుంచి ట్రోలింగ్​ను ఎదుర్కొంది!

kajal aggarwal
Nithiin

నితిన్‌ హీరోగా తెరకెక్కుతున్న పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రం 'మాచర్ల నియోజకవర్గం' మరోసారి వాయిదా పడింది. ఏప్రిల్‌లోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు దర్శక-నిర్మాతలు సన్నాహాలు చేసినా సాధ్యపడలేదు. అలా జులై 8కి వాయిదా పడింది. తాజాగా మరో కొత్త విడుదల తేదీని ప్రకటించారు. ఆగస్టు 12న ఈ ప్రాజెక్టును రిలీజ్‌ చేస్తున్నట్టు వెల్లడిస్తూ.. 'డేట్‌లోనే ఛేంజ్‌.. కలెక్టర్‌సాబ్‌ యాక్షన్‌లో కాదు' అంటూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టారు. ఈ మేరకు నితిన్‌ కొత్త లుక్‌ను విడుదల చేశారు.

Nithiin
'మాచర్ల నియోజకవర్గం'
catherine tresa
కేథరిన్‌

ఎమ్‌.ఎస్‌. రాజశేఖర్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నితిన్‌.. కలెక్టర్‌ సిద్ధార్థ్‌ రెడ్డిగా కనిపించనున్నాడు. కృతిశెట్టి, కేథరిన్‌ కథానాయికలు. సుధాకర్‌ రెడ్డి, నిఖితా రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మహతి స్వర సాగర్‌, ఫైట్స్‌: వెంకట్‌, కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు, ఛాయాగ్రహణం: ప్రసాద్‌ మూరెళ్ల. ఈ సినిమాతో పాటు వక్కంతం వంశీ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నాడు నితిన్‌. టైటిల్‌ ఖరారుకాని ఈ సినిమాలో శ్రీలీల కథానాయిక.

sreeleela
శ్రీలీల

కాజల్​పై నెటిజన్ల ట్రోల్స్​!: మదర్స్​ డే సందర్భంగా నటి కాజల్ అగర్వాల్ చేసిన ఓ పోస్ట్ ఆమెపై ట్రోల్స్​కు దారితీసింది. తన తల్లిపై ప్రేమను చాటుతూ ఇంగ్లీష్​లో ఓ కవితను ఇన్​స్టాగ్రామ్​లో పోస్ట్ చేశారు కాజల్. దీనిని ఎంతో మంది లైక్​ చేశారు. అయితే తాను రాసిన కవిత కాజల్ సొంతంగా రాసిన దానిలా పోస్ట్​ చేశారని ఓ యూజర్ అభ్యంతరం వ్యక్తంచేశారు.

kajal aggarwal
కాజల్ అగర్వాల్

"ఇది కాజల్ సొంత కవిత లాగా ప్రచురితమవుతోంది. నేను రాసిన దానిని మార్చి ఈ విధంగా పోస్ట్​ చేయడం సరి కాదు" అంటూ సారా అనే ఓ యూజర్​ కాజల్ పోస్ట్​కు అభ్యంతరం తెలిపారు. దీనిపై విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఆమెకు క్రెడిట్ ఇస్తూ పోస్ట్​ను ఎడిట్ చేశారు కాజల్. అనంతరం కామెంట్లను ఆఫ్​ చేశారు.

kajal aggarwal
కాజల్
major film
.
ashoka vanamlo arjuna kalyanam
సోమవారం 'ఈ వేడుక' సాంగ్​ విడుదల

ఇదీ చూడండి: అలా చేస్తే నా కోరికలు తప్పకుండా నెరవేరేవి: సమంత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.